మరీ చిత్రం:మగాళ్లు 21 సెకన్లకే అది కావాలంటున్నారట !

Written By:

ఇప్పుడు మనిషి దేనికి బానిసయ్యారంటే ఎవరైనా టక్కున చెప్పే సమాధానం అందరికీ తెలిసే ఉంటుంది. అదే స్మార్ట్‌ఫోన్..ఇది లేకుండా ఇప్పుడు పురుషులు 21 సెకన్ల కూడా గడపలేరని ఓ అధ్యయనంలో తేలింది. కనీసం ఒక నిమిషం కూడా ఫోన్ వదిలి ఉండలేని పరిస్థితికి వచ్చారని తాజా పరిశోధనలతో వెల్లడయింది. స్నేహితుడిని కాని , డాక్టర్ ను కాని కలవడానికి వెళ్లినప్పుడు ఆ గ్యాప్ లో చేతిలో మొబైల్ ఉండాల్సిందేనని ఫోన్ ఎక్కడుందా అని చేతులు వెతుక్కుంటాయని వారు చెబుతున్నారు.

Read more: నెలకు కేవలం 20రూపాయలు..100కు పైగా టీవీ చానళ్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మరీ చిత్రం: మగాళ్లు 21 సెకన్లకే అది కావాలంటున్నారట !

అధ్యయనంలో భాగంగా కొందరు వ్యక్తులను ఓ గదిలో వేచి ఉండేలా చేసి పదినిమిషాలపాటు వారి తీరును గమనించారు.

మరీ చిత్రం: మగాళ్లు 21 సెకన్లకే అది కావాలంటున్నారట !

ఈ పదినిమిషాల గడువులో సగటున 44 సెకన్లలోపే వారు తమ స్మార్ట్ ఫోన్ ను టచ్ చేయకుండా ఉండలేకపోయారు.

మరీ చిత్రం: మగాళ్లు 21 సెకన్లకే అది కావాలంటున్నారట !

ఈ విషయంలో మహిళలు కొంత నయం. వారు సగటున 57 సెకన్ల పాటు వేచి ఉన్న తర్వాత తమ స్మార్ట్ ఫోన్ లోకి తొంగిచూడగా.. పురుషులు మాత్రం 27 సెకన్లకు మించి ఉండలేకపోయారు.

మరీ చిత్రం: మగాళ్లు 21 సెకన్లకే అది కావాలంటున్నారట !

అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్ స్కై ల్యాబ్ తరఫున జర్మనీలోని వుర్జ్ బర్గ్ యూనివర్సిటీ, ఇంగ్లండ్ లోని నాటింగ్ హామ్ టెంట్ యూనివర్సిటీ ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి.

మరీ చిత్రం: మగాళ్లు 21 సెకన్లకే అది కావాలంటున్నారట !

డిజిటల్ పరికరాలతో మనుషులు పెనవేసుకున్న సహచర్యాన్ని గుర్తించేందుకు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.

మరీ చిత్రం: మగాళ్లు 21 సెకన్లకే అది కావాలంటున్నారట !

ఇందులో భాగంగా వెయింటింగ్ రూమ్ లో ఉన్నప్పుడు మీరు ఎంతసేపటి తర్వాత మొబైల్ ఫోన్ ను చూశారని అధ్యయనంలో పాల్గొన్నవారిని అడుగగా.. చాలామంది రెండు నుంచి మూడు నిమిషాల తర్వాతే తాము స్మార్ట్ ఫోన్ ను చూశామని చెప్పారు.

మరీ చిత్రం: మగాళ్లు 21 సెకన్లకే అది కావాలంటున్నారట !

ప్రజలు తాము అనుకుంటున్న దానికన్నా ఎక్కువగానే ఈ పరికరాలతో ముడిపడిపోయారని మా అధ్యయనంలో తేలింది. వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతమాత్రం స్మార్ట్ ఫోన్స్ కు దూరంగా ఉండలేని పరిస్థితి సహజ స్వభావంగా మారిపోయింది' అని ఈ అధ్యయనం నిర్వహించిన జెన్స్ బెండర్ తెలిపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Men last just 21 seconds without touching their smartphones
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot