స్మార్ట్‌ఫోన్‌లకు స్వస్తి చెప్పబోతున్న ‘Firefox OS’

Written By:

ఉచిత సాఫ్ట్‌వేర్ కమ్యూనిటీ Mozilla, త్వరలో తన ఫైర్‌‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టంకు స్విస్తి పలకబోతోంది. మొజిల్లా డెవలపర్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో యాపిల్, గూగుల్ ప్లాట్‌ఫామ్‌లకు పోటీగా మూడు సంవత్సరాల క్రితం అందుబాటులోకి వచ్చిన ఫైర్‌‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ ఓఎస్ మొబైల్ మార్కెట్లో నిలదొక్కుకోలేక పోయింది.

స్మార్ట్‌ఫోన్‌లకు స్వస్తి చెప్పబోతున్న ‘Firefox OS’

ఈ ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్ పై వందల మంది పనిచేసినప్పటికి ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయామని మొజిల్లా డెవలపర్ జార్జ్ రోటర్ తెలిపారు. తమ స్మార్ట్‌ఫోన్ ఓఎస్‌కు సంబంధించి 2.6 వర్షన్‌ను విడుదల చేసిన తరువాత సపోర్ట్ నిలిపివేస్తామని రోటర్ తన బ్లాగ్‌స్పాట్‌లో పేర్కొన్నారు. Firefox OS పై స్పందించే చవక ధర ఫోన్‌లను ఫోన్‌లను స్పానిష్ బ్రాండ్ గీక్స్‌ఫోన్‌తో పాటు చైనా బ్రాండ్‌లైన ZTE, TCLలు అభివృద్ది చేసాయి.

LeEco Le 1s కోసం 7 లక్షల రిజిస్ట్రేషన్స్...

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగంగా స్పందించాలంటే..?

అత్యధిక మంది నెటిజనులు వినియోగిస్తోన్న వెబ్ బ్రౌజర్‌లలో గూగుల్ క్రోమ్ ఒకటి. ఇందుకు కారణం గూగుల్ క్రోమ్ వేగవంతమైన వెబ్ బ్రౌజింగ్‌ను అందించటమే. క్రోమ్ బ్రౌజర్ వేగం వాడుతున్న కొద్ది మందగిస్తుందంటూ పలువురు యూజర్లు ఇటీవల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ అప్‌డేట్‌లను ఫాలో అవుతూ చిన్ని చిన్ని జాగ్రత్తలను పాటించటం ద్వారా క్రోమ్ బ్రౌజింగ్ వేగాన్ని రెట్టింపు స్థాయిలో ఆస్వాదించవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగంగా స్పందించాలంటే

క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌లను డిసేబుల్ చేసి ఆపై తొలగించటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు.

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగంగా స్పందించాలంటే

క్రోమ్ బ్రౌజర్‌ను ఇన్‌స్టాల్ చేసిన ప్రతిసారీ కొన్ని ప్లగిన్‌లు డిఫాల్ట్‌గా వస్తుంటాయి. కాబట్టి వాటిలో అవసరంలేని ప్లగిన్‌లను గుర్తించి వాటిని డిసేబుల్ చేయటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు.

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగంగా స్పందించాలంటే

బ్రౌజింగ్ డేటాను ఎప్పటికప్పుడు క్లీన్ చేయటం ద్వారా బ్రౌజింగ్ వేగాన్ని పెంచుకోవచ్చు.

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగంగా స్పందించాలంటే

గూగుల్ క్రోమ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం ద్వారా బ్రౌజింగ్ వేగం పెరుగుతుంది.

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగంగా స్పందించాలంటే

క్రోమ్ బ్రౌజర్‌లో అవసరం లేని ట్యాబ్‌లను క్లోజ్ చేయటం ద్వారా బ్రౌజింగ్ వేగం పెరుగుతుంది.

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగంగా స్పందించాలంటే

క్రోమ్ బ్రౌజింగ్ సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు కొన్ని ఎక్స్‌టెన్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించుకోవటం ద్వారా బ్రౌజింగ్ వేగం పెరుగుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Mozilla to end Firefox OS smartphone support. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot