5G స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేసే ఆలోచనలో Micromax కంపెనీ!!
మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఇప్పుడు ఇండియాలో తన యొక్క మార్కెట్ ను పెంచుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలను మొదలుపెట్టింది. అందులో భాగంగానే సంస్థ యొక్క మొదటి 5G ఫోన్ ను అతి త్వరలోనే భారతదేశంలో విడుదల చేయనున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ ఇటీవల నిర్వహించిన వీడియో సెషన్‌లో వెల్లడించారు. అలాగే దీనితో పాటుగా మైక్రోమాక్స్ యొక్క ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్‌ను ప్రారంభించనున్నట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ సూచించాడు. మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 మరియు మైక్రోమాక్స్ ఇన్ 1B మోడళ్ల లాంచ్ తో మైక్రోమాక్స్ సంస్థ గత ఏడాది భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తిరిగి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మైక్రోమాక్స్ 5G కొత్త ఫోన్ ఇండియా లాంచ్
ఇటీవల వినియోగదారులతో నిర్వహించిన వీడియో సెషన్‌లో మైక్రోమాక్స్‌లో 11 నిమిషాల పాటు మాట్లాడిన సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ సంస్థ యొక్క భవిషత్తు అభివృద్ధి ప్రణాళికలలో భాగంగా తమ బెంగళూరు R&D సెంటర్‌లో పనిచేస్తున్న ఇంజనీర్లు 5G ఫోన్ కోసం కఠినంగా పనిచేస్తున్నారని తెలిపారు. అయితే ఈ కొత్త 5G ఫోన్ త్వరలోనే ప్రారంభమవుతుందని చెప్పడం తప్ప ఇండియాలో ఎప్పుడు విడుదల అవుతుంది అన్న దాని మీద ఎటువంటి ఖచ్చితమైన సమాచారాన్ని అందించలేదు.

మైక్రోమాక్స్ TWS ఇయర్‌బడ్‌లు
గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన వీడియో సెషన్‌లో శర్మ 6GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌ను అధిక డిస్ప్లే రిఫ్రెష్ రేట్, లిక్విడ్ కూలింగ్‌తో విడుదల చేయాలని సూచించారు. అయితే ఆ మోడల్ ఇంకా అధికారికంగా కంపెనీ ప్రకటించలేదు. ఈ వివరాల ఆధారంగా చూసుకుంటే కనుక దీనిని కూడా మైక్రోమాక్స్ 5G ఫోన్‌తో అనుబంధించబడే అవకాశాలు చాలానే ఉన్నాయి. బెంగళూరు ఆర్‌అండ్‌డి సెంటర్‌లోని మైక్రోమాక్స్ ఇంజనీర్లు 5G ఫోన్‌తో పాటుగా మొబైల్ ఉపకరణాలను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు శర్మ తెలిపారు. సంస్థ యొక్క మొదటి TWS ఇయర్‌బడ్‌లను త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం.

మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లకు ఆండ్రాయిడ్ 11 కొత్త అప్‌డేట్
మైక్రోమాక్స్ సంస్థ యొక్క కొత్త ఉత్పత్తులతో పాటుగా గత సంవత్సరంలో విడుదల అయిన మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 స్మార్ట్‌ఫోన్‌కు ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్ ఏప్రిల్‌లో పొందనున్నట్లు పేర్కొన్నారు. కంపెనీ తన ప్రత్యేక ఫోరమ్‌లలో సైన్ అప్ చేసే వినియోగదారులకు ముందస్తు యాక్సిస్ ను అందిస్తుందని ఆయన చెప్పారు. మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ఫోన్ నవంబర్ 2020 లో ఆండ్రాయిడ్ 10 తో లాంచ్ చేశారు. విడుదల సమయంలో రెండేళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లను అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.

మైక్రోమాక్స్ ఇన్ 1B సాఫ్ట్‌వేర్ అప్‌డేట్
మైక్రోమాక్స్ ఇన్ 1B స్మార్ట్‌ఫోన్ ఈ నెలలో కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ను పొందుతుందని టాప్ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. ఆండ్రాయిడ్ 11 ను ఎంట్రీ లెవల్ మోడల్‌కు తీసుకువచ్చే అవకాశం లేనప్పటికీ కొత్త అప్‌డేట్ లో భాగంగా కెమెరా మరియు ఎకౌస్టిక్ మెరుగుదలలు, స్లో-మోషన్ వీడియో రికార్డింగ్, జనవరి 2021 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ మరియు మొత్తం పనితీరు మెరుగుదలలను తీసుకువస్తుందని తెలిపారు. దాని రోల్ అవుట్ యొక్క ఖచ్చితమైన తేదీ ఇంకా వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications








