Home
News

‘Windows 7’కు ముగింపు పలికిన మైక్రోసాఫ్ట్

విండోస్ ఎక్స్‌పి తరహాలోనే విండోస్7 ఆపరేటింగ్ సిస్టంకు మైక్రోసాఫ్ట్ ముగింపు పలికింది.

By Sivanjaneyulu Bommu

విండోస్ 7, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టంలను వినియోగిస్తోన్న యూజర్లకు షాకింగ్ న్యూస్. ముందుగా ప్రకటించిన విధంగానే విండోస్ 7, విండోస్ 8.1 సాఫ్ట్ వేర్ విక్రయాలను మైక్రోసాప్ట్ అక్టోబర్ 31, 2016తో నిలిపివేసింది. విండోస్ 7, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టంలకు సంబంధించి లైఫ్ సైకిల్ అధికారికంగా ముగిసినట్లే.

‘Windows 7’కు ముగింపు పలికిన మైక్రోసాఫ్ట్

Read More: ఫోన్ నెంబర్‌తో పనిలేకుండా వాట్సాప్ వాడటం ఎలా..?

ఈ రెండు ఆపరేటింగ్ సిస్టంలను మైక్రోసాఫ్ట్ నిలిపివేయటంతో డెల్, హెచ్‌పీ, లెనోవో వంటి కంపెనీలు ఇక పై తమ పీసీలను విండోస్ 10తో అందించాల్సి ఉంటుంది. విండోస్ 7, విండోస్ 8.1 యూజర్లు ఇప్పటికిప్పుడు విండోస్ 10కు మారవల్సిన అవసరం లేదు. విండోస్ 7కు సంబంధించిన సెక్యూరిటీ అప్‌డేట్‌లను జనవరి 14, 2020 వరకు మైక్రోసాఫ్ట్ అందించనుంది. విండోస్ 8.1కు సంబంధించిన సెక్యూరిటీ అప్‌డేట్స్ జనవరి 10, 2023 వరకు లభిస్తాయి.

వ్యక్తిగత కంప్యూటర్ల విభాగంలో ..

వ్యక్తిగత కంప్యూటర్ల విభాగంలో ..

వ్యక్తిగత కంప్యూటర్ల విభాగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చిన సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన మొదటి విండోస్ వర్షన్‌ను నవంబర్ 20, 1985న ప్రపంచానికి పరిచయం చేసింది. అనాటి నుంచి ఈనాటి వరకు తన విండోస్ ఆపేరటింగ్ సిస్టంను సమర్థవంతంగా అప్‌డేట్ చేస్తూ ఈ బిల్ గేట్స్ కంపెనీ దిగ్విజయంగా తన 30వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది.

 MS-DOSకు గ్రాఫికల్ ఆపరేటంగ్ సిస్టంగా

MS-DOSకు గ్రాఫికల్ ఆపరేటంగ్ సిస్టంగా

వాస్తవానికి, విండోస్ తన మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టంను MS-DOSకు గ్రాఫికల్ ఆపరేటంగ్ సిస్టంగా పరిచయం చేసింది. అయితే, గ్రాఫిక్ యూజర్ ఇంటర్‌ఫేస్‌కు మార్కెట్లో ఆదరణ పెరుగుతోందని భావించిన మైక్రోసాఫ్ట్ తన గ్రాఫిక్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టంలా మార్చేసింది. 1984 నుంచి 2015 వరకు మైక్రోసాఫ్ట్ విండోస్ వివిధ వర్షన్‌లలో కంప్యూటింగ్ ప్రపంచానికి చేరువైన వైనాన్ని ఇప్పుడు చూద్దాం...

విండోస్ 1.0, 2.x (1985 - 87)

విండోస్ 1.0, 2.x (1985 - 87)

 విండోస్ తన మొదటి వర్షన్‌ను నవంబర్ 1985లో విడుదల చేసింది. విండోస్ వర్షన్ 1.0 అలానే 2.xలు MS-DOSకు గ్రాఫికల్ ఎక్స్‌టెన్షన్‌లుగా వచ్చాయి.

విండోస్ 1.0, 2.x (1985 - 87)

విండోస్ 1.0, 2.x (1985 - 87)

 మైక్రోసాఫ్ట్ విండోస్ కంట్రోల్ ప్యానల్ మొదటి సారిగా విండోస్ 2.0లో కనిపిచ్చింది. అయితే ఈ రెండు ఆపరేటింగ్ సిస్టంలు మార్కెట్లో ఆకట్టుకోలేకపోయాయి.

విండోస్ 3.x & NT 3.X [1990-1994]

విండోస్ 3.x & NT 3.X [1990-1994]

 ఆ తరువాత మైక్రోసాఫ్ట్ నుంచి విడుదలైన విండోస్ 3.0 "TrueType scalable fonts"ను సపోర్ట్ చేయటం ప్రారంభించింది. ఈ ఆపరేటింగ్ సిస్టం అందుబాటులోకి వచ్చిన తరువాత మల్టీమీడియా అలానే నెట్‌వర్కింగ్ అప్లికేషన్‌ల వినియోగం మరింతగా పెరిగింది.

విండోస్ 95 (1995)

విండోస్ 95 (1995)

1995, ఆగష్టులో మైక్రోసాఫ్ట్ నుంచి విండోస్ 95 ఆపరేటింగ్ సిస్టం విడుదలైంది. కేవలం నాలుగు రోజుల్లో 10 లక్షల విండోస్ 95 కాపీలు అమ్ముడుపోవడం విశేషం. ఈ అమ్మకాల సంఖ్య 5 వారాల్లో 70 లక్షలకు పెరిగిపోయింది.

విండోస్ 98 (1998)

విండోస్ 98 (1998)

విండోస్ 95 విజయవంతమైన తరువాత మైక్రోసాఫ్ట్ రెట్టింపు ఉత్సాహంతో విండోస్ 98ను జూన్ 1998లో విడుదల చేసింది. ఈ ఓఎస్ వర్షన్ యూఎస్బీ డివైజ్ అలానే డీవీడీ రైటర్‌ను సపోర్ట్ చేసింది. అలానే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను ఈ ఓఎస్‌లో పొందుపరిచారు.

విండోస్ 2000 (2000)

విండోస్ 2000 (2000)

 మైక్రోసాఫ్ట్ తన విండోస్ 2000 వర్షన్‌ను 2000లో విడుదల చేసింది. ఎన్టీ 5 పేరుతో ఈ ఓఎస్‌‌ను మార్కెట్ చేసింది.

విండోస్ మీ (మిలీనియమ్ ఎడిషన్) 2000

విండోస్ మీ (మిలీనియమ్ ఎడిషన్) 2000

 మైక్రోసాఫ్ట్ తన విండోస్ మిలీనియమ్ ఎడిషన్‌ను జూన్ 2000లో విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టంలో అనేకమైన మల్టీమీడియా, హోమ్ నెట్‌వర్కింగ్ ఆప్షన్‌లను మైక్రోసాప్ట్ పొందుపరిచింది. ఈ ఓఎస్ ద్వారా మీడియా ప్లేయర్ 7, మూవీ మేకర్, ఆడియో వీడియో ప్లేయర్, మూవీ క్రియేషన్ ప్రోగ్రామ్ వంటి కొత్త ఫీచర్లను మైక్రోసాఫ్ట్ ప్రపంచానికి పరిచయం చేసింది.

విండోస్ ఎక్స్‌పీ (2001)

విండోస్ ఎక్స్‌పీ (2001)

యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టంలలో ఒకటైన Window XPని మైక్రోసాఫ్ట్ 2001 అక్టోబర్ లో విడదుల చేసింది. పర్సనల్ అలానే బిజినెస్ వర్షన్ లలో ఈ ఓఎస్ విడుదలైంది. రిమోట్ డెస్క్‌టాప్ సర్వీస్, పైల్ సిస్టం ఎన్‌క్రిప్షన్, వైర్‌లెస్ డివైస్ సపోర్ట్, నెట్‌వర్క్ అండ్ రిమోట్ అసిస్టెన్స్ వంటి ప్రత్యేకతలను ఈ ఆపరేటింగ్ సిస్టంలో పొందుపరిచారు.

విండోస్ విస్టా (2006)

విండోస్ విస్టా (2006)

 2006లో విండోస్ విస్టా పేరుతో కొత్త ఎడిషన్ ఆపరేటంగ్ సిస్టంను మైక్రోసాఫ్ట్ విడుదల చేసింది. సెక్యూరిటీ ఇంకా డేటా ప్రొటెక్షన్ ఫీచర్లు ఈ ఓఎస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

విండోస్ 7 (2009)

విండోస్ 7 (2009)

 విండోస్ విస్టాకు అప్‌గ్రేడెడ్ వర్షన్‌గా విండోస్ 7ను మైక్రోసాఫ్ట్ 2009లో విడుదల చేసింది. మల్టీ టచ్, ఫాస్టర్ బూటింగ్, ఇంప్రూవుడ్ విండో మేనేజ్‌మెంట్ వంటి సరికొత్త పీచర్లను ఈ వర్షన్ ద్వారా మైక్రోసాఫ్ట్ పరిచయం చేసింది.

విండోస్ 8 (2012)

విండోస్ 8 (2012)

 విండోస్ 7కు సక్సెసర్ వర్షన్‌గా విండోస్ 8ను మైక్రోసాఫ్ట్ 2012లో అందుబాటులోకి తీసుకువచ్చింది. భారీ మార్పు చేర్పులతో రూపుదిద్దుకున్న విండోస్ 8లో స్టార్ట్ మెనూ కనిపించదు. స్టార్ట్ మెనూకు బదులుగా లైవ్ టైల్స్ ఫీచర్ మనకు కనిపిస్తుంది. మైక్రోసాప్ట్ తన విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టంను టచ్ స్ర్కీన్ టెక్నాలజీ అలానే టాబ్లెట్ పీసీలను దృష్టిలోఉంచుకుని డిజైన్ చేసినట్లు తెలుస్తుంది.

విండోస్ 10 (2015)

విండోస్ 10 (2015)

విండోస్ 8 ఫేలవమైన ఫలితాలను నమోదు చేయటంతో బిల్ గేట్స్ కంపెనీ తరువాతి వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై పూర్తి స్థాయిలో దృష్టిసారించింది. విండోస్ 8కు అప్ గ్రేడెడ్ వర్షన్‌గా అందుబాటులోకి తీసుకువచ్చిన విండోస్ 10లో స్టార్ట్ మెనూను తిరిగి పునరుద్ధరించారు. కార్టోనా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వంటి అత్యాదునిక స్మార్ట్ కంప్యూటింగ్ ఫీచర్లను విండోస్ 10 ద్వారా మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తీసుకువచ్చింది. 2017లో రాబోతోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Microsoft 'Ends' Windows 7 And Windows 8. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X