Flipkart TV Days Sale: బ్రహ్మాడమైన ఆఫర్లతో టీవీల కొనుగోలుకు సరైన సమయం.....
ఇండియాలో ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ ను అధిక ఆఫర్లతో నిర్వహిస్తున్న ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ టీవీ డేస్ పేరుతో ప్రత్యేక సేల్స్ ను నిర్వహిస్తున్నది. జూన్ 8 నుండి జూన్ 11 వరకు జరిగే ఈ సేల్స్ లో వివిధ రకాల స్మార్ట్ టీవీలను తగ్గింపు ధరల వద్ద అందిస్తున్నది.

ఫ్లిప్‌కార్ట్ టీవీ డేస్ సేల్స్
ఇప్పుడు తక్కువ ధరలో మంచి బ్రాండ్ టీవీను కొనాలని చూస్తున్న వారికి ఇదే సరైన సమయం. ఈ సేల్స్ లో ప్రముఖ సాంసంగ్,LG, Mi,రియల్ మి,VU, కోడాక్,మైక్రోమాక్స్ ,థామ్సన్ ,sansui,సోని బ్రావియా వంటి కంపెనీల స్మార్ట్ టీవీలను అద్భుతమైన తగ్గింపు ధరల వద్ద పొందవచ్చు. Also Read:BSNL Prepaid Plans:తక్కువ ధరలో రోజువారీ 3GB డేటాను అందిస్తున్న ప్లాన్‌లు

ఫ్లిప్‌కార్ట్ టీవీ డేస్ సేల్స్ ఆఫర్స్
ప్రస్తుతం స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయాలనుకుంటున్న వారికోసం ఫ్లిప్‌కార్ట్ లో నిర్వహిస్తున్న ఫ్లిప్‌కార్ట్ టీవీ డేస్ సేల్ లో సిటీ బ్యాంక్ యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డు వినియోగదారులకు 10% తగ్గింపును అందిస్తుంది. అలాగే ప్రస్తుతం ఏదైనా స్మార్ట్ టీవీను కొనుగోలు చేసిన వారికి ఫ్లిప్‌కార్ట్ ఉచితంగా 6 నెలల యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ను అందిస్తోంది. Also Read:Realme Narzo 10A Sale : కొత్త బడ్జెట్ ఫోన్‌ను తగ్గింపు ధర వద్ద పొందే గొప్ప అవకాశం....

55-inch నోకియా స్మార్ట్ టీవీ
గత నెలలో ఇండియాలో విడుదల అయిన 55-అంగుళాల నోకియా స్మార్ట్ టీవీ యొక్క అమ్మకాలు ఈ రోజు మొదటిసరిగా ఫ్లిప్‌కార్ట్ లో మొదలయినాయి. రూ.41,999 ధర గల నోకియా టీవీ కొనుగోలు మీద రూ.7,000 తగ్గింపు ఆఫర్లతో పాటుగా 12 నెలల పాటు ఎటువంటి అదనపు ఖర్చు లేని నో-కాస్ట్ EMI ఎంపికను కూడా అందిస్తోంది. Also Read:Reliance Jio Hotstar Offer ను ఉచితంగా అందిస్తున్న జియో ప్యాక్‌లు ఇవే..

32-అంగుళాల స్మార్ట్ టీవీలు
32-అంగుళాల డిస్ప్లే గల స్మార్ట్ టీవీలు రూ.8,000 ల నుంచి రూ.14,000 ధరల వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ ధరల విభాగంలో సాంసంగ్, Mi, మైక్రోమాక్స్ ,థామ్సన్ ,sansui వంటి బ్రాండ్ల టీవీలు లభిస్తాయి. ఈ స్మార్ట్ టీవీ ల మీద అందిస్తున్న మరిన్ని తగ్గింపు ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఫ్లిప్‌కార్ట్ యొక్క వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

40/43/50/55 అంగుళాల స్మార్ట్ టీవీలు
Mi, మైక్రోమాక్స్ ,LG, VU, థామ్సన్ వంటి బ్రాండ్ల 40/43/50/55 అంగుళాల స్మార్ట్ టీవీలను కూడా గొప్ప తగ్గింపు ధరల వద్ద అందిస్తున్నారు. 40/43 అంగుళాల విభాగంలో గల స్మార్ట్ టీవీల యొక్క ధరలు రూ.15,000 నుండి గరిష్టంగా రూ.26,000 మధ్య ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీలను కొన్న వారికి ఫ్లిప్‌కార్ట్ 6 నెలల యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ - యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్
ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం నిర్వహిస్తున్న సేల్స్ లో స్మార్ట్ టీవీలు మరియు స్మార్ట్ ఫోన్ లను కొన్న ప్రతి ఒక్కరికి 6 నెలల యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది. వినియోగదారులు తమ ఫ్లిప్‌కార్ట్ యొక్క ID లేదా ఫోన్ నెంబర్ ను ఉపయోగించి టీవీను లేదా మొబైల్ ఫోన్ ను కొనుగోలు చేయవలసి ఉంటుంది. వినియోగదారులు కొనుగోలు చేసిన వస్తువును అందుకున్న తరువాత యూనిక్యూ యాక్టీవేషన్ లింకును SMS రూపంలో ఫోన్ నెంబర్ కు పంపబడుతుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ యొక్క యాప్ అకౌంటుకు కూడా పంపబడుతుంది. ఈ యూనిక్యూ యాక్టీవేషన్ లింకును ఫ్లిప్‌కార్ట్ జూలై 25 వరకు కొనుగోలు చేసిన వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ పంపుతుంది.


Click it and Unblock the Notifications