మోడీ కంటతడి...సిలికాన్ వ్యాలీలో అలజడి

Posted By:
  X

  ఎప్పుడూ హుందాగా నవ్వుతూ ఎదుటివారిని నవ్వించే మోడీ తొలిసారిగా తన కన్నీళ్లను కార్చారు. ప్రపంచంలో అత్యుత్తమ దేవత అమ్మ గురించి ప్రస్తావిస్తూ భారత ప్రధాని ఒక్కసారిగా కన్నీళ్లను రాల్చారు. ఎదుటి వారిని ఎప్పుడూ తన మాటలతో భయపెట్టే మోడీ ఒక్కసారిగా అలా కన్నీటిపర్యంతం అయ్యేసరికి యావత్ ప్రపంచం భావోద్వేగంలో మునిగితేలింది. మా నాన్న గారు లేరు.మా అమ్మకు 90 ఏళ్లు దాటాయి.ప్రతి పని ఎవరి సహాయం లేకుండా అమ్మే చేసుకుంటుంది. ఎన్ని పనులున్నా టీవీ ద్వారా ఆమె ప్రపంచంతో మమేకమతోంది.

  Read more: సముద్ర గర్భంలో చైనా దాచిన నిజాలు

  నా చిన్నతనంలో నా తల్లి అందరి ఇళ్లలో పాచిపనులు చేసేది.కూలి పనులకు వెళ్లేదంటూ ఆమె అలా కష్టపడి నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిందటూ ఒక్కసారిగా కంటతడి పెట్టారు. ఇది కేవలం నరేంద్ర మోడీ కథ కాదు. భారత్ లా నా తల్లి లాంటి తల్లులు ఎందరో ఉన్నారు. తమ పిల్లలు కోసం తమ జీవితాన్నే పణంగా పెడుతున్నారు. వారందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నానంటూ ఉద్వేగభరింతంగా మాట్లాడారు. అందరి మనసులు నొప్పించారు. ఇక మోడీ సిలికాన్ వ్యాలీ పర్యటన అక్కడ హైలెట్ గా నిలిచింది. కాలిఫోర్నియాలో మోడీ మేనియా గురించి కింద స్లైడర్ లో చదవండి.

  Read more: మోడీ.. ఏమిటీ ఈ సెల్పీల దాడి

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  అడుగడునా ఆదరణ

  డిజిటల్ ఇండియాతో దేశ రూపురేఖల్ని మార్చాలన్న లక్ష్యంతో.. అమెరికాలో పర్యటిస్తోన్న మోడీని... అడుగడునా ఆదరించాయి సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ కంపెనీలు. పెట్టుబడుల కోసం... ఆ సంస్థల సీఈవోలతో మోడీ చర్చలు జరిపారు .

  20 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోవాలన్న ఆకాంక్ష

  భారత ఆర్ధిక వ్యవస్థ 20 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోవాలన్న ఆకాంక్షతో పనిచేస్తున్నట్లు తెలిపారు మోడీ. మైక్రోసాఫ్ట్, గూగుల్‌, యాపిల్, శాప్‌ సంస్థల సీఈఓలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.

  దిగ్గజాలతో భేటీ

  సాంకేతిక పరిజ్ఞానం ప్రజల జీవితాల్లో ఎంతగా భాగస్వామి అయిందనే విషయాన్ని సత్యనాదెళ్ల, సుందర్ పిచాయ్, టిమ్ కుక్ తమ ప్రసంగాల్లో వెల్లడించారు. తమ ప్రభుత్వం డిజిటల్ ఇండియాకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని... భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వనిస్తున్నట్లు మోడీ తెలిపారు.

  ఫేస్‌బుక్ ఖాతాదారుల ప్రశ్నలకు సమాధానం

  అనంతరం... ఫేస్‌బుక్‌ కార్యాలయాన్ని సందర్శించారు మోడీ. ఆ సంస్థ సీఈవో జుకర్‌బర్గ్‌తోనూ సమావేశమై.... డిజిటల్ ఇండియాకు మద్దతివ్వాలని కోరారు. ఫేస్‌బుక్ ఖాతాదారుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. వచ్చే ఐదేళ్లలో భారత్‌లో ఆరులక్షల గ్రామాలకు నెట్‌ సౌకర్యం కల్పిస్తామన్నారాయన. ఈ సమావేశంలో... ప్రధాని మోడీ....తొలిసారిగా కంటతడిపెట్టారు. కన్నతల్లి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు...

  సమావేశం ప్రాంగణం చప్పట్లు, నవ్వులు

  అనంతరం.... గూగుల్ హెడ్‌క్వార్టర్‌ను సందర్శించారు మోడీ. ఆ సంస్థ సీఈవో పిచాయ్‌.... మోడీకి ఘన స్వాగతం పలికారు. గూగుల్‌ ఎర్త్‌, స్ట్రీట్‌ వ్యూ, నావిగేటర్‌ సేఫ్టీ తదితర అంశాలతో పాటు ప్రాజెక్ట్‌ ఐరీస్‌ గురించి మోడీకి వివరించారు పిచాయ్‌... పిల్లలకు విద్య విషయంలో గూగుల్‌ ఉపాధ్యాయులు, కటుంబ పెద్దలకు పాత్ర లేకుండా చేస్తోందని మోడీ వ్యాఖ్యానిస్తే, సమావేశం ప్రాంగణం చప్పట్లు, నవ్వులతో నిండిపోయింది. మొబైల్ టెక్నాలజీ ప్రవేశంతో కొత్త శకం మొదలైందని అభిప్రాయపడ్డ మోదీ, డిజిటల్ ఇండియా కల సాకారానికి ప్రతి ఒక్కరి సహకారాన్ని కోరుతున్నట్టు తెలిపారు.

  సిలికాన్ వ్యాలీలో నిత్యమూ ఎన్నో కొత్త ఆలోచనలు

  ప్రపంచంలో చివరిగా సూర్యాస్తమయాన్ని చూసే సిలికాన్ వ్యాలీలో నిత్యమూ ఎన్నో కొత్త ఆలోచనలు, ప్రొడక్టులు ఉదయిస్తూ, మానవాళికి ఉపయోగపడుతున్నాయని అన్నారు. తాను ఢిల్లీలో ఉన్నా నిత్యమూ ఈ సమావేశానికి హాజరైన వారిని కలుస్తూనే వున్నానని వెల్లడించిన ఆయన, అందుకు సామాజిక మాధ్యమాలు ఎంతో సహకరిస్తున్నాయని తెలిపారు.

  ప్రతి ఐటీ కంపెనీకీ కృతజ్ఞతలు

  సోషల్ మీడియా వాడకం విస్తృతమైన తర్వాత ప్రజల మధ్య సామాజిక అంతరాలు తగ్గిపోతున్నాయని మోడీ వ్యాఖ్యానించారు. ఇందుకు ప్రతి ఐటీ కంపెనీకీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. డిజిటల్ ప్రపంచంలో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మన ఇరుగు పొరుగు అంటూ పేర్కొన్నారు.

  125 కోట్ల మంది ప్రజలకు డిజిటల్ కనెక్టివిటీ

  తాము అధికారంలోకి రాగానే సెల్‌పోన్లు, సాంకేతికతతో పేదరికంపై యుద్ధం ప్రకటించామన్నారు. ఇండియాలోని 125 కోట్ల మంది ప్రజలకు డిజిటల్ కనెక్టివిటీని అందించాలన్నదే తన లక్ష్యమని అన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే బ్రాడ్ బ్యాండ్ వినియోగం 63 శాతం పెరిగిందని ప్రధాని మోడీ వివరించారు.

  ప్రతి పల్లెలోని ప్రతి కుటుంబానికీ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు

  గత కొద్ది నెలలుగా 170కి పైగా అప్లికేషన్లను వాడటం ద్వారా పరిపాలనలో పెను మార్పులు వచ్చాయని వివరించారు. దీన్ని మరింతగా విస్తరిస్తామని, ప్రతి పల్లెలోని ప్రతి కుటుంబానికీ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు దగ్గర చేస్తామని వివరించారు. అంతకన్నా ముందు కళాశాలలు, వర్శిటీలు, హాస్టళ్లు, అన్ని రహదారులు, పుణ్యక్షేత్రాలు, టూరిజం ప్రాంతాలు డిజిటల్ ఇండియా కిందకు తీసుకువస్తామని అన్నారు.

  బస్టాండ్లలో వైఫై హాట్ స్పాట్‌లు

  కేవలం ఎయిర్ పోర్టు లాంజీల్లో మాత్రమే కాకుండా, అన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో వైఫై హాట్ స్పాట్‌లను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇప్పటికే 500కు పైగా రైల్వే స్టేషన్లలో వైఫై సిగ్నల్స్ ను ఉచితంగా అందిస్తున్నామని, దీన్ని 5 వేల స్టేషన్లకు పెంచుతామని అన్నారు. ఇందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు సహకరించాలని ఆయన కోరారు.

  ఇరు దేశాల మధ్య ఒక భాగస్వామ్యం

  రాబోయే కాలంలో ప్రపంచంలో శాంతిని నెలకొల్పడంలో మన బాధ్యత తీసుకోవాలని వ్యాఖ్యానించారు. మన సంబంధం యువత, టెక్నాలజీ, ఇన్నోవేషన్ శక్తి ద్వారా నిర్వచిస్తుందని పేర్కొన్నారు. దీనిని చేరుకునేందుకు, ఇరు దేశాల మధ్య ఒక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకునేందుకు ఇది ఎంతగానో దోహదపడతుందన్నారు.

  భవిష్యత్తులో భారత్‌ది కీలకపాత్ర:

  గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచ్చై టెక్నాలజీ విభాగంలో భవిష్యత్తులో భారత్‌ది కీలకపాత్ర అని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్ అన్నారు..గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ సాంకేతికత దేశాభివృద్ధికి ఎంతో అవసరమని ప్రధాని మోడీ గుర్తించారన్నారు. భారత్‌లో 3వేలకు పైగా స్టార్టప్‌ ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. అన్ని భాషల్లో ఆండ్రాయిడ్‌ సేవలు అందిస్తున్నామన్నారు. స్టార్టప్‌లను ప్రోత్సహించటంలో భారత్‌ ముందుందన్నారు. త్వరంలో భారత్‌లో విద్యార్థులకు క్రోమ్‌ బుక్స్‌ అందుబాటులోకి తెస్తామన్నారు.

  శ్రీకాకుళం జిల్లాలోని పాఠశాల స్కైప్‌ ద్వారా తరగతులు:

  సత్య నాదేళ్ల శ్రీకాకుళం జిల్లాలోని ఓ పాఠశాలలో స్కైప్‌ ద్వారా తరగతులు నిర్వహించటం నిజంగా అద్భుతమని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ప్రశంసించారు. గ్రామాలకు తక్కువ ఖర్చుతో బ్రాడ్‌ బాండ్‌ సదుపాయం కల్పించాల్సిన అవసరముందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో డ్రాపవుట్స్‌ వివరాలు తెలుసుకునేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్నారన్నారు. చిన్న వ్యాపారులకు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ఉపయోగపడుతుందని వివరించారు. ప్రపంచంలోని ప్రజలందరి సాధికారత దిశగా పని చేసేందుకు ఇది సమయమని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.

  మొబైల్ టెక్నాలజీ మన జీవితాలనే మార్చేస్తోంది:

  క్వాల్‌కామ్‌ సీఈవో పాల్‌ జాకబ్స్‌ మొబైల్‌ టెక్నాలజీ మన జీవితాలనే మార్చేస్తోందని క్వాల్‌కామ్‌ సీఈవో పాల్‌ జాకబ్స్‌ అన్నారు.భారత్‌లో ప్రస్తుతం 121 మిలియన్ల వైర్‌లెస్‌ బ్రాండ్‌బాండ్‌ వినియోగదారులు ఉన్నారన్నారు. స్మార్ట్‌ ఫోన్ల వినియోగంలో భారత్‌ అతిపెద్ద మార్కెట్‌ అని వివరించారు.

  భారత్‌లోని అపార మార్కెట్ తమ సంస్థకు అత్యంత ప్రధానం:

  టిమ్ కుక్ తో పాటు అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో ప్రముఖ సంస్థల సీఈవోలతో ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఓ ఆసక్తికర విషయాన్ని మోడీకి వివరించారు. యాపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఇండియా పర్యటనల రహస్యాన్ని ఆయనకు వివరించారు. భారత్ కు వెళ్లి వస్తే ఎంతో ప్రేరణ పొందవచ్చని, ఆ కారణంతోనే స్టీవ్ ఇండియా పర్యటనలు జరిపేవారని అన్నారు. ఇండియాతో తమకు ఎంతో అనుబంధముందని, భారత్‌లోని అపార మార్కెట్ తమ సంస్థకు అత్యంత ప్రధానమని, డిజిటల్ ఇండియాకు తమవంతు సహకారాన్ని అందిస్తామని తెలిపారు.

  అడోబ్ సీఈవో

  భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన చారిత్రాత్మాకమైందని అడోబ్ సీఈవో పేర్కొన్నారు. డిజిటల్ ఇండియాకు మద్దతిస్తామన్నారు.

  పటేదార్‌వర్గం మద్దతుదారుల, పంజాబ్ సిక్కుల నుంచి నిరసన

  విదేశీ పర్యటనలో భాగంగా ఐరాస ప్రధాన కార్యాలయానికి వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి గుజరాత్ పటేదార్‌వర్గం మద్దతుదారుల, పంజాబ్ సిక్కుల నుంచి నిరసన వ్యక్తమైంది. రెండొందల మంది సిక్కులు పంజాబ్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందంటూ నినాదాలు చేశారు. సిక్స్ ఫర్ జస్టిస్ అని రాసివున్న బ్యానర్‌ను చేబూని భారత్ వ్యతిరేక, మోదీ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రత్యేక ఖలిస్తాన్ కావాలంటూ ఆందోళనకారులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు అంతర్జాతీయ వేదికపై చర్చించాలని వారు విజ్ఞప్తి చేశారు.

  నిరసనలు..ఆహ్వానాలు

  సిక్కు నిరసనకారుల పక్కనే గుజరాత్ పటేదార్ వర్గానికి చెందిన పరువురు తమకు న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు. గుజరాత్‌కు చెందిన వీరంతా సర్దార్ పటేల్‌కు చెందిన టోపీలు ధరించి నినాదాలు చేశారు. పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నవారే ఈ ఆందోళన కార్యక్రమానికి నాయకత్వం వహించారు. కాగా ఇండియన్ డైమండ్ అండ్ జెమ్‌స్టోన్ ఇండస్ట్రీ ఆఫ్ న్యూయార్క్ అన్న బ్యానర్‌తో మరో పటేల్ వర్గం ప్రధాని పర్యటనకు ఆహ్వానం పలుకుతూ ర్యాలీ నిర్వహించింది.

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  English summary
  Here Write Crowd chants "Modi, Modi" as India PM winds up Silicon Valley tour
  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more