మైక్రోసాప్ట్ చరిత్రలో అతి పెద్ద డీల్‌ : ముఖ్యాంశాలు ఇవే..

Written By:

ప్రపంచ టెక్నాలజీ రంగంలో అతి పెద్ద డీల్ కు మరోసారి తెరలేచింది. ఈ సారి తెరలేపిన టెక్ కంపెనీ మైక్రోసాప్ట్. వివిధ వ్యాపార రంగాలకు చెందిన నిపుణులు,ఉద్యోగులు, సంస్థలకు ఆన్‌లైన్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌గా పనిచేస్తున్న లింక్డ్‌ఇన్‌ను భారీ మొత్తానికి చేజిక్కించుకుంటున్నట్లు మైక్రోసాప్ట్ ప్రకటించింది. మైక్రోసాప్ట్ చరిత్రలో ఇదే అతి పెద్ద డీల్ కాగా సత్య నాదెళ్ల బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన భారీ డీల్ కూడా ఇదే కావడం గమనార్హం. డీల్ ముఖ్యాంశాలేంటో చూద్దాం.

Read more: యూజర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఫేస్‌బుక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోసాప్ట్ చరిత్రలో అతి పెద్ద డీల్‌ : ముఖ్యాంశాలు ఇవే..

ఈ డీల్ కోసం ఏకంగా 26.2 బిలియన్ డాలర్ల మొత్తాన్నిఅంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.1.75 లక్షల కోట్లను చెల్లించడానికి మైక్రోసాప్ట్ రెడీ అయింది. పూర్తిగా నగదు రూపంలో ఈ కొనుగోలు ఒప్పందం ఉంటుందని.. లింక్డ్‌ఇన్‌కు చెందిన ఒక్కో షేరుకి 196 డాలర్ల చొప్పున విలువ కట్టినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది.

మైక్రోసాప్ట్ చరిత్రలో అతి పెద్ద డీల్‌ : ముఖ్యాంశాలు ఇవే..

లింక్డ్‌ఇన్ బ్రాండ్‌ను యథాతథంగా కొనసాగిస్తారు. కంపెనీ సీఈఓ బాధ్యతల్లో ఎటువంటి మార్పులు ఉండవు. ప్రస్తుత కంపెనీ సీఈఓగా వ్యవహరిస్తున్న జెఫ్ వీనర్ సత్య నాదెళ్ల ఆధ్వర్యంలో పనిచేస్తారు.

మైక్రోసాప్ట్ చరిత్రలో అతి పెద్ద డీల్‌ : ముఖ్యాంశాలు ఇవే..

లింక్డ్‌ఇన్ కొనుగోలుకు సంబంధించిన నిధుల కోసం కొత్తగా రుణాలను సమీకరించనున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. డీల్ పూర్తయిన తర్వాత లింక్డ్‌ఇన్ ఆర్థికాంశాలన్నింటినీ మైక్రోసాఫ్ట్ తన ప్రొడక్టివిటీ అండ్ బిజినెస్ ప్రాసెస్ విభాగంలో భాగంగా చూపనుంది.

మైక్రోసాప్ట్ చరిత్రలో అతి పెద్ద డీల్‌ : ముఖ్యాంశాలు ఇవే..

ఈ ఏడాది జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి 9,200 మంది ఉద్యోగులు ఉన్నారు. భారత్‌లోని బెంగళూరుతో సహా ప్రపంచవ్యాప్తంగా 30 నగరాల్లో ఆఫీసులున్నాయి. వీటిలో బీజింగ్, షికాగో, దుబాయ్, డబ్లిన్, హాంకాంగ్, లండన్‌లు కొన్ని.

మైక్రోసాప్ట్ చరిత్రలో అతి పెద్ద డీల్‌ : ముఖ్యాంశాలు ఇవే..

భారత్‌లోనూ లింక్డ్‌ఇన్‌కు ప్రత్యక్ష కార్యకలాపాలు ఉన్నాయి. బెంగళూరులో ఒక పరిశోధన-అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ) కార్యాలయం ఉంది. ఇందులో సుమారు 650 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. లింక్డ్‌ఇన్ బిజినెస్ ఆధారిత సోషల్ నెట్‌వర్కింగ్ సేవల్లో ప్రపంచ దిగ్గజంగా నిలుస్తోంది. యూజర్ల వివరాలను నియామక సంస్థలకు అందించడం ద్వారా ప్రధానంగా లింక్డ్‌ఇన్‌కు ఆదాయం లభిస్తోంది.

మైక్రోసాప్ట్ చరిత్రలో అతి పెద్ద డీల్‌ : ముఖ్యాంశాలు ఇవే..

2002 డిసెంబర్‌లో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన మౌంటెన్ వ్యూలో ఈ సంస్థ ఆవిర్భవించింది. అధికారికంగా లింక్డ్‌ఇన్ వెబ్‌సైట్ మాత్రం 2003 మే 5న మొదలైంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు ప్రస్తుత చైర్మన్ అయిన రీడ్ హాఫ్‌మన్ తన నివాసంలోని లివింగ్ రూమ్ వేదికగా లింక్డ్‌ఇన్‌ను ప్రారంభించారు.

మైక్రోసాప్ట్ చరిత్రలో అతి పెద్ద డీల్‌ : ముఖ్యాంశాలు ఇవే..

అలెన్ బ్లూ, కాన్‌స్టాంటిన్ గుయెరికీ, ఎరిక్ లీ, జీన్ లూక్ వెయిలంట్‌లు దీనికి ఇతర సహ-వ్యవస్థాపకులు. కంపెనీలో నియంత్రణ వాటా మాత్రం చైర్మన్ రీడ్ హాఫ్‌మన్ చేతిలోనే ఉంది.

మైక్రోసాప్ట్ చరిత్రలో అతి పెద్ద డీల్‌ : ముఖ్యాంశాలు ఇవే..

2011 మే నెలలో కంపెనీ ఐపీఓ ద్వారా(షేరు ధర 45 డాలర్లు) న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయింది. 2004లో గూగుల్ లిస్టింగ్ తర్వాత ఇంటర్నెట్ కంపెనీల ఐపీఓల్లో ఇదే అతిపెద్దదిగా నిలిచింది.

మైక్రోసాప్ట్ చరిత్రలో అతి పెద్ద డీల్‌ : ముఖ్యాంశాలు ఇవే..

లింక్డ్‌ఇన్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 43.3 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఇందులో 9.2 కోట్ల యూజర్లు ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి చెందినవారే. యూజర్ల సంఖ్యలో ఏటా 19 శాతం వృద్ధి నమోదవుతోంది.

మైక్రోసాప్ట్ చరిత్రలో అతి పెద్ద డీల్‌ : ముఖ్యాంశాలు ఇవే..

సాఫ్ట్‌వేర్, టెక్నాలజీ రంగంలో ప్రపంచ దిగ్గజంగా వెలుగొందుతున్న మైక్రోసాఫ్ట్.. 1987లో తొలిసారిగా ఫోర్‌థాట్ అనే కంపెనీని చేజిక్కించుకోవడం ద్వారా కొనుగోళ్ల పర్వాన్ని ఆరంభించింది.

మైక్రోసాప్ట్ చరిత్రలో అతి పెద్ద డీల్‌ : ముఖ్యాంశాలు ఇవే..

2002లో నావిసన్‌ను 1.45 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. 2011లో స్కైప్‌ను 8.5 బిలియన్ డాలర్లకు చేజిక్కించుకుంది.

మైక్రోసాప్ట్ చరిత్రలో అతి పెద్ద డీల్‌ : ముఖ్యాంశాలు ఇవే..

ఇక 2012లో యామెర్(1.2 బిలియన్ డాలర్లు), 2013లో నోకియా మొబైల్ హ్యాండ్‌సెట్ వ్యాపారం(9.4 బిలియన్ డాలర్లు), 2014లో మొజాంగ్(2.5 బిలియన్ డాలర్లు) మైక్రోసాఫ్ట్ ఖాతాలోకి చేరాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Microsoft bought LinkedIn for 26.2 billion LNKD shares jump 47 percent
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot