Motorola Moto G8 Power Lite Sale:గొప్ప ఆఫర్లతో తక్కువ ధరలోనే స్మార్ట్‌ఫోన్!!!
లెనోవా యాజమాన్యంలోని స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా గత నెలలో ఇండియాలో తన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మోటో G8 పవర్ లైట్ ను విడుదల చేసింది. అద్భుతమైన స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్లను కలిగి ఉన్న ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ యొక్క అమ్మకాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్‌లో మొదలు కానున్నాయి.

మోటో G8 పవర్ లైట్ సేల్
మోటరోలా యొక్క ఈ కొత్త ఫోన్ ఎంట్రీ లెవల్ విభాగంలో ఆసక్తికరంగా ఒకే ఒక స్టోరేజ్ ఎంపికలో లభిస్తుంది. ఇది ఈ విభాగంలో రియల్ మి నార్జో 10 ఎ, రియల్మే C3 మరియు రెడ్మి 6A డ్యూయల్ వంటి వాటికీ గట్టి పోటీగా ఉంటున్నది. Also Read:Flipkart TV Days Sale: బ్రహ్మాడమైన ఆఫర్లతో టీవీల కొనుగోలుకు సరైన సమయం.....

మోటో G 8 పవర్ లైట్ ధరల వివరాలు
మోటరోలా యొక్క మోటో G 8 పవర్ లైట్ స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే ఒక వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. ఇందులో భాగమైన 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ యొక్క సింగిల్ వేరియంట్ ధర 8,999 రూపాయలు. ఈ ఫోన్ ఆర్కిటిక్ బ్లూ మరియు రాయల్ బ్లూ వంటి రెండు కలర్ ఆప్షన్లలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. Redmi Note 9 Pro Max Sale: ఊహించని ఆఫర్లతో గొప్ప అవకాశం!!!

మోటో G 8 పవర్ లైట్ సేల్స్ ఆఫర్స్
ఫ్లిప్‌కార్ట్ ద్వారా జరిగే మోటో జి 8 పవర్ లైట్ సేల్స్ యొక్క ఆఫర్లలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ఐదు శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇంకా నో-కాస్ట్ ఇఎంఐ ఎంపికలతో పాటుగా నెలవారీ రూ.750 EMI ఎంపిక కూడా ఉంది. ఇంకా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లో 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ కూడా ఉంది.

మోటో G 8 పవర్ లైట్ స్పెసిఫికేషన్స్
మోటరోలా యొక్క మోటో G8 పవర్ లైట్ స్మార్ట్‌ఫోన్ యొక్క 6.5-అంగుళాల డిస్ప్లే 20: 9 కారక నిష్పత్తితో IPS LCD మాక్స్ విజన్ ప్యానల్‌ను కలిగి ఉంది. ఇది వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్డ్ డిస్‌ప్లేను HD + రిజల్యూషన్‌తో కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్ హెలియో P 35 చిప్‌సెట్ ను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 9 పై ఓఎస్‌తో రన్ అవుతుంది. అలాగే ఇది 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5,000mah బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంది.

మోటో G 8 పవర్ లైట్ కెమెరా సెటప్
మోటో G8 పవర్ లైట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ సెటప్‌లో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో వస్తుంది. అలాగే ఈ సెటప్‌లో ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ సెకండరీ కెమెరా మరియు ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు జతచేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియోల కోసం ఫోన్ యొక్క ముందుభాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇది డ్యూయల్ కెమెరా బోకె, ఫేస్ బ్యూటీ, హెచ్‌డిఆర్, గూగుల్ లెన్స్ వంటి మరిన్ని ఫీచర్లకు కూడా మద్దతు ఇస్తుంది. ముందు మరియు వెనుక కెమెరా సెన్సార్లు రెండూ 30fps 1080p వీడియో రికార్డింగ్ కోసం మద్దతునిస్తాయి.

మోటో G8 పవర్ లైట్ కనెక్టివిటీ
మోటరోలా మోటో జి 8 పవర్ లైట్ స్మార్ట్‌ఫోన్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఎంపికతో లభిస్తుంది. ఈ కొత్త ఫోన్‌లో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 500GB వరకు విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 b/g/n, బ్లూటూత్ 4.2, జిపిఎస్, మైక్రో యుఎస్‌బి పోర్ట్ మరియు 3.5mm ఆడియో జాక్ లు ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ గల ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం ఒక ఛార్జ్‌లో రెండు రోజుల లైఫ్ ను అందిస్తుంది. ఇది స్ప్లాష్-రెసిస్టెంట్ ను కలిగి ఉండి 200 గ్రాముల బరువు ఉంటుంది.


Click it and Unblock the Notifications