మైక్రోసాప్ట్ ఎక్స్ బాక్స్‌ 360ను చంపేసింది

Written By:

మైక్రోసాప్ట్ ను మార్కెట్లో నిలబెట్టిన ప్రొడక్ట ఏదైనా ఉందంటే అది ఎక్స్ బాక్స్ 360 అనే చెప్పుకోవాలి. వచ్చి రావడంతోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఎక్స్ బాక్స్ 360 చివరకు చరిత్రపుటల్లోకి జారిపోయింది. మైక్రోసాఫ్ట్ తీపి జ్ఙాపకంగా అది మనకు అగుపించనుంది. మరి దీనిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more : మునివేళ్లతో మాయచేస్తున్న మైక్రోసాఫ్ట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

మైక్రోసాఫ్ట్ నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన ఎక్స్ బాక్స్ 360 వీడియో గేమ్ కన్సోల్ ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. 2005 లో ఉత్పత్తి ప్రారంభమైనప్పటినుంచీ ఈ కన్సోల్ లో 80 మిలియన్ల యూనిట్ల కంటే అధికంగా అమ్ముడయ్యాయి.

2

మైక్రోసాఫ్ట్ ఎక్స్ బాక్స్ 360.. కినెక్ట్ మోషన్ సెన్సింగ్ గేమ్ డివైజ్ ను కూడా పరిచయం చేసింది. 2013 లో ఎక్స్ బాక్స్ వన్ ప్రారంభమయ్యే వరకు ఇది సంస్థ యొక్క ప్రాథమిక గేమింగ్ కన్సోల్ గానే ఉంది.

3

ఎక్స్ బాక్స్ 360 తో పాటు... 'కాల్ ఆఫ్ డ్యూటీ 2' గా పిలిచే యాక్టివిజన్ బ్లిజార్డ్ ఇంక్స్, ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ ఇంక్స్ వంటి ఎన్నో ప్రముఖమైన వీడియోగేమ్స్ ప్రారంభించారు. ఇకపై కన్సోల్స్ అమ్మకాలు కొనసాగిస్తూనే, వినియోగదారులకు కంపెనీ మద్దతుగా నిలుస్తుందని మైక్రోసాఫ్ట్ తన బ్లాగ్ పోస్ట్ లో తెలిపింది.

4

సంస్థ యొక్క ఆన్ లైన్ మల్టీ ప్లేయర్ గేమింగ్ వ్యవస్థ ఎక్స్ బాక్స్ లైవ్ నెట్ వర్క్ మాత్రం ఎక్స్ బాక్స్ 360 కోసం అందుబాటులో ఉంటుందని తెలిపింది. పాతతరపు కన్సోళ్ళు ఎక్స్ బాక్స్ 360, సోనీ ప్లే స్టేషన్ 3 వంటి అమ్మకాలను తగ్గించడంతో కస్టమర్లు కంపెనీ అందించే నూతన సంస్కరణలకు మారాలని సూచిస్తోంది.

5

పదేళ్ళకు పైగా వస్తు ఉత్పత్తుల్లో వెనుకంజ వేయకుండా ప్రయాణించిన తమకు... ఓ వస్తువు తయారీ భీతిని కలిగించిందని మైక్రోసాఫ్ట్ ఎక్స్ బాక్స్ డివిజన్ అధిపతి ఫిల్ స్పెన్సర్ తెలిపారు.

6

వినియోగదారులు గేమ్స్ ప్లే చేసుకునేందుకు అనువుగా ఉండే ఎక్స్ బాక్స్ 360 ఆధునిక కన్సోల్ ను ఇప్పటికే సంస్థ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. బ్యాక్ వార్డ్ కంపాటబిలిటీ సౌకర్యంతో మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం వినియోగదారులకోసం 100 వరకూ వీడియో గేమ్స్ అందుబాటులోకి తెచ్చినట్లు.. ఫిల్ వివరించారు.

7

సో ఎక్స్ బాక్స్ నుంచి త్వరలో మరో అత్యాధునిక గేమ్ వేరే పేరుతో మనకు వినోదాన్ని పంచేందుకు రానుందన్నమాట..

8

లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Microsoft Is Officially Killing Off the Xbox 360
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot