మైక్రోసాఫ్ట్ వెంట దక్షిణాది ముఖ్యమంత్రుల పరుగులు

By Hazarath
|

అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్..భారత్‌లో ఏర్పాటు చేసిన కమర్షియల్ క్లౌడ్ డేటా సెంటర్లను మంగళవారం ప్రారంభించింది. ప్రాంతీయంగా డేటాను స్టోర్ చేయాలనుకునే సంస్థలకోసం ముంబై, పుణె, చెన్నైలలో ఈ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్లను ఏర్పాటు చేయడానికి సంస్థ ఏమేర పెట్టుబడుల పెట్టిన విషయాన్ని వెల్లడించలేదు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా సిలికాన్ వ్యాలీలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. భారత్‌లో మరిన్ని డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.మిగితా కధనం స్లైడర్ లో...

Read more:మోడీ కంటతడి...సిలికాన్ వ్యాలీలో అలజడి

40 దేశాల్లో 100 డేటా సెంటర్లను..

40 దేశాల్లో 100 డేటా సెంటర్లను..

40 దేశాల్లో 100 డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి 1500 కోట్ల డాలర్ల మేర ఖర్చు చేయనున్నట్లు ప్రకటనకు అనుగుణంగా భారత్‌లో మూడు సెంటర్లను ప్రారంభించినట్లు మైక్రోసాఫ్ట్ ఇండియా జనరల్ మేనేజర్ టైలర్ బ్రైసన్ తెలిపారు.

దక్షిణాది రాష్ట్రాల మధ్య తీవ్ర పోటీ

దక్షిణాది రాష్ట్రాల మధ్య తీవ్ర పోటీ

దేశవ్యాప్తంగా ఎన్నో సంస్థలు తమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నప్పటికీ డేటాను పొదుపు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,ఈ సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో డేటా సెంటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే సిలికాన్ వ్యాలీలో సత్య నాదెళ్ల మోడీకి ఇచ్చిన మాటతో ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఓ హామీ

సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఓ హామీ

సాఫ్ట్‌వేర్‌ టైకూన్‌ మైక్రోసాఫ్ట్‌ దక్షిణాది రాష్ట్రాల మధ్య పోటీ పెట్టింది. దీనికోసం దక్షిణాది రాష్ట్రాలు పరుగులు పెట్టబోతున్నాయ్. మోడీ సిలికాన్ వ్యాలీ టూర్‌లో ..సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఓ హామీ ఇచ్చింది. ఆ సంస్ధ ప్రతినిధిగా భారత ప్రధానికి ఓ మాటిచ్చాడు సత్యనాదెళ్ల.

ఒక్కటి మాత్రం దక్షిణభారత దేశంలో..

ఒక్కటి మాత్రం దక్షిణభారత దేశంలో..

భారతదేశంలో నాలుగు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నది ఆ మాట. మైక్రోసాఫ్ట్ విండోస్ డెవలప్ మెంట్ సెంటర్లలో మూడు ఉత్తరభారత దేశంలో ఏర్పాటవుతాయ్. ఒక్కటి మాత్రం దక్షిణభారత దేశంలో నెలకొల్పుతారు.

తీవ్ర స్ధాయిలో పోటీ

తీవ్ర స్ధాయిలో పోటీ

ఉత్తర భారత దేశంలో ఏర్పాటయ్యే విండోస్ డెవలప్ మెంట్ సెంటర్లకోసం పోటీ ఎలా ఉంటుందో చెప్పలేం గానీ, దక్షిణాదిలో ఏర్పాటయ్యే సెంటర్ కోసం..తీవ్ర స్ధాయిలో పోటీ ఉండనుంది. ఆ సంస్ధను తమ రాష్ట్రాలకు తీసుకొచ్చేందుకు ఏపీ, తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలు పోటీ పడబోతున్నాయ్. రేసులో చెన్నై, బెంగళూర్, వైజాగ్, హైదరాబాద్ ఉన్నాయ్.

ఇప్పుడు పోటీగా రాబోతోంది వైజాగ్

ఇప్పుడు పోటీగా రాబోతోంది వైజాగ్

సౌతిండియాలో ఐటీ సెంటర్లుగా బెంగళూర్, హైదారాబాద్, చెన్నై ఉన్నాయ్. వీటికి ఇప్పుడు పోటీగా రాబోతోంది వైజాగ్. ఎలాగైనా ఐటీ కేంద్రాలను సాగర తీరానికి రప్పించాలన్న పట్టుదలతో ఉన్న సీఎం చంద్రబాబు. తెలంగాణా రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక సంస్ధ కావాలంటున్నారు సీఎం కేసీఆర్.

కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు పోటీకి

కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు పోటీకి

అటు లాబీలో తమను మించినవారు లేరనిపించుకోవడానికి కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు పోటీకి దిగుతున్నాయ్. ఈ డెవలప్ మెంట్ సెంటర్ ఎక్కడ ఏర్పాటైతే,ఆ ప్రాంతానికి ఇంటర్నేషనల్ గుర్తింపు దక్కుతుంది. అందుకే, సీఎంల స్ధాయిలో లాబీయింగ్ ఉండబోతోంది.

న‌రేంద్ర‌మోడీ ప‌ట్ల మైక్రోసాఫ్ట్ సీఈవో వ్య‌వ‌హ‌రించిన తీరు

న‌రేంద్ర‌మోడీ ప‌ట్ల మైక్రోసాఫ్ట్ సీఈవో వ్య‌వ‌హ‌రించిన తీరు

ఇదిలా ఉంటే భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ప‌ట్ల మైక్రోసాఫ్ట్ సీఈవో వ్య‌వ‌హ‌రించిన తీరు ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మోడీతో క‌ర‌చాల‌నం చేసిన త‌ర్వాత అంద‌రికీ క‌నిపించేలా మ‌రీ ఆ చేతిని ప‌లుమార్లు తుడుచుకుంటూ ఆయ‌న త‌న భావాన్ని వ్య‌క్త‌ప‌రిచిన తీరు ఆశ్చ‌ర్యం క‌లిగించింది. మోడీ అమెరికా పర్యటనలో భాగంగా మైక్రోసాఫ్ట్ సిఈవో సత్య నాదెళ్ల ఆయనని కలిసి కరచాలనం చేశారు. కరచాలనం చేసిన తరువాత సత్య నాదెళ్ల తన చేతులను తుడుచుకున్నారు. ఆ దృశ్యం విడియోలో రికార్డు అయ్యింది.

మోడిపై సెటైర్లు వేస్తూ...

మోడిపై సెటైర్లు వేస్తూ...

దానికి సంబందించి మోడిపై సెటైర్లు వేస్తూ సామాజికి మాద్యమంలో ఈ వీడియో హల్‌ చేస్తుంది. జాతీయ, అంత‌ర్జాతీయ మీడియాలో కూడా భిన్న క‌థ‌నాలు, వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా చేతులు దులుపుకోవ‌డం ఒక‌టి, రెండు సార్ల‌యితే పెద్ద ప‌ట్టించుకోవాల్సిన విష‌యం కాన‌ప్ప‌టికీ, ప‌దే ప‌దే అలా చేయ‌డం ఉద్దేశ్య‌పూర్వ‌కంగానే జ‌రిగిందా అన్న సందేహాలు పెంచుతోంది.

వీడియో ఇదే.

కరచాలనం చేసిన తరువాత సత్య నాదెళ్ల తన చేతులను తుడుచుకుంటున్న వీడియో.

 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.https://www.facebook.com/GizBotTelugu

Best Mobiles in India

English summary
here Write Microsoft set to launch three data centres in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X