మోటరోలా ఫోన్‌లలో మార్పులు

Written By:

2015లో విడుదలైన అనేక ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఫీచర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ విప్లవాత్మక ఫీచర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోన్న నేపథ్యంలో అన్ని ప్రముఖ కంపెనీలు, ఈ స్పెసిఫికేషన్‌ను తమ ఫోన్‌లలో పొందుపరుస్తున్నాయి.

మోటరోలా ఫోన్‌లలో మార్పులు

ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఫీచర్, మార్కెట్ హాట్ టాపిక్‌గా నిలిచిన నేపథ్యంలో lenovo owned మోటరోలా సైతం ఈ ఫీచర్ పై ఆసక్తి చూపుతోంది. మోటరోలా నుంచి 2016లో విడుదలయ్యే అన్ని ప్రీమియం ఫోన్‌లలో ఫింగర్ ప్రింట్ ఫీచర్‌ను పొందుపరచనున్నట్లు లెనోవో గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ Chen Xudong వెల్లడించారు.

3జీబి ర్యామ్, ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో హాటెస్ట్ ఫోన్ రాబోతోంది

5 అంగుళాలు, అంతకన్నా ఎక్కువ డిస్‌ప్లేతో వచ్చే ఫోన్‌లలో మాత్రామే ఈ సౌలభ్యం ఉంటందని ఆయన చైనా మీడియాకు తెలిపారు. మోటారోలా నుంచి ఈ ఏడాది విడుదలయ్యే ఫోన్‌లన్ని హై‌ఎండ్ మార్కెట్‌ను టార్గెట్ చేసేవిగాను, లెనోవో వైబ్ సిరీస్ నుంచి విడుదలయ్యే ఫోన్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ మార్కెట్‌ను టార్గెట్ చేసేవిగాను ఉంటాయని తెలుస్తోంది.

ఫోన్‌లను అక్కడ మాత్రం పెట్టకండి

మోటరోలా నుంచి ఇక నుంచి వచ్చే స్మార్ట్‌ఫోన్‌లు మోటో బై లెనోవో (Moto by Lenovo) బ్రాండ్‌తో ఉంటాయని లెనోవో ఇటీవల ప్రకటించింది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటరోలా, లెనోవో డీల్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు

మోటరోలా మొబిలిటీని లెనోవో గతేడాది గూగుల్ వద్ద నుంచి కొనుగోలు చేసేన విషయం తెలిసిందే. ఈ డీల్ విలువ 2.9 బిలియన్ యూఎస్ డాలర్లు.

 

మోటరోలా, లెనోవో డీల్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు

ఈ డీల్‌లో భాగంగా లెనోవో, గూగుల్‌కు 660 మిలియన్ డాలర్లు నగదు రూపంలో, 750 మిలియన్ డాలర్లు షేర్ల రూపంలో, మరో 1.5 బిలియన్ డాలర్లు డీల్ క్లోజింగ్ నాటికి ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది.

మోటరోలా, లెనోవో డీల్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు

టెక్నాలజీ విభాగంలో ఓ చైనా కంపెనీ చేపట్టిన అతిపెద్ద డీల్‌గా లెనోవో- మోటరోలా డీల్ చరిత్రకెక్కింది.

మోటరోలా, లెనోవో డీల్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు

గూగుల్ మోటరోలా మెబిలిటీని 2012లో $12.5బిలియన్‌లను వెచ్చించి సొంతం చేసుకుంది.

 

 

మోటరోలా, లెనోవో డీల్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు

లెనోవోకు ఇప్పటికే చైనా మార్కెట్లో మంచి పట్టు ఉంది. మోటరోలా మొబిలిటీ మొబైల్ డివిజన్‌ను సొంతం చేసుకోవటంతో లెనోవో, యూఎస్ ఇంకా ఇతర ప్రధాన మార్కెట్లలో స్మార్ట్‌ఫోన్ వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంది.

మోటరోలా, లెనోవో డీల్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు

ఈ డీల్‌లో భాగంగా మోటరోలా మొబిలిటీకి సంబంధించిన 15,000 పేటెంట్ హక్కులను గూగుల్ తన ఆధీనంలోనే ఉంచుంది.

మోటరోలా, లెనోవో డీల్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు

బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న చైనా ఫోన్‌ల కంపెనీ లెనోవో అమ్మకాల పరంగా భారత్‌లో రికార్డుల మోత మోగించింది. 2015కుగాను భారత్‌లో 30 లక్షల పై చిలుకు 4జీ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించినట్లు లెనోవో ఇండియా డైరెక్టర్ సుదిన్ మతుర్ ఇటీవల వెల్లడించారు.

దేశవ్యాప్తంగా లెనోవో సర్వీస్ సెంటర్లు

దేశవ్యాప్తంగా తమ సర్వీస్ సెంటర్ల నెట్‌వర్క్‌ను మరింత విస్తరింపజేసే క్రమంలో 50 కొత్త సర్వీస్ సెంటర్‌లను నెలరొల్పనున్నట్లు మతుర్ తెలిపారు. 2016 మధ్యనాటికి ఫ్రాంచైజీ ప్రాతిపదికన ఈ సర్వీస్ సెంటర్ల సంఖ్యను 100కు పెంచుతామని సుదిన్ మతుర్ తెలిపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
All Motorola phones in 2016 will sport a fingerprint scanner. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot