మహిళ పాలిట దెయ్యంలా మారిన డాక్టర్

Posted By:

సెల్పీల పిచ్చి ఎంతలా ముదిరిపోతుందంటే అది చివరకి మహిళలు ప్రసవిస్తున్న రూమ్‌కి కూడా పాకింది. అసలు వైద్య డాక్టర్ అంటే ఎవరు ప్రాణాలను రక్షించేవాడు. కాని ఇక్కడ డాక్టర్ మహిళ పాలిట దెయ్యంలా మారాడు. ఈ విచిత్రమైన సంఘటన అమెరికాలో జరిగింది. ప్రసవిస్తున్న మహిళ పక్కన నిలబడి ఫోటో ఆ వైద్యుడు ఫోటో తీసుకున్నారు.

Read More: కొత్త ఐడియాలను స్వాగతిద్దాం

మహిళ పాలిట దెయ్యంలా మారిన డాక్టర్

ఫోటో తీయడమే కాదు ఏకంగా దాన్ని తన ఇన్‌స్టా‌‌గ్రాం‌లో కూడా పోస్ట్ చేశారు. అంతేనా దానికి ఓ అందమైన క్యాప్షన్ కూడా పెట్టారు. నేను నీకు పురుడు పోస్తా అలాగే నన్ను ఓ సెల్పీ తీసుకోనివ్వు ఇది క్యాప్సన్ సారాంశం. ఈ పోస్ట్‌ను చూసిన మహిళా సంఘాలు అతడిపై భగ్గుమన్నాయి. రోజెస్ రివల్యూషన్ అనే సంస్థ దీనిపై ఇప్పటికే పిటిషన్ల ఉద్యమం కూడా మొదలు పెట్టింది. వైద్య విద్యార్థులు ఇలా ప్రవర్తించడం చాలా దారుణమంటూ మండి పడింది. మరి సెల్పీల పిచ్చి ముదిరితే ఇలానే ఉంటుంది మరి.

Read More: దమ్మున్న స్మార్ట్‌ఫోన్‌లు రూ.4,000కే!


English summary
Medical Student Posted Delivery Room Selfie. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot