మోటో 360 స్మార్ట్‌వాచ్ పై రూ.5,000 తగ్గింపు

Posted By:

మోటరోలా తన మోటో 360 స్మార్ట్‌వాచ్ పై రూ.5,000 ధర తగ్గింపును ప్రకటించింది. తాజా ధర తగ్గింపులో భాగంగా అన్ని లెదర్ వేరియంట్ 360 స్మార్ట్ వాచ్ లు రూ.12,999 ధర ట్యాగ్ లతో, మెటల్ వేరియంట్ స్మార్ట్ వాచ్ రూ.14,999 ధర ట్యాగ్ తో లభ్యమవుతోంది. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్ కార్ట్ ఈ స్మార్ట్ వాచ్ లను ఎక్స్ క్లూజివ్ గా విక్రయిస్తోంది. మోటో 360 స్మార్ట్ వాచ్ ను తొలిసారిగా సెప్టంబర్, 2014లో విడుదల చేసారు. విడుదల సమయంలో లెదర్ వేరియంట్ ధర రూ.17,999 కాగా మెటల్ వేరియంట్ ధర రూ.19,999.

(ఇంకా చదవండి: మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవటం ఏలా..?)

 మోటో 360 స్మార్ట్‌వాచ్ పై రూ.5,000 తగ్గింపు

మోటో 360 స్మార్ట్‌వాచ్ ప్రత్యేకతలు... గూగుల్ ఆండ్రాయిడ్ వేర్ ప్లాట్‌ఫామ్ పై మోటో 360 స్మార్ట్‌వాచ్ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 4.3 ఆపై వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లను ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. 1.56 అంగుళాల బ్యాక్‌లైట్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320x290పిక్సల్స్, 205 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, టీఐ ఓఎమ్ఏపీ 3 ప్రాసెసర్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 512 ఎంబి ర్యామ్, బ్లూటూత్ 4.0 కనెక్టువిటీ, 320 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. వాటర్ ప్రూఫ్ వ్యవస్థతో డిజైన్ కాబడిన మోటో 360 స్మార్ట్‌వాచ్‌ ఈ స్మార్ట్‌వాచ్ బరువు 49 గ్రాములు.

 మోటో 360 స్మార్ట్‌వాచ్ పై రూ.5,000 తగ్గింపు

ఒకే ఒక ఫిజికల్ బటన్‌ను ఈ వాచ్‌లో అమర్చటం జరిగింది. డ్యూయల్ మైక్రోఫోన్ వ్యవస్థ ఉత్తమ క్వాలిటీ ఆడియోను అందిస్తుంది. ఈ వాచ్ ఉన్న ప్రదేశాన్ని బట్టి వాతావరణం, సమయం, రిమైండర్స్, ట్రాఫిక్ తదితర అంశాలకు సంబంధించి అప్‌డేట్‌లను అందిస్తుంది. పటిష్టమైన వాటర్ ప్రూఫ్ వ్యవస్థతో డిజైన్ కాబడిన మోటో 360 స్మార్ట్‌వాచ్‌ను బ్లూటూత్ కనెక్టువిటీ సాయంతో స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించుకోవల్సి ఉంటుంది. కాల్స్, మెయిల్స్ తదితర లావాదేవీలను ఈ వాచ్ ద్వారానే నిర్వహించుకోవచ్చు. పిడోమీటర్, ఆప్టికల్ హార్ట్ రేట్ మానిటర్ వంటి సెన్సార్‌లు వాచ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

English summary
Moto 360 price dropped by Rs 5,000; now available at Rs 12,999. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot