చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా షియోమి Mi చిల్డ్రన్స్ వాచ్ 2S

|

గత నెలలో షియోమి Mi వాచ్ తో పాటు చైనాలో Mi నోట్ 10 ను ప్రకటించింది. స్మార్ట్ వాచ్ యొక్క ఫీచర్స్ మరియు డిజైన్ యొక్క రెండింటి పరంగా బాగా ఆకట్టుకుంటున్నది. ఫీచర్స్ పరంగా ఇది ఆపిల్ వాచ్‌కు అన్ని విధాలుగా సరిపోలి ఉన్నప్పటికీ ఇది చాలా సరసమైన తక్కువ ధరను కలిగి ఉంది.

Mi రాబిట్ చిల్డ్రన్స్ వాచ్ 2S
 

అయినప్పటికీ ఇది ఇప్పటికీ చిన్న పిల్లలకు తగినది కాదు. అందువల్ల షియోమి సంస్థ ఇప్పుడు పిల్లలను ఉద్దేశించి వారి కోసం ప్రత్యేకంగా కొత్త Mi రాబిట్ చిల్డ్రన్స్ వాచ్ 2S స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్ లోకి తీసుకురాబోతున్నది. దీని ధర 199 యువాన్లు లేదా రూ.2,000 మాత్రమే.

Mi రాబిట్ చిల్డ్రన్స్ వాచ్ 2S

Mi రాబిట్ చిల్డ్రన్స్ వాచ్ 2S ఇండియాలో షియోమి యొక్క Mi బ్యాండ్ 4 ఫిట్‌నెస్ ట్రాకర్ కంటే తక్కువ ధరను కలిగి ఉంది. అయితే దీని యొక్క ఆన్-పేపర్ స్పెసిఫికేషన్లను చూస్తే ఇతర ఫిట్‌నెస్ ట్రాకర్ల కంటే ఎక్కువ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇది Mi వాచ్ మోడల్ మాదిరిగా తయారుచేయబడి ఉంటుంది. కానీ మూలల ఎక్కడ కత్తిరించబడినట్లు ఉండడం మీరు చూడవచ్చు. Mi వాచ్ లేదా Mi బ్యాండ్ 4 మాదిరిగా కాకుండా Mi రాబిట్ చిల్డ్రన్స్ వాచ్ 2S లో ఫిట్నెస్ ట్రాకింగ్ ఫంక్షన్లు ఉండవు. ఇది పిల్లల కోసం ఉద్దేశించబడింది కావున ఇది విద్యార్థులకు వారి స్టడీస్ కోసం సహాయపడే లక్షణాలతో వస్తుంది.

Vivo U20 Sale : గొప్ప ఆఫర్లతో అమెజాన్ లో రేపటి నుండి అమ్మకాలు

స్పెసిఫికేషన్స్
 

స్పెసిఫికేషన్స్

Mi రాబిట్ చిల్డ్రన్స్ వాచ్ 2S లో 1.3-అంగుళాల కొలతలు గల స్క్వేరిష్ డిస్ప్లే ఉంది. డిస్ప్లే టచ్ ఇన్‌పుట్‌లను నమోదు చేస్తుంది మరియు ఇది 240 x 240-పిక్సెల్ రిజల్యూషన్ కలర్ ఐపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని యొక్క బాడీ ప్లాస్టిక్ మరియు ఇతర సాఫ్ట్-టచ్ పదార్థాలతో పట్టీల రూపంలో తయారుచేయబడి ఉంటుంది. ఇది పిల్లలకు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇది ఎరుపు లేదా నీలం రంగులలో లభిస్తుంది.

RS.300లలోపు వోడాఫోన్ అన్‌లిమిటెడ్ కాంబో ప్రీపెయిడ్ ప్లాన్స్

AI జిపిఎస్

కార్యాచరణ విషయానికొస్తే Mi చిల్డ్రన్స్ వాచ్ 2S AI జిపిఎస్ పొజిషనింగ్‌తో వస్తుంది. ఇది పిల్లల యొక్క ఖచ్చితమైన లొకేషన్ సమాచారాన్ని తల్లిదండ్రుల స్మార్ట్‌ఫోన్‌కు యాప్ ద్వారా ప్రసారం చేస్తుంది. అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను మ్యాప్‌లో తక్కువ సమయంలో ఖచ్చితంగా ట్రాక్ చేయవచ్చు.

బ్యాటరీ

అదనంగా ఇది SOS మెసేజ్ లను మరియు టైం చూడడాన్ని మాత్రమే అనుమతించే మోడ్ లను కలిగి ఉండడం వలన తరగతి గదిలో ఎటువంటి ఇబ్బందికర విషయాలు కలుగవు. ఇందులో XiaoAI వాయిస్ అసిస్టెంట్ మద్దతు కూడా ఉంది. అది ప్రశ్నలకు సమాధానాలు, సంగీతాన్ని ప్లే చేయడం మరియు కదలికలో మరికొన్ని విధులను అందిస్తుంది. ఈ గడియారంలోని ప్రశ్నలకు ఎన్‌సైక్లోపీడియా సమాధానాలతో మాత్రమే అసిస్టెంట్ సమాధానం ఇస్తుందని షియోమి తెలిపింది. గడియారాన్ని ఎల్లప్పుడూ ఆన్ లో ఉంచడానికి ఈ వాచ్ 600 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది ఒక ఛార్జ్‌లో ఏడు రోజుల వరకు క్లెయిమ్‌ చేయగలదని షియోమి పేర్కొంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Xiaomi Mi Rabbit Children Watch Announced

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X