అన్నతో తమ్ముడి వార్ : జియోని దెబ్బ కొట్టేందుకేనా..?

Written By:

గత ఏడాది నుంచి ఓ వార్త మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. అదేంటంటే ఎయిర్ సెల్ , రిలయన్స్ కమ్యూనికేషన్స్ విలీనం కాబోతున్నాయని.. కాని ఆ వార్తగానే మిగిలిందే కాని కార్యరూపం దాల్చే దిశగా అడుగులు పడరెండు టం లేదు. అయితే ఆ రోజు ఇప్పుడు ఎంతో దూరంలో లేనట్లుంది. ఇప్పుడు జియో రాకతో ఆ అడుగులు పడేలా ఉన్నాయి. రెండు సంస్థలు ఇప్పడు విలీనం దిశగా అడుగులు వేయబోతున్నాయి.

జియోకి ఊహించని షాక్:రూ.40కి పుల్ టాక్ టైంతో పాటు 1 జిబి డేటా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

అందరూ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఎయిర్ సెల్ , ఆర్ కాం విలీనానికి ముహుర్తం దగ్గరపడింది. అనిల్‌ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ తో మరో టెలీకాం సంస్థ ఎయిర్‌సెల్‌ సంస్థ విలీనంపై ఈ నెలలోనే అధికారికంగా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

#2

ఇండియాలో టాప్-3 టెలికం సంస్థగా అత్యధికమంది వినియోగదారులను సొంతం చేసుకోవాలన్న కోరికతో ఉన్న అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఇప్పుడు ఆ దిశగా వడివడిగా అడుగులేస్తోంది.

#3

బుధవారం జరగబోయే ఆర్ కాం బోర్డ్ సమావేశం అనంతరం ఈ డీల్ పై అధికారిక ప్రకటన వెలువడవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే రెండు విలీనం అవ్వడం ఖాయమే.

#4

సుమారు రూ. 14వేల కోట్ల వాటాల జారీ విధానం ద్వారా ఈ ఒప్పందం ఖరారు కానుంది. దీని ద్వారా 196 మిలియన్ల ఖాతాదారులను సాధించాలని రెండు సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్న సమాచారం.

#6

సమావేశంలో జరిగే ఒప్పందం ప్రకారం ఇరు సంస్థలు ఒక కొత్త బ్రాండ్ నేమ్ తో పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఎయిర్ సెల్,ఆర్ కాం సమాన భాగస్వామ్యంతో ఈ కొత్త సంస్థ పనిచేయనుంది. చెరి 580 మిలియన్ డాలర్ల పెట్టబడులతో 7600కోట్ల ఈక్విటీ పూల్ ను సాధించేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

#6

కొత్త కంపెనీ స్పెక్ట్రం లైసెన్స్ 800, 900,1800, 2100, 2300 ఎంహెచ్‌జె బాండ్ విడ్త్‌తో ఉంటుందని అంచనా. అయితే ఈ వార్తలను ధృవీకరించడానికి ఇరు సంస్థలు నిరాకరించాయి.

#7

కాగా ఉచిత సేవలు, ఉచితరోమింగ్ అంటూ సంచలనంగా మార్కెట్ లోకి దూసుకొచ్చిన రిలయన్స్ జియోకి పోటీగా ఆర్ కాం తాజాగా 40రూపాయలకే ఫుల్ టాక్ టైం, 1 జీబీ డాటా ఉచితంగా అందించే ఆఫర్ ప్రకటించింది.

#8

ఈ నేపథ్యంలో దేశంలోనే మూడవ అతిపెద్ద టెలికమ్యూనికేషన్ సంస్థ ఏర్పాటుపై కన్నేసిన అనిల్ ఆధ్వర్యంలోని ఆర్ కాం సోదరుడు ముకేష్ సొంతమైన జియోకి షాకిస్తుందా అనే అభిప్రాయం మార్కెట్ లో నెలకొంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Merger with Aircel likely this week after Reliance Communications board meeting read more gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot