రిలీజ్‌కు ముందే కబాలి కబాడి.. 200 వైబ్‌సైట్లు బ్యాన్

Written By:

సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన కబాలి చిత్రం ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం విదితమే. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందే అనేక ఆసక్తికర విషయాలనే బయటి ప్రపంచానికందిస్తోంది. ఈ సినిమాపై అనేక అంచనాలు నెలకొని ఉండటంతో ప్రైవసీ అనే మాటకు తావులేకుండా కట్టుదిట్టంగా దీన్ని బయటకు తీసుకువచ్చేందుకు నిర్మాతలు పావులు కదుపుతున్నారు. పైరసీ వెబ్‌సైట్లను బంద్ చేయాలని కోర్టుకు విన్నవించడంతో కోర్టు వీరికనుకూలంగా తీర్పునిచ్చింది.

గంటల తరబడి ఛాటింగ్ అతనికి కోట్లు కురిపిస్తోంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రిలీజ్‌కు ముందే కబాలి కబాడి.. 200 వైబ్‌సైట్లు బ్యాన్

ఈ సినిమాను ఏకంగా ఒక్క చెన్నైలోనే తొలిరోజు 350 ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారని సమాచారం.

రిలీజ్‌కు ముందే కబాలి కబాడి.. 200 వైబ్‌సైట్లు బ్యాన్

అమెరికాలో తెలుగు, తమిళం, ఆంగ్లంతో పాటు నాలుగు భాషల్లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఒక సినిమాను నాలుగు భాషల్లో విడుదల చేయడం కూడా అక్కడ ఓ రికార్డేనని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

రిలీజ్‌కు ముందే కబాలి కబాడి.. 200 వైబ్‌సైట్లు బ్యాన్

ఇక పైరసీకి తావు లేకుండా పైరసీకి చిరునామాగా మారిన పలు అనుమతిలేని వెబ్‌సైట్లను నిషేధించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో ఇటీవల పిటిషన్‌ వేశారు.

రిలీజ్‌కు ముందే కబాలి కబాడి.. 200 వైబ్‌సైట్లు బ్యాన్

100 కోట్లకు పైగా ఖర్చుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవలం 20 నిమిషాల్లో డౌన్ లోడ్ చేసుకుని నిర్మాతలకు నష్టాలను మిగిలుస్తున్నారని.. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని పిటిషనర్ వాదించారు.

రిలీజ్‌కు ముందే కబాలి కబాడి.. 200 వైబ్‌సైట్లు బ్యాన్

దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తులు 225 వెబ్‌సైట్లను స్తంభింపజేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నిర్మాతలకు ఓ తీపి కబురు అందినట్లైందని సినీ వర్గాలు అంటున్నాయి.

రిలీజ్‌కు ముందే కబాలి కబాడి.. 200 వైబ్‌సైట్లు బ్యాన్

ఇదిలా ఉంటే సినిమా విడుదలకు అన్నివిధాలా పనులు దాదాపు పూర్తయ్యాయి. అలాగే టికెట్ల రిజర్వేషన్‌ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. చెన్నైలోని థియేటర్లకు దాదాపు 10 రోజుల వరకు అప్పుడే రిజర్వేషన్‌ ముగిసినట్లు సమాచారం.

రిలీజ్‌కు ముందే కబాలి కబాడి.. 200 వైబ్‌సైట్లు బ్యాన్

జూన్ 3న రిలీజైన ఇరైవి తమిళ మూవీ మరుసటి రోజే వెబ్ సైట్లలో దర్శనమిచ్చింది. జూన్ 30 నాటికి ఈ సినిమాను దాదాపు 1.1 లక్షల మంది అక్రమంగా డౌన్ లోడ్ చేసుకున్నారు. తద్వారా 23 లక్షల రూపాయల ఆదాయాన్ని సర్వీసు ప్రొవైడర్లు ఆర్జించారు.

రిలీజ్‌కు ముందే కబాలి కబాడి.. 200 వైబ్‌సైట్లు బ్యాన్

ఇండియాలో దాదాపు 70 శాతం ఆదాయం ఇలా అక్రమ డౌన్ లోడ్ల ద్వారా సర్వీసు ప్రొవైడర్లకు చేరుతోంది. దీన్ని నిరోధించాల్సిన అవసరం ఉందని సినీ ప్రముఖులు అంటున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Madras High Court bans 169 service providers, more than 200 websites from releasing 'Kabali'
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot