Mi TV 4X 55-inch 2020 ఎడిషన్‌ : ధర & ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి

|

షియోమి సంస్థ భారత మార్కెట్లో స్మార్ట్ఫోన్ విభాగంలో మాత్రమే కాకుండా స్మార్ట్ టివి రంగంలో కూడా ప్రసిద్ది చెందింది. ఈ కంపెనీ రాకతో స్మార్ట్ టీవీలు సరసమైన ధరలలో లభిస్తున్నాయి. కొన్ని నెలల క్రితం షియోమి నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోలకు స్థానిక మద్దతుతో అప్డేట్ చేయబడిన Mi టివి 4X సిరీస్‌ను ఇండియాలో విడుదల చేసింది.

షియోమి

షియోమి అప్పుడు 43-inch, 50-inch మరియు 65-inch పరిమాణంలో కొత్త వెర్షన్‌ టీవీలను విడుదల చేసింది. అయితే ఇప్పుడు కొత్తగా షియోమి ఈ రోజు 55 అంగుళాల Mi టీవీ 4X 2020 ఎడిషన్ మోడల్ యొక్క కొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌ను కొన్ని సరి కొత్త ఫీచర్లతో విడుదల చేసింది. ఇది డిసెంబర్ 2 నుండి అమ్మకాలకు వెళ్లనున్నది. Mi యొక్క 2020 ఎడిషన్ గత సంవత్సరం రిలీజ్ అయిన Mi టివి 4 ఎక్స్ ప్రో 55-inch మాదిరిగానే ఉంటుంది కానీ సరికొత్త అప్డేట్ లను కలిగి ఉంటుంది.

 

Fast tags: రికార్డు స్థాయిలో ఫాస్ట్ ట్యాగ్‌ల సేల్స్Fast tags: రికార్డు స్థాయిలో ఫాస్ట్ ట్యాగ్‌ల సేల్స్

Mi టీవీ 4X 2020 ఎడిషన్‌
 

Mi టీవీ 4X 2020 ఎడిషన్‌లోని అతి పెద్ద మార్పు నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోలకు స్థానిక మద్దతును అందివ్వడం. అంటే వినియోగదారులు మూడవ పార్టీ మొబైల్ యాప్ ల యొక్క సైడ్‌లోడింగ్‌కు బదులుగా నెట్‌ఫ్లిక్స్ మరియు ప్రైమ్ వీడియోలను నేరుగా యాక్సెస్ చేయగలరు. ఈ టీవీతో పాటుగా వచ్చే Mi రిమోట్ కంట్రోలర్ నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోలను ఓపెన్ చేయడానికి ప్రత్యేకమైన బటన్లను కూడా కలిగి ఉంటుంది.

 

వివో Z 5i స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్, వివో U20 మొదటి సేల్ ప్రారంభంవివో Z 5i స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్, వివో U20 మొదటి సేల్ ప్రారంభం

ఆండ్రాయిడ్

Mi టీవీ 4X 2020 ఎడిషన్ యొక్క ఇతర ప్రత్యేక లక్షణాలలో భాగంగా ఇది తాజా ఆండ్రాయిడ్ TV OS ను కలిగి ఉంటుంది. ఈ కొత్త మోడల్‌కు ప్యాచ్‌వాల్ 2.0 అంతర్ నిర్మితంతో పాటు ఆండ్రాయిడ్ 9 పై టీవీ OSను కలిగి ఉంటుంది. కొత్త ప్యాచ్‌వాల్ ఇంటర్‌ఫేస్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు హాట్‌స్టార్‌తో సహా అన్ని కంటెంట్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి 4K కంటెంట్ ను అందిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ మద్దతుతో వస్తున్నందున ఇది క్రోమ్ కాస్ట్, నేటివ్ YouTube యాప్, గూగుల్ అసిస్టెంట్ వంటి వాటి మద్దతును కలిగి ఉంటుంది. షియోమి అంతర్నిర్మిత స్థానిక డేటా సేవర్ మోడ్‌ను కూడా కలిగి ఉంది.

 

లాంగ్ టర్మ్ ప్లాన్‌లను అందించే ఏకైక DTH ఆపరేటర్ ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీలాంగ్ టర్మ్ ప్లాన్‌లను అందించే ఏకైక DTH ఆపరేటర్ ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ

Mi టివి

Mi టివి 4 ఎక్స్ 55 2020 ఎడిషన్ 20W స్టీరియో స్పీకర్ సిస్టమ్‌తో పాటు 4K 10-బిట్ హెచ్‌డిఆర్ 10 డిస్‌ప్లేతో పాటు షియోమి Vivid పిక్చర్ ఇంజిన్‌ని కలిగి ఉంది. ఇది డాల్బీ అట్మోస్ ఆడియోతో పాటు డిటిఎస్-హెచ్‌డికి కూడా మద్దతు ఇస్తుంది.

Mi టివి 4X 55-inch

Mi టివి 4X 55-inch 2020 ఎడిషన్ యొక్క ధర రూ.34,999. ఇది డిసెంబర్ 2 మధ్యాహ్నం 12 గంటల నుండి కొనుగోలు చేయవచ్చు. జనవరి 31, 2020 లోపు Mi టీవీలను కొనుగోలు చేసే కస్టమర్లకు ఎయిర్‌టెల్ డిటిహెచ్ కనెక్షన్‌ యొక్క 4 నెలల చందా దాని రెగ్యులర్ ధర రూ.3,450 లతో పోలిస్తే తగ్గింపు ధరతో కేవలం రూ.1,800 లతో కనెక్షన్‌ను పొందడానికి అర్హులు అవుతారు. ఈ కొత్త మోడల్ Mi.com, Mi హోమ్ స్టోర్స్ మరియు అమెజాన్ లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

 

 

Best Mobiles in India

English summary
Mi TV 4X 55-inch 2020 Edition Smart TV Launched: Supports Netflix And Prime Video

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X