విండోస్ 10.. ఐదు బెస్ట్, వరస్ట్ ఫీచర్లు

Posted By:

భారీ అంచనాల మధ్య మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంను ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యూజర్లు వినియోగించుకుంటున్నారు. విండోస్ నుంచి వచ్చిన ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టం కొత్త ఫీచర్లతో పాటు విండోస్ 8తో పోలిస్తే అత్యుత్తమ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను వినియోగదారులకు అందిస్తోంది.

Read More : 4,990కే లెనోవో 4జీ, మార్కెట్ రసవత్తరం

విండోస్ కంప్యూటింగ్‌ను మరింత సౌకర్యవంతం చేస్తూ ఆధునీకరించబడిన సెక్యూరిటీ లెవల్స్, సాంప్రదాయ విండోస్ 7 లుక్స్, విండోస్ 8 సూపర్‌ఫాస్ట్ సార్టప్ వంటి మైక్రోసాఫ్ట్ ఆలోచనలతో విండోస్ కొత్త ప్లాట్‌ఫామ్ రూపుదిద్దుకుంది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో ఊరించి ఉసూరుమనిపించిన 10 బెస్ట్, వరస్ట్ ఫీచర్లను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెస్ట్ ఫీచర్

వర్చువల్ డెస్క్‌టాప్స్

మైక్రోసాఫ్ట్ ఎట్టకేలక తన వర్చువల్ డెస్క్‌టాప్ ఫీచర్‌ను విండోస్ 10 ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ విండోస్ 10కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విండోస్ 10 పీసీ పై వర్చువల్ డెస్క్‌టాప్‌ను పొందాలంటే టాస్క్‌బార్ పై కనిపించే టాస్క్ వ్యూ బటన్ పై క్లిక్ చేయండి.

 

విండోస్ 10లోని బెస్ట్ ఫీచర్

నోటిఫికేషన్

ఆండ్రాయిడ్ తరహాలోనే యాక్షన్ సెంటర్ పేరుతో నోటిఫికేషన్ ప్యానల్ వ్యవస్థను మైక్రోసాఫ్ట్ విండోస్ 10లో ఏర్పాటు చేసింది. విండోస్ 8 వర్షన్‌లో పొందుపరిచిన నోటిఫికేషన్ వ్యవస్థ స్క్రీన్ కుడి వైపు ఒక్క సారి కనిపించి ఆ తరువాత కనుమరుగయ్యేది. విండోస్ 10లో ఏర్పాటు చేసిన యాక్షన్ సెంటర్‌లో ఇలాంటి సమస్యలు ఉండవు. మొత్తం నోటిఫికేషన్‌ను ఈ యాక్షన్ సెంటర్‌లో చూసుకోవచ్చు.

 

విండోస్ 10లోని బెస్ట్ ఫీచర్

ఎక్స్‌బాక్స్ స్ట్రీమింగ్

ఎక్స్‌బాక్స్ వన్ గేమ్‌లను మీ పీసీలో స్ట్రీమ్ చేసుకునే అవకాశాన్ని విండోస్ 10 కల్పిస్తోంది. ఎక్స్‌బాక్స్ లైవ్ అకౌంట్‌లోకి లాగిన్ కావటం ద్వారా ఈ సదుపాయాన్ని మీరు ఆస్వాదించవచ్చు.

 

విండోస్ 10లోని బెస్ట్ ఫీచర్

వన్‌డ్రైవ్ ఇంటిగ్రేషన్

యూజర్లకు ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ను అందించే బృహత్తర ఉద్దేశ్యంతో మైక్రోసాప్ట్ విండోస్ 10లో వన్‌డ్రైవ్ ఇంటిగ్రేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ యాప్ ద్వారా మీ ఫైళ్లను క్లౌడ్ స్టోరేజ్‌లో భద్రపరుచుకుని వన్‌డ్రైవ్ యాప్ సహాయంతో ఆ ఫైళ్లను ఏ డివైస్ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు.

 

విండోస్ 10లోని బెస్ట్ ఫీచర్

వేగవంతమైన బూటింగ్

విండోస్ 8.1తో పోలిస్తే విండోస్ 10 వేగవంతంగా బూట్ అవుతుంది.

 

విండోస్ 10లో నిరుత్సాహపరిచిన ఫీచర్

స్టార్ట్ మెనూ

విండోస్ 8లో తొలగించబడిన స్టార్ట్ మెనూ ఫీచర్‌ను మైక్రోసాఫ్ట్ విండోస్ 10లోకి తీసుకువచ్చింది. అయితే ఈ కొత్త స్టార్ట్ మెనూ అంతగా సౌకర్యవంతంగా లేదని పలువురు అంటున్నారు.

 

విండోస్ 10లో నిరుత్సాహపరిచిన ఫీచర్

సెర్చ్ బాక్స్

విండోస్ 10 టాస్క్ బార్ పై ఏర్పాటు చసిన సాంప్రదాయ సెర్చ్ బాక్స్ ఫీచర్ యాప్స్, కంటెంట్స్ అలానే వెబ్‌కు సంబంధించిన అంశాలను శోధించేందుకు తోడ్పడుతున్నప్పటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేటప్పటికి బోలెడంత సమయం వృధా అవుతోందని పలువురు విండోస్  10 యూజర్లు వాపోతున్నారు.

 

విండోస్ 10లో నిరుత్సాహపరిచిన ఫీచర్

కార్టోనా

విండోస్ 10 కొత్త డిజిటల్ అసిస్టెంట్ ఫీచర్ కార్టోనా యూజర్ అడిగిన కొన్ని ప్రశ్నలకు డైరెక్ట్ సమాధానాలు ఇస్తున్నప్పటికి కొన్ని సందర్భాల్లో సమాధానాలు తెలిపేందుకు వెబ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేస్తుంది.

 

విండోస్ 10లో నిరుత్సాహపరిచిన ఫీచర్

రెండు మెనూ సెట్టింగ్స్

విండోస్ 10 రెండు వేరు వేరు సెట్టింగ్ మెనూలను కలిగి ఉంది. వీటిలో ఒకటి మోడ్రన్ యూఎస్ ఇంటర్‌ఫేస్ - ఆధారిత సెట్టింగ్స్ మెనూ కాగా, మరొకటి సాంప్రదాయ కంట్రోల్ ప్యానల్. విండోస్ 10లో పునరుద్దరించబడిన కొత్త సెట్టింగ్స్ ప్యానల్ నోటిఫికేషన్, నెట్‌వర్క్స్ అలానే యాప్‌లకు సంబంధించి వివరణాత్మక నియంత్రణలను కలిగి ఉన్నప్పటికి చాలా వరకు కోర్ సెట్టింగ్స్ మాత్రం సాంప్రదాయ కంట్రోల్ ప్యానల్‌లోనే ఉన్నాయి.

 

విండోస్ 10లో నిరుత్సాహపరిచిన ఫీచర్

ముందస్తుగా ఇన్‌స్టాల్ చేయబడిన గేమ్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Microsoft Windows 10: Five Best And Five Worst Features Of The Latest Windows OS. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot