మునివేళ్లతో మాయచేస్తున్న మైక్రోసాఫ్ట్
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో కొత్త టెక్నాలజీతో ముందుకు దూసుకువచ్చింది. స్మార్ట్ ఫోన్‌కు రక్షణగా వినియోగించే ఫ్లిప్ కవర్ పై మునివేళ్లతో టచ్ చేస్తూ, ఫోన్‌ను ఆపరేట్ చేసేలా సరికొత్త సెకండరీ ఈ-ఇంక్ డిస్ ప్లేను అభివృద్ధి చేసింది. ఈ-ఇంక్ డిస్ ప్లే సౌకర్యంతో పనిచేసే కొత్త స్మార్ట్‌ఫోన్‌కు 'యోటాఫోన్' అని పేరు పెట్టింది.
Read more : గూగుల్ డాట్ కాం చాలా డేంజర్ : షాకిచ్చిన గూగుల్

ఆస్ట్రియాకు చెందిన రీసెర్చర్ల సహకారంతో ఈ ఫ్లెక్సీ కేస్‌ను తయారు చేశామని, ఈ కవర్‌ను ఎటువైపుకైనా మడత పెట్టవచ్చని తెలిపింది. కాగా, ఈ ఫ్లెక్సీ కేస్ స్మార్ట్ ఫోన్ కు ఉండే ఫ్లిప్ కవర్‌లా పనిచేస్తుంది. దీనిపై మెసేజ్, మెనూ తదితర సింబల్స్ ఉంటాయి. వీటిపై తాకితే, మొబైల్ ప్రైమరీ స్క్రీన్ స్పందిస్తుంది. మల్టిపుల్ యాప్స్ ఓపెన్ చేసుకోవడం, పేజీల జూమ్, మ్యాప్ ల రొటేట్ వంటివెన్నో చేయవచ్చని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోని మైక్రోసాప్ట్ రీలీజ్ చేసింది.
ఇక మైక్రోసాఫ్ట్ అనే మహా సామ్రాజ్యంలోకి అడుగుపెడితే లైఫ్ ఎలా ఉంటుందో మీరు చూడండి.
Read more: 14 ఏళ్ల తరువాత దారుణమైన నష్టాల్లో ఐబిఎమ్

1
ఆఫీసులోకి అడుగు పెట్టగానే వాతావరణం ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. ఆ వాతావరణంతో ఎంతో ఎనర్జీటిక్ తో పని చేస్తారు.

2
ఆఫీసు బిల్డింగ్ సైతం ఎక్కడో దూరంగా ఎటువంటి డిస్టర్బ్ లేని ప్రాంతంలో ఉంటుంది.కావున ఉద్యోగులకు ఎటువంటి ఆటంకాలు రావు.

3
ఇక ఉద్యోగులకు పనితో పాటు అప్పుడప్పుడూ ఇలా ఒకచోటికి చేరి కబుర్లు చెప్పుకునే అవకాశం కూడా ఉంటుంది.

4
ఉద్యోగులంతా ఒకచోటికి చేరి తమ తమ అబిప్రాయాలను ఇతరులతో షేర్ చేసుకుంటారు.

5
ఇక సీనియర్ ఉద్యోగులు సైతం కింద ఉద్యోగులకు సరైన గైడెన్స్ ఇస్తూ వారిని ముందుకు నడిపిస్తుంటారు.

6
పని చేసే సమయంలో ఎటువంటి ఒత్తిడిలేకుండా ప్రశాంతంగా తమ పని తాము చేసుకోగలరు.

7
ఎవరైనా కలవడానికి వస్తే వారితో ఇలా సపరేట్ రూంలో కూర్చుని మాట్లాడవచ్చు.

8
ఇక ఆడుకోవడానికి సపరేట్ గా హల్ ఉంటుంది. ఎవరిష్టం వచ్చినట్లుగా వారు ఆడుకోవచ్చు.

9
సీనియర్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంటారు.డౌట్లను తీర్చేందుకు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు

10
నెలకోకసారి టూర్ తో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేయవచ్చు.

11
ఉద్యోగులు ఎప్పుడూ ఇళా నవ్వుతూ పనిచేయాలని అందుకోసం వారికి సకల సదుపాయాలను మైక్రోసాప్ట్ అందిస్తోంది.

12
పని ఒక్కటే కాకుండా ఉద్యోగుల కోసం అన్ని ఏర్పాట్లను కంపెనీ చేసింది. అందుకే అందరూ మైక్రోసాఫ్ట్ అంటూ పరుగులు పెడతారు.

13
కొత్త కొత్త విషయాలను ఎప్పటికప్పుడూ నేర్చుకునేందుక ఓ వేదికగా ఈ కంపెనీ ఉపయోగపడుతుంది.

14
లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








