గూగుల్ ఎంత పని చేసింది ?

Written By:

మనం ఇంటర్నెట్లో ఏదైనా సెర్చ్ చేయాలంటే వెంటనే మనం వెతికేది గూగుల్‌నే కదా. మరి ఆ గూగుల్‌లో మనం వెతికేది అంతా కరెక్ట్‌గా వస్తోందా..ఎందుకు రాదు అని మీరు అనుకోవచ్చు. కాని గూగుల్‌లో ఈ మధ్య కొన్ని పదాలు కొడితే మరి కొన్ని పదాలు వస్తున్నాయట..అదేంది అలా ఎందుకు చూపిస్తోంది అని అనుకుంటున్నారా..అయితే మీరు న్యూస్ చూడాల్సిందే.

Read more: 1983- 2002 మధ్యలో వచ్చిన తీపి గుర్తులు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సెర్చ్ ఇంజిన్ ముస్లింలపై వివాదాస్పద వాక్యాన్ని

ప్రతిష్టాత్మక సెర్చ్ ఇంజిన్ ముస్లింలపై వివాదాస్పద వాక్యాన్ని చూపించి నాలుక్కరుచుకుంది. క్షణాల్లో తన తప్పును సరిదిద్దుకునే చర్యలకు దిగింది.

ఎంతోమంది అలాంటి పదాల్నే ఎక్కువగా ఉపయోగించి

ఎంతోమంది అలాంటి పదాల్నే ఎక్కువగా ఉపయోగించి రాయడంవల్ల ఆ పొరపాటు జరిగిందని తెలిపింది.

హింద్ మక్కీ అనే ఓ బ్లాగర్ ఉగ్రవాదానికి సంబంధించి

ఏం జరిగిందంటే.. హింద్ మక్కీ అనే ఓ బ్లాగర్ ఉగ్రవాదానికి సంబంధించి ముస్లింలు సమర్పిస్తున్న నివేదికల కోసం 'అమెరికన్ ముస్లిమ్స్ రిపోర్ట్ టెర్రరిజం' అని సెర్చ్ చేసింది.

దానికి తగిన ఫలితాలు చూపించని గూగుల్

అయితే, దానికి తగిన ఫలితాలు చూపించని గూగుల్ ఆటోమెటిక్ కరెక్షన్ డ్రైవ్.. మీరు అడుగుతుంది 'అమెరికన్లు ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తారు' అనే వాక్యాన్నేనా అని చూపించింది. (డిడ్ యూ మీన్: అమెరికన్ ముస్లిమ్స్‌ సపోర్ట్ టెర్రరిజం).

ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రింట్ స్క్రీన్ తీసి

ఇది చూసి ఆమె అవాక్కయింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రింట్ స్క్రీన్ తీసి తన బ్లాగ్‌లో పెట్టింది.

అది గూగుల్ తప్పు కాదని

అయితే, అది గూగుల్ తప్పు కాదని, ఉగ్రవాదానికి ముస్లింలకు సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఎంతోమంది ఆ ఫార్మాట్‌లో సెర్చ్ చేయడం వల్ల ఆ పదాలను గూగుల్ చూపించిందని ఆమె చెప్పింది.

ఈ విషయం తెలిసిన గూగుల్

ఈ విషయం తెలిసిన గూగుల్ ప్రస్తుతం ఆ వాక్యం దిద్దుబాటు చర్యలకు దిగింది. 

ప్రస్తుతం ఎవరైనా అమెరికన్ ముస్లిమ్స్‌ సపోర్ట్ టెర్రరిజం అని సెర్చ్ చేస్తే

ప్రస్తుతం ఎవరైనా అమెరికన్ ముస్లిమ్స్‌ సపోర్ట్ టెర్రరిజం అని సెర్చ్ చేస్తే దానిని డిడ్ యూ మీన్: అమెరికన్ ముస్లిమ్స్ రిపోర్ట్ టెర్రరిజం అని చూపించనుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Muslims support terrorism, Google accidentally says
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot