కలాం జ్ఞాపకాల నీడలో భాగ్యనగరం

|

దివికేగిన మాజీ రాష్ర్టపతి డాక్టర్ అబ్దుల్ కలాంను హైదరాబాద్ మరోసారి గుర్తు చేసుకుంది. కలాం నీడలో సేద తీరేందుకు భాగ్యనగరం సిద్దమైంది. హైదరాబాద్ లో ప్రఖ్యాత భవనానికి కలాంజీ పేరు పెట్టనున్నారు. మిస్సైల్‌ కాంప్లెక్స్‌ హైదరాబాద్‌ ఇక నుంచి డాక్టర్ అబ్దుల్ కలాం మిస్సైల్‌ కాంప్లెక్స్‌ కానుంది. ఈ మేరకు డీఆర్‌డిఓ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా భాగ్యనగరంతో కలాంజీకి ఉన్నఅనుబంధంపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: తోక చుక్కపై ఫీలే ల్యాండర్ దిగింది

గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే
డీఆర్‌డీఓ నిర్ణయం
 

డీఆర్‌డీఓ నిర్ణయం

మిస్సైల్‌ కాంప్లెక్స్‌ హైదరాబాద్‌'కు మరికొద్ది రోజుల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పేరు పెట్టనున్నారు. దీని పేరును ‘డాక్టర్‌ అబ్దుల్‌ కలాం మిస్సైల్‌ కాంప్లెక్స్‌'గా మార్చాలని డీఆర్‌డీఓ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

రక్షణ పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల

దీని ప్రాంగణంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల (డీఆర్‌డీఎల్‌), అధునాతన వ్యవస్థల ప్రయోగశాల (ఏఎస్‌ఎల్‌), రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ (ఆర్‌సీఐ) ఉన్నాయి.

ఆర్‌సీఐని స్థాపించిన అబ్దుల్‌ కలాం

వీటిలో ఆర్‌సీఐని అబ్దుల్‌ కలాం స్థాపించారు. ‘‘ఆర్‌సీఐని స్థాపించడం నా జీవితంలో అత్యంత సంతృప్తికరమైన విషయం. దేశ ఆయుధ సంపత్తిని పటిష్ఠపరచడం కోసం దీనిని ఏర్పాటు చేశాను. బంక మట్టితో కుండలు, వివిధ కళాకృతులు చేయడం కుమ్మరికి ఎలాంటి సంతోషాన్నిస్తుందో ఇది నాకు అంతటి సంతృప్తినిచ్చిందని కలాం ఆత్మకథ ‘వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌'లో రాసుకున్నారు.

కలాం తీపి గుర్తు

ఆర్‌సీఐ ఉద్యోగుల నివాస సముదాయం వద్ద కలాం తీపి గుర్తుగా కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు.

అబ్దుల్ కలాం పేరు మీద త్వరలో శాటిలైట్
 

అబ్దుల్ కలాం పేరు మీద త్వరలో శాటిలైట్

దీంతో పాటు మనదేశ పతాకాన్నివినువీధిలో రెపరెపలాడించిన అబ్దుల్ కలాం పేరు మీద త్వరలో శాటిలైట్ రాబోతుంది. మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాం అదించిన సేవలకు మరో అరుదైన గౌరవం దక్కనుంది. భూమి పరిశీలన,విపత్తుల నష్టాలను తగ్గించడం కోసం యుఎన్ ఓతో రూపొందించే గ్లోబల్ శాటిలైట్ ఫర్ డిఆర్ డిఆర్ కు కలాం పేరు పెట్టాలని ప్రతిపాదించారు. అబ్దుల్ కలాం గౌరవార్థం ఈ శాటిలైట్ కు యూఎన్ గ్లోబల్ శాట్ గా నామకరణం చేయనున్నారు.

ఐక్యరాజ్యసమితి ఆమోదం

అయితే ఇది ఐక్యరాజ్యసమితిలో అధికారికంగా ఆమోదించాల్సి ఉంటుంది. 

న్యూయార్క్ లో జరిగే ఈ కాన్పరెన్స్ లో..

సెప్టెంబర్ లో న్యూయార్క్ లో జరిగే ఈ కాన్పరెన్స్ లో నరేంద్ర మోడీ సహా 150కి పైగా దేశాల ప్రతినిధులు హజరవుతారు.ఈ సమావేశంలో కలాం పేరును ప్రతిపాదించే అవకాశం ఉంది. 

ప్రపంచంలో విప్తత్తులను నష్టాలను తగ్గించేందుకు ఏర్పాటు

స్పేస్ టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రపంచంలో విప్తత్తులను నష్టాలను తగ్గించడమే లక్ష్యంగా 1999లో కెనడాలోని మాంట్రియల్ ప్రధాన కేంద్రంగా సీఏఎన్ఈయూఎస్ ను ఏర్పాటు చేశారు.

నింగిని తాకిన కలాంజీ పేరు

కలాం పేరుతో రానున్న గ్లోబల్ శాటిలైట్ ఫర్ డిఆర్ డిఆర్

కలాంజీ అందుకో మా వందనం

తరతరాలకు తరిగిపోని స్ఫూర్తి నింపిన శాస్ర్తవేత్త

కలాంజీ పేరుతో శాటిలైట్

అబ్దుల్ కలాం పేరుతో రానున్న శాటిలైట్ ఇదే.ఇది వాతావరణ విపత్తులను దానికి సంబంధించిన వాటిని తెలుసుకోవడంలో ఉపయోగ పడుతుంది.  

కలాం పేరుతో శాటిలైట్

కలాం పేరుతో శాటిలైట్ ను ప్రతిపాదించిన సిఎఎన్ యు ఎస్

న్యూయార్క్ కాన్పరెన్స్

సెప్టెంబర్ లో న్యూయార్క్ లో జరగబోతున్న ఈ కాన్పరెన్స్ హాలులో కలాం పేరును ప్రతిపాదించే అవకాశం.

గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

English summary
HYDERABAD: Missile Complex Hyderabad which comprises Defence Research and Development Laboratory ( DRDL), the Advanced Systems Laboratory (ASL) and the Research Centre Imarat (RCI) will soon be renamed as 'Dr A P J Abdul Kalam Missile Complex', official sources said here today.

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more