గంటల తరబడి ఛాటింగ్ అతనికి కోట్లు కురిపిస్తోంది

Written By:

సోషల్ మీడియా అంటే గంటల తరబడి ఛాటింగ్ చేయడమే కాదు. అందులో ఆదాయం వచ్చే మార్గాలను కూడా చూడాలి. ఛాటింగ్ చేస్తూ డబ్బును సంపాదించడమనేది ఎలానో తెలుసుకుంటే మీరు షాకవుతారు. ఈ యువకుడు తన ఉద్యోగాన్ని వదిలేసి గంటల తరబడి నెట్ లో ఛాటింగ్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు. అదెలాగో మీరే చూడండి .

ట్విట్టర్‌కే దడ పుట్టిస్తున్న రాందేవ్ బాబా యోగాసనాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గంటల తరబడి ఛాటింగ్ అతనికి కోట్లు కురిపిస్తోంది

ఈ ఫోటోలో మీరు చూస్తున్న వ్యక్తి పేరు క్రిస్‌ సాంచే. ఈ యువకుడికి సోషల్ మీడియా అంటే ప్రాణం. ఇంకేముంది సోషల్‌ మీడియాలో ఎక్కువ సమయం గడపడం కోసం తన ఉద్యోగానికే రాజీనామా చేశాడు.

గంటల తరబడి ఛాటింగ్ అతనికి కోట్లు కురిపిస్తోంది

అయితే అదేమి విచిత్రమో కాని ఆ నిర్ణయమే అతనికి కోట్లు కురిపిస్తోంది.అదెలాగంటారా.. ఓ ఖాతాను తెరిచి అందులో స్నేహితులతో ఆసక్తికర విషయాలను పంచుకోవడమే అతనికి కోట్లు కురిపిస్తోంది.

గంటల తరబడి ఛాటింగ్ అతనికి కోట్లు కురిపిస్తోంది

ఇలా రోజు ఆసక్తికర విషయాలను పంచుకోవడంతో అతనికి రోజు రోజుకు ఫాలోవర్ల సంఖ్య పెరిగింది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఉబర్‌ ఫ్యాక్ట్స్‌ పేరుతో ఓ ఖాతా తెరిచి అందులో ఈ విషయాలను పోస్ట్ చేశారు.

గంటల తరబడి ఛాటింగ్ అతనికి కోట్లు కురిపిస్తోంది

దీంతో అతని ఫాలోవర్ల సంఖ్య మరింత పెరిగింది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లతో కలిపి క్రిస్‌ ఫాలోవర్ల సంఖ్య కోటీ ఎనభై లక్షలు. ఆ ఫాలోయింగే క్రిస్‌కు కోట్లు తెచ్చిపెడుతోంది.

గంటల తరబడి ఛాటింగ్ అతనికి కోట్లు కురిపిస్తోంది

ఫాలోవర్లు ఎక్కువ కావడంతో కొన్ని వెబ్‌సైట్లు, పలు ఉత్పత్తి సంస్థలు క్రిస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. వెబ్‌సైట్లు కొంత ఆసక్తికర సమాచారాన్ని క్రిస్‌ అకౌంట్లో పెడతాయి. పూర్తి సమాచారం కావాలంటే క్లిక్‌ చేయండి అంటూ తమ సైట్‌ అడ్రస్‌ ఇస్తాయి.

గంటల తరబడి ఛాటింగ్ అతనికి కోట్లు కురిపిస్తోంది

అలా ఎంత మంది క్రిస్‌ అకౌంట్‌ నుంచి సదరు వెబ్‌సైట్లకు మళ్లుతున్నారో లెక్కగట్టి అంత డబ్బు క్రిస్‌కు అందిస్తాయి. ఇక పలు ఉత్పత్తి సంస్థలు క్రిస్‌ అకౌంట్లో తమ ప్రకటనలు పెట్టుకుని డబ్బులు చెల్లిస్తాయి.

గంటల తరబడి ఛాటింగ్ అతనికి కోట్లు కురిపిస్తోంది

ఇలా పలు మార్గాల ద్వారా క్రిస్‌ ఏడాదికి మూడు కోట్ల రూపాయలపైనే సంపాదిస్తున్నాడు. మొత్తానికి ఉద్యోగాన్ని వదిలి సాహసం చేసిన క్రిస్‌ తనకు ఇష్టమైన రంగంలోనే డబ్బులు సంపాదిస్తున్నాడు.

గంటల తరబడి ఛాటింగ్ అతనికి కోట్లు కురిపిస్తోంది

మీరు కూడా అలా కొత్తగా ఏదైనా ట్రైచేసి చూడండి. కోట్లు కాకపోయినా లక్షలైనా వస్తాయి 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write How a 23-year-old makes $500,000 a year tweeting random facts
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot