Home
News

Motorola Moto G8 Power Lite: Rs.8,999 ధరకే మోటరోలా కొత్త ఫోన్!!! ఫీచర్స్ అదుర్స్...

మోటరోలా సంస్థ తన 2020 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మోటరోలా ఎడ్జ్ + ను విడుదల చేసిన మూడు రోజుల తరువాత ఈ రోజు మరొక కొత్త ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేసింది. మోటో G8 పవర్ లైట్ పేరుతో గల ఈ స్మార్ట్‌ఫోన్‌ను మోటరోలా భారత్‌లో విడుదల చేసింది.

మోటరోలా

ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ హ్యాండ్‌సెట్‌ను రాయల్ బ్లూ మరియు ఆర్కిటిక్ బ్లూ అనే రెండు కలర్ వేరియంట్ లలో దీనిని అందిస్తోంది. సరికొత్త మోటరోలా ఫోన్‌ యొక్క సేల్స్ మే 29 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా మొదలుకానున్నాయి. మోటరోలా బ్రాండ్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,000 కంటే తక్కువ ధరకు దీనిని విడుదల చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Honor 9X Pro Sale: Rs.3,000 డిస్కౌంట్ ధరతో గొప్ప అవకాశం...

మోటో G8 పవర్ లైట్ ధరల వివరాలు

మోటో G8 పవర్ లైట్ ధరల వివరాలు

మోటరోలా సంస్థ మోటో G8 పవర్ లైట్ స్మార్ట్‌ఫోన్‌ను అత్యంత సరసమైన ధరలలో విడుదల చేసింది. దీనిని కేవలం ఒకే ఒక వేరియంట్ తో మాత్రమే విడుదల చేస్తున్నారు. 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ ను రూ.8,999 ధర వద్ద అందిస్తోంది. రాయల్ బ్లూ మరియు ఆర్కిటిక్ బ్లూ అనే రెండు కలర్ వేరియంట్ లలో లభిస్తుంది. Realme Smart TV ఫీచర్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఓ లుక్ వేయండి....

మోటో G8 పవర్ లైట్‌ స్పెసిఫికేషన్స్

మోటో G8 పవర్ లైట్‌ స్పెసిఫికేషన్స్

మోటరోలా యొక్క మోటో G8 పవర్ లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ 10W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో 5,000mah బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంది. ఇది మీడియాటెక్ హెలియో P 35 చిప్‌సెట్ ను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 9 పై ఓఎస్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ యొక్క డిస్ప్లే 20: 9 కారక నిష్పత్తితో 6.5-అంగుళాల IPS LCD మాక్స్ విజన్ ప్యానల్‌ను కలిగి ఉంది. ఇది వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్డ్ డిస్‌ప్లేను HD + రిజల్యూషన్‌తో కలిగి ఉంటుంది. Motorola Edge+ స్మార్ట్‌ఫోన్ లాంచ్... డిస్కౌంట్ ఆఫర్లతో ప్రీ-బుకింగ్

కెమెరా సెటప్‌

కెమెరా సెటప్‌

మోటో G8 పవర్ లైట్‌ స్మార్ట్‌ఫోన్ యొక్క వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఫోటోగ్రఫీ విషయానికొస్తే ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్ ఉంది. అలాగే ఈ సెటప్‌లో ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ మరియు ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు కూడా ఉన్నాయి. ఇది డ్యూయల్ కెమెరా బోకె, ఫేస్ బ్యూటీ, హెచ్‌డిఆర్, గూగుల్ లెన్స్ వంటి మరిన్ని ఫీచర్లకు కూడా మద్దతు ఇస్తుంది. సెల్ఫీలు మరియు వీడియోల కోసం ఫోన్ యొక్క ముందుభాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ముందు మరియు వెనుక కెమెరా సెన్సార్లు రెండూ 30fps 1080p వీడియో రికార్డింగ్ కోసం మద్దతునిస్తాయి. Jio, Airtel, Vodafone: లాక్డౌన్ లో మీకు ఉపయోగపడే అధిక డేటా ప్లాన్‌లు

కనెక్టివిటీ

కనెక్టివిటీ

మోటరోలా మోటో జి 8 పవర్ లైట్ స్ప్లాష్-రెసిస్టెంట్ ను కలిగి ఉండి దాదాపు 200 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. 64GBu ఇంటర్నల్ స్టోరేజ్ ఎంపికతో లభించే ఈ కొత్త ఫోన్‌లో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 500GB వరకు విస్తరించడానికి అవకాశం ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 b/g/n, బ్లూటూత్ 4.2, జిపిఎస్, మైక్రో యుఎస్‌బి పోర్ట్ మరియు 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి.

బ్యాటరీ

బ్యాటరీ

5000 ఎంఏహెచ్ బ్యాటరీ సైజు గల స్మార్ట్‌ఫోన్ ఒకే ఛార్జ్‌లో రెండు రోజుల కన్నా ఎక్కువగా పనిచేస్తుంది. ఇందులో మీరు 100 గంటల పాటు పాటలు వినవచ్చు మరియు 19 గంటల వరకు వీడియోలు లేదా సినిమాలను చూడవచ్చు. డబ్బును ఆదా చేయడంతో పాటుగా శక్తివంతమైన పరికరం కావాలనుకునే వ్యక్తులకు ఈ ఫోన్ సరిగ్గా సరిపోతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola Moto G8 Power Lite Launched In India: Price, Specs, Availability and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X