Home
News

సత్యనాదెళ్ల జీతం రూ.525కోట్లు, అమెరికాలో టాప్

అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక వేతనాన్ని అందుకుంటున్న సీఈఓల జాబితాలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అగ్రస్థానంలో నిలిచారు. భారతీయుడు అందులో తెలుగువాడైన సత్యనాదెళ్లకు ఏడాదికి 84.3 మిలియన్ డాలర్లు (రూ.525కోట్ల) వేతనం లభిస్తోంది. దీంతో అమెరికాలో అత్యధిక వేతనాన్ని అందుకుంటున్న సీఈఓగా సత్య నిలిచారు. ఒరాకిల్ చీఫ్ లారీ ఎల్లీసన్ 67.3 మిలియన్ డాలర్లతో ఈ ఏడాది ఆయన రెండవ స్థానంలో నిలిచారు.

ఇంకా చదవండి: వాట్సాప్ గురించి మరికొన్ని నిజాలు

మూడవ స్థానంలో క్వాల్కమ్ చీఫ్ స్టీవెన్ మోలెన్‌కాఫ్ 60.7 మిలియన్ డాలర్లతో మూడవ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో మరో భారత సంతతి వ్యక్తి.. పెప్సికో సీఈఓ ఇంద్రా నూయికి 19వ స్థానంలో నిలిచారు. ఈమెకు లభించే వార్షిక వేతనం 19.08 మిలియన్ డాలర్లు. అమెరికాకు చెందిన 100 నమోదిత దిగ్గజ కంపెనీల సీఈఓల వేతనాలతో కూడిన ‘ది ఈక్విలార్ 100 సీఈఓ పేస్టడీ' జాబితాను ప్రతి ఏటా ప్రకటిస్తారు. మైక్రోసాఫ్ట్ సత్యనాదెళ్ల గురించి 10 ఆసక్తికర విషయాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు..

సత్యనాదెళ్ల జీతం రూ.525కోట్లు, అమెరికాలో టాప్

సత్యనాదెళ్ల జీతం రూ.525కోట్లు, అమెరికాలో టాప్

సత్య నాదెళ్ల 1967లో హైదరాబాద్‌లో జన్మించారు. హైదారాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి. మంగళూరు విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసిన సత్య నాదెళ్ల ఆ తరువాత ఎంఎస్ కోసం అమెరికాలోని విన్‌కాసిన్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. సత్య నాదెళ్ల స్వస్థలం అనంతపురం జిల్లాలోని బుక్కాపురం గ్రామం.

సత్యనాదెళ్ల జీతం రూ.525కోట్లు, అమెరికాలో టాప్

సత్యనాదెళ్ల జీతం రూ.525కోట్లు, అమెరికాలో టాప్

సత్యనాదెళ్ల తండ్రి బీఎన్ యుగంధర్ 962 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. రాష్ట్రంలో మంచి అధికారిగా పేరుతెచ్చుకున్నారు. 2004 నుంచి 2009 వరకు ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రణాళిక సంఘం సభ్యునిగా.. ప్రధానమంత్రి కార్యదర్శిగా పనిచేశారు.

సత్యనాదెళ్ల జీతం రూ.525కోట్లు, అమెరికాలో టాప్

సత్యనాదెళ్ల జీతం రూ.525కోట్లు, అమెరికాలో టాప్

సత్య నాదెళ్ల 1992లో మైక్రోసాఫ్ట్ విండస్ డెవలప్‌మెంట్ విభాగంలో ప్రోగ్రామ్ మేనేజర్‌గా పని చేసారు. 1999లో మైక్రోసాఫ్ట్ బీసెంట్రల్ విభాగానికి ఉపాధ్యక్షుడిగా, 2001లో మైక్రోసాఫ్ట్ బిజెనెస్ సొల్యూషన్స్ విభాగానికి కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా, 2007లో ఆన్‌లైన్ సేవల విభాగానికి సీనియర్ ఉప్యాధ్యక్షుడిగా, 2011లో మైక్రోసాఫ్ట్ సర్వర్ అండ్ టూల్స్ వాణిజ్య విభాగానికి అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో సేవలందించారు. 2014లో ఏకంగా కంపెనీ సీఈఓ బాధ్యతలను స్వీకరించి ఆ పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.

సత్యనాదెళ్ల జీతం రూ.525కోట్లు, అమెరికాలో టాప్

సత్యనాదెళ్ల జీతం రూ.525కోట్లు, అమెరికాలో టాప్

మైక్రోసాఫ్ట్ క్లౌడ్, ఎంటర్‌ప్రైస్ బిజినెస్‌ను అభివృద్థి చేయటంలో సత్య నాదెళ్ల కీలక పాత్ర పోషించారు. భవిష్యత్త్ ప్రపంచ టెక్నాలజీగా భావిస్తున్న 'క్లౌడ్' (ప్రత్యేకంగా 'అజూర్')పై సత్య నాదెళ్లకు పూర్తి పట్టుంది.

సత్యనాదెళ్ల జీతం రూ.525కోట్లు, అమెరికాలో టాప్

సత్యనాదెళ్ల జీతం రూ.525కోట్లు, అమెరికాలో టాప్

సాంకేతిక విభాగంలో ఉన్నత చదువులు చదివిన సత్య ఎంబీఏ కూడా చదవడం మారుతున్న పరిస్థితులను ఆకళింపు చేసుకుని అందుకు అనుగుణంగా ఎదగడాన్ని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలి. పుస్తకాలు చదవడం, ఆన్‌లైన్ కోర్సులు పూర్తి చేయడంపై సత్య ఆసక్తి చూపుతుంటారు. ఎప్పుడూ కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉండకపోతే గొప్ప పనులు చేయలేమన్నది ఆయన విశ్వాసం.

సత్యనాదెళ్ల జీతం రూ.525కోట్లు, అమెరికాలో టాప్

సత్యనాదెళ్ల జీతం రూ.525కోట్లు, అమెరికాలో టాప్

సత్య నాదెళ్లకు క్రికెట్ ఆడటమంటే చాలా ఇష్టం. క్రికెట్ ఆడటమే నాకు అన్నీ నేర్పిందని చెబుతుంటారు సత్య. పాఠశాల జట్టులో అతను ఆడుతూ వచ్చాడు. జట్టుతో కలిసి పనిచేయడం క్రికెట్ ఆడడం వల్ల నేర్చుకున్నానని, జీవితమంతా తనకు నాయకత్వం ఉందని సత్య నాదెల్ల అన్నారు.

సత్యనాదెళ్ల జీతం రూ.525కోట్లు, అమెరికాలో టాప్

సత్యనాదెళ్ల జీతం రూ.525కోట్లు, అమెరికాలో టాప్

సత్య నాదెళ్ల తన హైస్కూల్ స్నేహితురాలు అనుపమను వివాహమాడారు. వీరికి ముగ్గురు పిల్లలు. వాషింగ్టన్‌లో స్థిర నివాసం.

సత్యనాదెళ్ల జీతం రూ.525కోట్లు, అమెరికాలో టాప్

సత్యనాదెళ్ల జీతం రూ.525కోట్లు, అమెరికాలో టాప్

సత్య నాదెళ్ల ఏకాగ్రత మొత్తం మైక్రోసాఫ్ట్ అభివృద్థి పైనే. సత్యనాదెళ్ల చేసే ప్రసంగాలు నేటి యువతకు ఎంతో స్పూర్తినిస్తాయి.

Best Mobiles in India

English summary
Microsoft CEO Satya Nadella tops global CEO pay chart. Read more in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X