రానున్నది పాస్‌వర్డ్ లేని ప్రపంచమే..

Written By:

భవిష్యత్‌లో పాస్‌వర్డ్‌లతో పనిలేకుండా ఇంటర్ నెట్ ఉపయోగించే రోజులు రానున్నాయి.కేవలం మీ ఫేస్ తోనే ఇంటర్ నెట్ ను ఓపెన్ చేసే రోజులు దగ్గర్లో ఉన్నాయి.?ఈ మాటలు అన్నది ఎవరో కాదు..మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల. పాస్‌వర్డ్ లు హ్యాకింగ్ కు గురవుతున్న నేపథ్యంలో సత్య నాదెళ్ల నుంచి ఈ రకమైన ప్రకటన రావడం నిజంగా నెట్ ప్రియులకు సంతోషం కలిగించే పరిణామం..కంపెనీ ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తయిన సంధర్భంగా నాదెళ్ల మాట్లాడుతూ పాస్ వర్డ్ లేని ప్రపంచాన్ని సృష్టించడమే మైక్రోసాప్ట్ లక్ష్యమని చెప్పారు.

Read more: ట్విట్టర్‌లోకి మీ హృదయం చేరింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ-మెయిల్, మొబైల్ ఫోన్ల పాస్‌వర్డ్ హ్యాకింగ్‌కు గురై ఇబ్బందులు ..

ఈ-మెయిల్, మొబైల్ ఫోన్ల పాస్‌వర్డ్ హ్యాకింగ్‌కు గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులకు భవిష్యత్తులో భారీ ఊరట లభించనున్నది. ఇందుకోసం టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పాస్‌వర్డ్ రహిత సేవలు అందించే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నది.

కంపెనీని ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా..

ఇప్పటికే చర్యలను ప్రారంభించినట్లు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. కంపెనీని ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ అన్‌లీష్‌డ్ పేరుతో ముంబైలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. పాస్‌వర్డ్‌తో అవసరం లేకుండా నేరుగా ఫేన్ రికగ్నైజేషన్‌తోపాటు ఇతర బయోమెట్రిక్ పద్ధతుల్లో యూజర్‌ను గుర్తుపట్టేలా టెక్నాలజీని అభివృది చేయనున్నట్లు ఆయన చెప్పారు.

ఈమెయిల్స్, మొబైల్ ఫోన్స్ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ..

ఈమెయిల్స్, మొబైల్ ఫోన్స్ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో యూజర్లకు పాస్‌వర్డ్ కష్టాల నుంచి విముక్తి కల్పించే దిశగా కసరత్తు చేస్తున్నట్లు నాదెళ్ల తెలిపారు. పాస్‌వర్డ్‌లు హ్యాకింగ్‌కు గురయ్యే ప్రసక్తి లేకుండా కంప్యూటింగ్ పరికరాలకు రక్షణ కల్పించాలన్నది తమ ఉద్దేశమన్నారు.

తాను వ్యక్తిగతంగా ఉపయోగించే సాధనాల గురించీ ..

ప్రపంచం, టెక్నాలజీలు మారిపోతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఉత్పాదకత ను, వ్యాపార ప్రక్రియలను మెరుగుపర్చుకోవాలన్నది తమ కంపెనీ లక్ష్యమంటూ, తాను వ్యక్తిగతంగా ఉపయోగించే సాధనాల గురించీ నాదెళ్ల ప్రస్తావించారు. ‘నేను మా కంపెనీ తయారు చేసే హైఎండ్ లూమియాతో పాటు ఐఫోన్ నూ వాడతాను. అయితే, దీన్ని ఐఫోన్ ప్రోగా భావిస్తా. ఎందుకంటే ఇందులో మా మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ మొత్తం ఉంటుంది' అని సత్య చెప్పారు.

నూతన పారిశ్రామికవేత్తలకు ఆర్థికంగా చేయుతనిచ్చేందుకు..

అలాగే దేశీయంగా ఏర్పాటవుతున్న స్మార్ట్‌సిటీల్లో పాలుపంచుకోనున్న నూతన పారిశ్రామికవేత్తలకు ఆర్థికంగా చేయుతనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సత్య నాదెళ్ల చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో స్మార్ట్‌సిటీలతోపాటు స్టార్టప్‌లు, ఈ-కామర్స్‌ల ట్రెండ్ నడుస్తున్నదన్నారు. భారత్‌లో ఈ-కామర్స్ రంగంపై స్పందిస్తూ ఇది ఊహించిన దానికంటే అధికంగా ఉందని, ఈ రంగంలో ప్రవేశించాలనుకోవడం లేదని, కానీ నాణ్యమైన సేవలు అందించే బాధ్యత ఆయా సంస్థలపై ఉందన్నారు.

భారత్‌లో క్లౌడ్ కంప్యూటింగ్‌కి ప్రాధాన్యం పెరుగుతున్న తీరు..

భారత్‌లో క్లౌడ్ కంప్యూటింగ్‌కి ప్రాధాన్యం పెరుగుతున్న తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని నాదెళ్ల చెప్పారు. ఈ నేపథ్యంలోనే పుణే, ముంబై, చెన్నైలలో మైక్రోసాఫ్ట్ మూడు డేటా సెంటర్లు ప్రారంభించిందని పేర్కొన్నారు. స్టార్టప్‌లను దృష్టిలో పెట్టుకొని క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసులను మెరుగు పరచడానికి ఈ-కామర్స్ సంస్థలైన జస్ట్‌డయల్, పేటీఎం, స్నాప్‌డీల్‌లతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందన్నారు.

స్మార్ట్‌సిటీల్లో పాలుపంచుకోనున్న స్టార్టప్‌లకు ..

ఈ మూడు సంస్థలతో కలిసి స్మార్ట్ సిటీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించడంతోపాటు హెల్త్‌కేర్, విద్య, వ్యవసాయ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం పరిష్కరించేందుకు పెద్దపీట వేయనున్నట్లు చెప్పారు. స్మార్ట్‌సిటీల్లో పాలుపంచుకోనున్న స్టార్టప్‌లకు వ్యక్తిగతంగా 1.20 లక్షల డాలర్లు లేక రూ.80 లక్షల వరకు రుణాన్ని అందించనున్నది.

వచ్చే ఏడాది చివరికల్లా దాదాపు 50 స్మార్ట్‌సిటీల్లో..

వచ్చే ఏడాది చివరికల్లా దాదాపు 50 స్మార్ట్‌సిటీల్లో పనిచేసే 50 స్టార్టప్‌లతో భాగస్వాములమవుతామని ఆయన వెల్లడించారు. భారత్‌లో ప్రతీ వ్యక్తి, కంపెనీ, ప్రభుత్వ రంగ సంస్థ సాధికారత పెంచేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. తాము చేపట్టిన కార్యక్రమాల ప్రభావం వచ్చే ఐదేళ్లలో 50 స్మార్ట్ సిటీలపై కనిపించగలవని నాదెళ్ల చెప్పారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో పైలట్ ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని తెలిపారు.

భారత్‌లో సమూల మార్పులు చేయాలని కోరుకోవడం లేదని ..

పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న సమస్యలను టెక్నాలజీ ద్వారా పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. భారత్‌లో సమూల మార్పులు చేయాలని కోరుకోవడం లేదని అన్నారు. భారత్‌లో క్లౌడ్ ఆధారిత సేవలకు డిమాండ్ నెలకొందని, ప్రైవేట్‌తోపాటు ప్రభుత్వరంగ సంస్థలకు సైతం క్లౌడ్ ఆధారిత సేవలు అందిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రమాణిక్ చెప్పారు.

సెర్చి ఇంజిన్ బింగ్, క్లౌడ్ ఆధారిత అనలిటిక్స్ తోడ్పాటుతో..

సెర్చి ఇంజిన్ బింగ్, క్లౌడ్ ఆధారిత అనలిటిక్స్ తోడ్పాటుతో కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు మైక్రోసాఫ్ట్, జస్ట్‌డయల్ కలిసి పనిచేయనున్నాయి. కస్టమర్లు మొబైల్ లావాదేవీలు సులువుగా నిర్వహించుకునేందుకు, బిల్లులను సులభతరంగా ఆన్‌లైన్‌లోనే చెల్లించే వీలు కల్పించేందుకు కోర్టానా బ్రౌజర్‌తో పేటీఎం యాప్, పేటీఎం వాలెట్‌ను అనుసంధానం చేసే అంశంపై పేటీఎం, మైక్రోసాఫ్ట్ చేతులు కలిపాయి.

ఈ డీల్‌లో భాగంగా పేటీఎం తమ నెట్‌వర్క్ ద్వారా..

ఈ డీల్‌లో భాగంగా పేటీఎం తమ నెట్‌వర్క్ ద్వారా మైక్రోసాఫ్ట్ సర్వీస్ సేల్స్‌కు తోడ్పాటునివ్వనుంది. అటు ఆన్‌లైన్లో వాహనాల విక్రయానికి తోడ్పడేలా రూపొందిస్తున్న వ్యవస్థ కోసం స్నాప్‌డీల్.. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ప్లాట్‌ఫాంను ఉపయోగించుకోనుంది.

జనవరిలో సర్ఫేస్ ప్రో4 ట్యాబ్లెట్ విడుదల

విండోస్-10తో పనిచేయనున్న లుమియా 950, లుమియా 950 ఎక్స్‌ఎల్ ఫోన్లను ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు నాదెళ్ల తెలిపారు. వీటితోపాటు సర్ఫేస్ ప్రో 4 ట్యాబ్లెట్‌ను వచ్చే ఏడాది జనవరిలో భారత్ మార్కెట్లోకి అందుబాటులోకి తేనున్నట్లు ఆయన చెప్పారు.

సర్ఫేస్ ప్రో 4 ధర రూ.75 వేల స్థాయిలో ఉంటుందని అంచనా..

సర్ఫేస్ ప్రో 4 ధర రూ.75 వేల స్థాయిలో ఉంటుందని అంచనా. 12.3 అంగుళాల తాకేతెర కలిగిన ఈ ట్యాబ్లెట్ బరువు 766 గ్రాములు, 64 జీబీ మెమొరీ(128 జీబీ, 256 జీబీ, 500 జీబీ వరకు పెంచుకునే వీలుంటుంది), 9 గంటల పాటు బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లతో దీన్ని డిజైన్ చేశారు.

గిజ్‌బాట్ పేజిని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందండి. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Microsoft working on password free world Nadella
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot