ఆ సైటు మూతపడింది.. ఏ వస్తువు ఆర్డర్ చేయకండి

By Hazarath
|

లేటెస్ట్ గా దూసుకువచ్చిన ఈ కామర్స్ పోర్టల్ ఆస్క్ మి డాట్ కాం లో మీరు ఏదైనా ఆర్డర్ చేస్తున్నారా..ఒకవేళ ఆర్డర్ చేస్తే వెంటనే క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటే ఆ సంస్థ మూతపడింది. పెరుగుతున్న నష్టాల నేపథ్యంలో సంస్థ తమ కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయించింది. సంస్థ తీసుకున్న నిర్ణయంతో దాదాపు 4 వేల మంది ఉద్యోగులు రోడ్డు మీదకు రానున్నారు. మళ్లీ ఉద్యోగ వేటను ప్రారంభించనున్నారు.

6జిబి ర్యామ్‌,128 జిబి స్టోరేజ్‌తో శాంసంగ్ నెక్ట్స్ ఫోన్

ఆ సైటు మూతపడింది.. ఏ వస్తువు ఆర్డర్ చేయకండి

ఆ సైటు మూతపడింది.. ఏ వస్తువు ఆర్డర్ చేయకండి

తీవ్రమైన నగదులేమి, పెరుగుతున్న నష్టాల నేపథ్యంలో తన కార్యకలాపాలను స్తంభింప చేయాలని సంస్థ నిర్ణయించిందని జీ బిజ్ వెల్లడించింది. నిధుల సమీకరణలో చేసిన ప్రయత్నాలు విఫలంకావడంతో ఈ నిర్ణయం తీసుకుందని రిపోర్టు చేసింది.

ఆ సైటు మూతపడింది.. ఏ వస్తువు ఆర్డర్ చేయకండి

ఆ సైటు మూతపడింది.. ఏ వస్తువు ఆర్డర్ చేయకండి

లేటెస్ట్ ఈ కామర్స్ పోర్టల్ 'ఆస్క్ మీ డాట్ కాం' మూత పడటంతో దేశంలో దాదాపు నాలుగువేలమంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు.

ఆ సైటు మూతపడింది.. ఏ వస్తువు ఆర్డర్ చేయకండి

ఆ సైటు మూతపడింది.. ఏ వస్తువు ఆర్డర్ చేయకండి

ఈ క్రమంలో ఆస్క్ మీ వెబ్సైట్ ఉనికిలో ఉన్నప్పటికీ ఎలాంటి కొత్త ఆర్డర్ లను అంగీకరించడంలేదు.

ఆ సైటు మూతపడింది.. ఏ వస్తువు ఆర్డర్ చేయకండి
 
ఆ సైటు మూతపడింది.. ఏ వస్తువు ఆర్డర్ చేయకండి

మలేషియాకు చెందిన ఆస్ట్రో హీలియన్ వెంచర్ కాపిటల్ సంస్థలు సంయుక్తంగా 'ఆస్క్ మీ' తన సేవలను ప్రారంభించింది. అయితే ఆస్క్ మీ లో అతి పెద్ద వాటాదారు (97శాతం ) ఆస్ట్రో హోల్డింగ్స్ గత నెల నిష్క్రమణతోనే కంపెనీకి కష్టకాలం వచ్చినట్లు తెలుస్తోంది.

ఆ సైటు మూతపడింది.. ఏ వస్తువు ఆర్డర్ చేయకండి

ఆ సైటు మూతపడింది.. ఏ వస్తువు ఆర్డర్ చేయకండి

దీంతో దేశవ్యాప్తంగా సంస్థకు 40 కార్యాలయాలు ఉన్న ఆస్క్ మీ డాట్ కామ్ ప్రతి నెలా 6 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 39 కోట్లు) నష్టాన్ని సంస్థ భరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు వేతనాలు చెల్లించ లేని పరిస్థితికి నెట్టబడిందని జాతీయమీడియా రిపోర్ట్ చేసింది.

ఆ సైటు మూతపడింది.. ఏ వస్తువు ఆర్డర్ చేయకండి

ఆ సైటు మూతపడింది.. ఏ వస్తువు ఆర్డర్ చేయకండి

కాగా, కోల్ కతా కేంద్రంగా నడుస్తున్న సంస్థ ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితిలో ఆస్ట్రో కి ఈమెయిల్స్ , సందేశాలు పంపాలని ఉద్యోగులను కోరింది.

ఆ సైటు మూతపడింది.. ఏ వస్తువు ఆర్డర్ చేయకండి

ఆ సైటు మూతపడింది.. ఏ వస్తువు ఆర్డర్ చేయకండి

ఆస్క్ మీ పేరెంట్ కంపెనీ అయిన గెట్ ఇట్ ఇన్ఫో సర్వీసెస్ జోక్యం చేసుకుని ఈవిషయంపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌ని ఆశ్రయించినప్పటికీ ఎటువంటి ఫలితం దక్కలేదు.

ఆ సైటు మూతపడింది.. ఏ వస్తువు ఆర్డర్ చేయకండి

ఆ సైటు మూతపడింది.. ఏ వస్తువు ఆర్డర్ చేయకండి

ఇది ఇలా ఉంటే ఈ ఏడాది మే లో 30-40 కొత్త నగరాలకు తన కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికలను ప్రకటించింది. ప్రస్తుతమున్న 200 కేంద్రాలకు తోడుగా మరిన్నింటిని ప్రారంభించనున్నట్టు ప్రకటించిన ఆస్క్ మీ చివరికి అనూహ్యంగా మూతపడింది.

Best Mobiles in India

English summary
Here Write Mired with cash crunch, Askme.com shuts shop; cuts 4,000 jobs

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X