పిల్లలు కాదు పిడుగులు

|

ఈ స్టోరీ ద్వారా మీకు పరిచయం కాబోతున్న ఐదుగురు చిచ్చరపిడుగులు అపారమైన నైపుణ్యాలను సంతరించుకుని అతి చిన్న వయసులోనే ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ప్రపంచం నివ్వెరపోయేలా తమ టాలెంట్‌ను ప్రదర్శించి పిల్లలందరికి స్పూర్తిగా నిలిచారు...

(ఇంకా చదవండి: అంతరిక్షంలోకి మనుషుల కంటే ముందే!)

వీళ్లు పిల్లలు కాదు పిడుగులు

వీళ్లు పిల్లలు కాదు పిడుగులు

కిమ్ అంగ్ యాంగ్

కొరియా దేశంలో మార్చి 8, 1962లో జన్మించిన కిమ్ అంగ్ యాంగ్ ప్రపంచంలోనే అత్యంత జీనియస్ చైల్డ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. నాలుగేళ్ల వయసులోనే కొరియన్, జపనీస్, ఇంగ్లీష్ ఇంకా జర్మన్ భాషల పై పట్టు సాధించిన ఈ చిచ్చర పిడుగు 210 ఐక్యూ స్కోరును నమోదు చేసి గిన్నెస్ బుక్ రికార్డ్‌లను నెలకొల్పాడు.

 

వీళ్లు పిల్లలు కాదు పిడుగులు

వీళ్లు పిల్లలు కాదు పిడుగులు

అకృత్ జైస్వాల్

‘ప్రపంచపు స్మార్టెస్ట్ బాయ్'గా గుర్తింపు తెచ్చుకున్న బాలమేధావి అకృత్ జైస్వాల్ 146 ఐక్యూ స్కోర్ తో మంచి గుర్తింపును పొందాడు. తన ఇంటి సమీపంలోని ఓ బాలిక చేతికి కాలిన గాయల పాలవగా అత్యవసర పరిస్థితుల్లో ఆమెకు ఆపరేషన్ నిర్వహించి వార్తల్లో నిలిచాడు. 12 సంవత్సరాల వయసులోనే క్యాన్సర్ నివారణా మార్గాన్ని కనుగొని యావత్ ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

 

వీళ్లు పిల్లలు కాదు పిడుగులు

వీళ్లు పిల్లలు కాదు పిడుగులు

అర్ఫా కరీం

చిరు ప్రాయంలోనే ఈ బాలిక కంప్యూటర్ రంగంలో అద్భుతమైన ప్రతిభను కనబర్చి సంచనాలు నమోదుచేసింది. తొమ్మిది సంవత్సరాల వయసులోనే మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ (ఎంసీపీ)గా గుర్తింపు తెచ్చుకున్న అర్ఫా కరీం 16 ఏళ్ల ప్రాయంలో ఫిట్స్ వ్యాధిలో మరణించింది. మృత్యువు ఆమెను నిర్థాక్షణ్యంగా కబళించింది.

 

వీళ్లు పిల్లలు కాదు పిడుగులు

వీళ్లు పిల్లలు కాదు పిడుగులు

క్లియోపాత్రా స్ట్రాటన్

అక్టోబర్ 6, 2002లో జన్మించిన క్లియోపాత్రా స్ట్రాటన్ తన అద్భుతమైన స్వరంతో బాలగాయనిగా గుర్తింపు తెచ్చుకుంది. మూడేళ్ల యవసులో ఈ చిన్నారి పాడిన ప్రతి పాటకు పారితోషకంగా 1000€ లభించింది. ఈ బాల కళాకారిణి అతి చిన్న వయసులో ‘ఎంటీవీ' అవార్డును దక్కించుకుని చరిత్ర సృష్టించింది.

 

వీళ్లు పిల్లలు కాదు పిడుగులు

వీళ్లు పిల్లలు కాదు పిడుగులు

ఐలితా ఆండ్రీ

జనవరి 9, 2007లో జన్మించిన ఐలితా ఆండ్రీ రెండు సంవత్సరాల వయసులోనే పెయింటిగ్స్ వేసిన బాలకళాకారిణిగా ప్రపంచస్థాయి గుర్తింపును సొంతం చేసుకుంది. రెండేళ్ల ప్రాయంలో ఆండ్రీ వేసిన పెయింటింగ్స్ కు ఆర్ట్ గ్యాలరీలో చోటు దక్కాయి. ఈ పెయింటిగ్స్ కళాభిమానులను విశేషంగా ఆకర్షింపజేస్తున్నాయి.

 

Best Mobiles in India

English summary
Most Genius Child Prodigies of The World. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X