సరసమైన ధర వద్ద రిలీజ్ అయిన కొత్త మోటో E6s స్మార్ట్‌ఫోన్

|

మోటరోలా సంస్థ తన సరికొత్త బడ్జెట్ ఇ సిరీస్ సరసమైన స్మార్ట్‌ఫోన్ జాబితాలో మోటో E6s లను 7,999 రూపాయల ధర ట్యాగ్ వద్ద భారత్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ సెప్టెంబర్ 23 నుండి ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అమ్మకానికి ఉంచింది. మోటో E6s లు మోటరోలా ఇ 6 ప్లస్ యొక్క రీబ్రాండెడ్ వేరియంట్ గా కొన్ని వారాల క్రితం బెర్లిన్‌లో జరిగిన IFA 2019 లో ఆవిష్కరించబడింది.

మోటరోలా
 

మోటరోలా కంపెనీ నెమ్మదిగా తన పోర్ట్‌ఫోలియోను ఆన్‌లైన్‌లో విస్తరిస్తోంది. లెనోవా యాజమాన్యంలోని మోటరోలా కంపెనీ భారతదేశంలో మోటరోలా E6S తో మిగిలిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లతో పోటీ పడాలని చూస్తోంది. బడ్జెట్ విభాగంలో షియోమి మరియు రియల్మి నుండి దీనికి గట్టి పోటి ఉంది. మోటో ఇ 6 ఎస్ వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ డిస్ప్లే మరియు బ్యాక్ ప్యానెల్ లో తొలగించగల బ్యాటరీతో మరియు నిగనిగలాడే రంగురంగుల బ్యాక్ డిజైన్‌తో వస్తుంది.

ధర

ధర

మోటో ఇ 6 ఎస్ కేవలం ఒకే ఒక వేరియంట్లో 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క ధర భారతదేశంలో 7,999 రూపాయలు. ఇది సెప్టెంబర్ 23 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. మోటో E6s పాలిష్ గ్రాఫైట్ మరియు రిచ్ క్రాన్బెర్రీ వంటి రెండు కలర్ ఎంపికలలో వస్తుంది. లాంచ్ ఆఫర్ల విషయానికొస్తే రిలయన్స్ జియో యొక్క 2,200 రూపాయల కూపున్ ఆఫర్‌లు మరియు 3,000 రూపాయల విలువైన క్లియర్‌ట్రిప్ వోచర్లను కూడా అందిస్తుంది.

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

మోటో ఇ 6 ఎస్ స్మార్ట్‌ఫోన్ 6.1-అంగుళాల హెచ్‌డి + (720 × 1560 పిక్సెల్స్) వాటర్‌డ్రాప్-నాచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో P 22 SoC ఆధారంగా రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో ఒక వేరియంట్‌తో రిలీజ్ అయింది. ఇది 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అందించబడుతుంది. ఇందులో మైక్రో SD కార్డ్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు. అంటే ఇది ట్రిపుల్-స్లాట్ ఎంపికతో వస్తోంది. అంటే మీరు ఒకే సమయంలో రెండు-సిమ్‌లతో పాటు మైక్రో SD కార్డ్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. వెనుకవైపు ఉన్న ప్యానెల్ తొలగించదగినది. ఇది 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. దీనికి వెనుకవైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ సెన్సార్ కూడా ఉంది.

కెమెరాలు
 

కెమెరాలు

కెమెరా యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం స్మార్ట్‌ఫోన్ యొక్క వెనుక భాగంలో డ్యూయల్-రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. మోటో ఇ 6 ఎస్ డ్యూయల్-రియర్ కెమెరా సెటప్‌లో ఎఫ్ / 2.0 లెన్స్ సెన్సార్ తో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు ఎఫ్ / 1.8 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. అలాగే సెల్ఫీస్ మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.0 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. 3,000 ఎంఏహెచ్ బ్యాటరీకి యుఎస్‌బి టైప్-సి 10W టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సాఫ్ట్‌వేర్ విషయంలో ఇది స్టాక్ ఆండ్రాయిడ్ 9 పైతో పనిచేస్తుంది.

కనెక్టివిటీ

కనెక్టివిటీ

మోటో ఇ 6 ఎస్ స్మార్ట్‌ఫోన్ లో 64GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు విస్తరించడానికి SD కార్డ్ స్లాట్ కూడా ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో భాగంగా ఇందులో 4G VoLTE, Wi-Fi 802.11 b / g / n, బ్లూటూత్ v4.2, GPS / A-GPS, FM రేడియో, 3.5mm ఆడియో జాక్ మరియు మైక్రో- USB పోర్ట్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది.చివరిగా ఈ ఫోన్ 3,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

స్మార్ట్ టివిలు

స్మార్ట్ టివిలు

ఈ రోజు జరిగిన లాంచ్ కార్యక్రమంలో మోటో ఇ 6 ఎస్ స్మార్ట్‌ఫోన్ తో పాటు ఆండ్రాయిడ్ టివిలను కూడా రిలీజ్ చేసింది. ఇతర స్మార్ట్‌ఫోన్ తయారీదారులు టెలివిజన్ల వ్యాపారంలోకి అడుగుపెట్టిన తరువాత లెనోవా యాజమాన్యంలోని మోటరోలా తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ OSతో నడిచే స్మార్ట్ టివిలను భారతదేశంలో విడుదల చేసింది. వీటి యొక్క ధర రూ.13,999 నుండి రూ. 64,999ల వరకు ఉంది. దీని యొక్క ధర వాటి యొక్క పరిమాణం మరియు రిజల్యూషన్‌ను బట్టి ఉంటుంది. కొత్త టీవీల యొక్క స్క్రీన్ 32 అంగుళాల నుండి 65 అంగుళాల వరకు మరియు HD నుండి 4K రిజల్యూషన్ల ఎంపికలను కలిగి ఉంటుంది. మోటరోలా టీవీలు సెప్టెంబర్ 29 నుండి జరిగే ఫ్లిప్‌కార్ట్‌ యొక్క బిగ్ బిలియన్ డేస్ ద్వారా వినియోగదారులకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Motorola launched Moto E6S in India: Price, availability, offers and more

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X