మొబైల్‌ నుంచే నేరుగా రైల్వే టికెట్లు తీసుకోవచ్చు

By Hazarath
|

మీరు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా ..అయితే టికెట్ కోసం గంటలతరబడి లైన్లో నిలుచుని విసుగొస్తోందా...ఇక మీరు వెయిట్ చేయనవసరం లేదు. నేరుగా మీ మొబైల్ నుంచి మీ టికెట్లను కొనేయవచ్చు. ఇక మీరు మీ టికెట్ కూడా టీసీకి చూపించనవసరం లేదు. కేవలం మీ మొబైల్‌లో మీరు కొన్న టికెట్‌ను చూపిస్తే చాలు. అయితే ఇది ప్రస్తుతం ఎంఎంటీఎస్‌లకు అలాగే ఫ్లాట్ ఫాం టికెట్లకు మాత్రమే వర్తిస్తుంది. అండ్రాయిడ్, విడోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే మొబైల్ ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వాడుకోవచ్చు మరి ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో చూద్దాం.

Read more: ఇక మొబైల్ ఫోన్‌లో రైల్వే టికెట్ బుకింగ్

పేపర్‌లెస్ అన్‌రిజర్వ్‌డ్ టికెట్లు కోనేందుకు

పేపర్‌లెస్ అన్‌రిజర్వ్‌డ్ టికెట్లు కోనేందుకు

పేపర్‌లెస్ అన్‌రిజర్వ్‌డ్ టికెట్లు కోనేందుకు స్మార్ట్ ఫోన్లు ఉపయోగించే వారు ముందుగా గూగుల్ ప్లే, విండోస్ స్టోర్ నుంచి మొబైల్ టికెటింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

పేరు, ఫోన్ నెంబర్ తదితర వివరాలు నమోదు

పేరు, ఫోన్ నెంబర్ తదితర వివరాలు నమోదు

డౌన్లోడ్ చేసిన అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత ప్రయాణికులు రిజిస్టర్ కావాల్సి ఉంటుం‌ది. ఇందులో పేరు, ఫోన్ నెంబర్ తదితర వివరాలు నమోదు చేసుకోవాలి.

బుక్ టికెట్ అనే ఆప్షన్

బుక్ టికెట్ అనే ఆప్షన్

బుక్ టికెట్ అనే ఆప్షన్ ఎంచుకున్న అనంతరం నార్మల్ బుకింగ్‌ను క్లిక్ చేయాలి.

ఏ స్టేషన్ నుంచి ఎక్కడికి వెళ్లాలి

ఏ స్టేషన్ నుంచి ఎక్కడికి వెళ్లాలి

ఏ స్టేషన్ నుంచి ఎక్కడికి వెళ్లాలి అనే వివరాలు ఇచ్చి డన్ అనే అప్షన్ ఎంచుకోవాలి.

ఆర్-వాలెట్ ద్వారా డబ్బును బదిలీ చేస్తే

ఆర్-వాలెట్ ద్వారా డబ్బును బదిలీ చేస్తే

ఆర్-వాలెట్ ద్వారా డబ్బును బదిలీ చేస్తే టికెట్టు కన్ఫర్మ్ అవుతుంది.

యాప్‌లో వచ్చే బుకింగ్ వివరాలను

యాప్‌లో వచ్చే బుకింగ్ వివరాలను

యాప్‌లో వచ్చే బుకింగ్ వివరాలను టీటీఈ ఇస్తే సరిపోతుంది. టీటీఈ తన వద్ద ఉన్న మొబైల్లో వివరాలు సరిచూసుకొని ప్రయాణించేందుకు అనుమతిస్తారు.

కేవలం హైదరాబాద్ ఎం ఎంటీఎస్ మాత్రమే కాదు

కేవలం హైదరాబాద్ ఎం ఎంటీఎస్ మాత్రమే కాదు

మొబైల్ యాప్ ద్వారా కేవలం హైదరాబాద్ ఎం ఎంటీఎస్ మాత్రమే కాదు చెన్నై, ఢిల్లి, ముంబాయి, కోల్ కత్తా నగరాల ఎంఎంటీఎస్ టికెట్లు కూడా బుక్ చే సుకోవచ్చు.

పాస్‌లను పది రోజులు ముందుగానే

పాస్‌లను పది రోజులు ముందుగానే

ఇక పాస్‌లను పది రోజులు ముందుగానే రెన్యువల్ చేసుకునే సదుపాయం ఉంది. ప్లాట్‌ఫాం టికెట్టు కూడా క్యూలైన్లో నిలబడకుండా కొనుకోవచ్చు

మొబైల్ యాప్ ద్వారా టికెట్టు కొనుకోవాలనుకునే వారు

మొబైల్ యాప్ ద్వారా టికెట్టు కొనుకోవాలనుకునే వారు

మొబైల్ యాప్ ద్వారా టికెట్టు కొనుకోవాలనుకునే వారు డబ్బు బదిలీ చేసుకునేందుకు ఆర్-వాలెట్ను అందుబాటులోకి తీసుకువచ్చారు.

మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకునే ఫైల్లో

మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకునే ఫైల్లో

మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకునే ఫైల్లో ఆర్-వాలెట్ కూడా ఇన్‌స్టాల్ అవుతుంది. దీని ద్వారా వంద నుంచి ఐదు వేల రూపాయల వరకు డబ్బు బ్యాంకు ద్వారా బదిలీ చేసుకుంటే సరిపోతుంది.

యాప్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

యాప్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

యాప్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  https://play.google.com/store/apps/details?id=com.cris.utsmobile&hl=en

Best Mobiles in India

English summary
Here Write Mobile App for Paperless Unreserved Railway Ticket to be Launched today

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X