పదేళ్ల క్రితం మిస్సయిన వ్యక్తి, గూగుల్ మ్యాప్‌కి దొరికాడు

|

గూగుల్ మ్యాప్ దారి చూపడమే కాదు.. రహస్యాలను కూడా చేధిస్తోంది. ఎప్పుడో అంతు చిక్కకుండా పోయిన వాటిని తన ఏరియల్ మ్యాప్ ద్వారా బయటి ప్రపంచానికి తీసుకొస్తోంది. పదేళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తిని గూగుల్ ఇప్పుడు తాను తీసిన ఏరియల్ ఇమేజ్ లో బంధించింది. అతను ఎక్కడ ఉన్నాడో కనిపెట్టింది. పోలీసులు చేయలేని పనిని చేసి శభాష్ అనిపించుకుంది. సాక్ష్యాలు దొరకక ఆ మనిషి ఎక్కడ ఉన్నాడో తెలియక పోలీసులు కూడా మిన్నకుండిపోతే గూగుల్ మ్యాప్ మాత్రం తన మ్యాప్ తో అతడ్ని ఎక్కడ ఉన్నాడో వెతికిపట్టుకుంది. వివరాలు కథనంలో..

Read more: టైటాన్‌‌ను మంచు మేఘాలు కప్పేశాయి

పదేళ్ళ క్రితం తప్పిపోయిన వ్యక్తి మిస్టరీ..
 

పదేళ్ళ క్రితం తప్పిపోయిన వ్యక్తి మిస్టరీ..

పదేళ్ళ క్రితం తప్పిపోయిన వ్యక్తి మిస్టరీ... గూగుల్ మ్యాప్ ఛేదించింది. గూగుల్ తీసిన ఏరియల్ ఇమేజ్ లో నీటి అడుగు భాగంలో ఉన్న కారులో ఓ వృద్ధుని శరీరం ఉన్నట్లు గుర్తించారు. ఎప్పుడో 2006 అక్టోబర్ 11న తప్పిపోయిన డేవీ లీ నైల్స్... మిచిగన్.. బైరాన్ టౌన్ షిప్ లోని.. జేక్స్ బార్ పాండ్ లో కనిపించాడు.

ఆ వృద్ధుడి జాడ కనిపెట్టడం పై లీ కుటుంబం ఇక ఆశలు

ఆ వృద్ధుడి జాడ కనిపెట్టడం పై లీ కుటుంబం ఇక ఆశలు

72 ఏళ్ళ ఆ వృద్ధుడి జాడ కనిపెట్టడం పై లీ కుటుంబం ఇక ఆశలు వదులుకున్నారు. చివరికి 2011 లో ఆయన సంస్మరణార్థం చరిత్రను పబ్లిష్ కూడా చేశారు. మిచిగన్ పాండ్ లో ఓ వ్యక్తి శరీరంతో పాటు ఉన్న కారును గూగుల్ మ్యాప్ గుర్తించడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.

లీ ఓ ఫ్రెండ్ తో కలసి హఠాత్తుగా బయటకు వెళ్ళిపోయాడని

లీ ఓ ఫ్రెండ్ తో కలసి హఠాత్తుగా బయటకు వెళ్ళిపోయాడని

లీ ఓ ఫ్రెండ్ తో కలసి హఠాత్తుగా బయటకు వెళ్ళిపోయాడని, అప్పటికే అతడు క్యాన్సర్ తో బాధపడుతుండేవాడని అతడి కుటుంబం అప్పట్లో వెల్లడించింది. అయితే ఇప్పుడు కూడా అతడు ఎలా మృతి చెంది ఉంటాడో మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు.

అకస్మాత్తుగా పాండ్ లో కారు మునిగి ఉన్నట్లుగా
 

అకస్మాత్తుగా పాండ్ లో కారు మునిగి ఉన్నట్లుగా

అతడి సంస్మరణార్థం నిర్మించిన హోమ్ బయట క్రిస్మస్ ట్రీ ని అలంకరిస్తున్న సమయంలో లిఫ్ట్ లో నుంచి చూస్తున్న హౌస్ మ్యాన్ బ్రియాన్ కు అకస్మాత్తుగా పాండ్ లో కారు మునిగి ఉన్నట్లుగా కనిపించడంతో అతడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

గూగుల్ తీసిన చిత్రాల్లో మాత్రం కారులో నైల్స్ బాడీ ఉన్నట్లు

గూగుల్ తీసిన చిత్రాల్లో మాత్రం కారులో నైల్స్ బాడీ ఉన్నట్లు

నిజంగా పాండ్ లో కారు ఉండటం చూసి తాను ఎంతో ఆశ్చర్యపోయాను అంటూ వివరించాడు. గాఢాందకారంగా ఉన్న ఆ స్థలాన్ని ఎప్పుడూ ఎవరూ పట్టించుకోలేదని, అక్కడ అతడు ఉంటాడని కూడా ఎవరూ ఊహించలేదని అన్నాడు. అయితే గూగుల్ తీసిన చిత్రాల్లో మాత్రం కారులో నైల్స్ బాడీ ఉన్నట్లు గుర్తించారు.

తొమ్మిదేళ్ళ రహస్యం బయటపడింది

తొమ్మిదేళ్ళ రహస్యం బయటపడింది

తొమ్మిదేళ్ళ రహస్యం బయటపడింది. అయితే అసలు ఆ సంఘటన ఎలా జరిగింది? వివరాలు మాత్రం తెలియలేదు. హౌస్ మ్యాన్ చెప్పిన వివరాలను బట్టి కెంట్ కౌంటీ షెరీఫ్స్ డిపార్ట్ర్ట్ మెంట్ సిబ్బంది పాండ్ లోని కారును గుర్తించింది.

డైవ్ టీమ్ నీటిలో కారు ఉన్నట్లుగా

డైవ్ టీమ్ నీటిలో కారు ఉన్నట్లుగా

డైవ్ టీమ్ నీటిలో కారు ఉన్నట్లుగా నిర్ధారించారు. క్రేన్స్ సహాయంతో కారును బయటకు తీశారు. నైల్స్ చివరిసారి కనిపించిన ప్రాంతానికి అరమైలు దూరం లో ఆ పాండ్ ఉందని కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలను బట్టి చెప్తున్నారు. కారులోని డ్రైవర్ సీటులో నైల్స్ స్కెలిటెన్ ఉండగా... మట్టితో పూడిపోయిన కారును బయటకు తీశారు.

పదేళ్ళ అనుమానాలకు తెరపడినందుకు

పదేళ్ళ అనుమానాలకు తెరపడినందుకు

అక్కడకు వచ్చిన బంధువులు నైల్స్ శరీర అవశేషాలను చూసి దుఃఖ సాగరంలో మునిగిపోయారు. అయితే ఎట్టకేలకు పదేళ్ళ అనుమానాలకు తెరపడినందుకు ఊపిరి పీల్చుకున్నారు. ఇక శోధనకు ముగింపు దొరికినట్లేనని.. నైల్స్ అల్లుడు స్కాట్ హాత్ వే అన్నారు. ఇన్నాళ్ళు నైల్స్ జాడ తెలియకుండా దేవుడు ఎందుకు ఉంచాడో తెలియదు కానీ... చివరకు ఇంటికి చేర్చడం సంతోషంగా ఉందన్నారు.

అకస్మాత్తుగా పాండ్ లో కారు మునిగి ఉన్నట్లుగా

అకస్మాత్తుగా పాండ్ లో కారు మునిగి ఉన్నట్లుగా

అతడి సంస్మరణార్థం నిర్మించిన హోమ్ బయట క్రిస్మస్ ట్రీ ని అలంకరిస్తున్న సమయంలో లిఫ్ట్ లో నుంచి చూస్తున్న హౌస్ మ్యాన్ బ్రియాన్ కు అకస్మాత్తుగా పాండ్ లో కారు మునిగి ఉన్నట్లుగా కనిపించడంతో అతడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

నైల్స్ మరణానికి సంబంధించిన మిగిలిన వివరాలను

నైల్స్ మరణానికి సంబంధించిన మిగిలిన వివరాలను

అయితే అధికారులు నైల్స్ మరణానికి సంబంధించిన మిగిలిన వివరాలను సేకరిస్తున్నారు. నైల్స్ దంతాల రికార్డును బట్టి పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉందని ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అతడి జేబులోని వాలెట్ ను బట్టి అది నైల్స్ శరీరమేనని నమ్ముతున్నారు.

ఇది నాటకం అయి ఉండక పోవచ్చని..

ఇది నాటకం అయి ఉండక పోవచ్చని..

ఇది నాటకం అయి ఉండక పోవచ్చని అంటున్నారు. అయితే కచ్ఛితంగా అసలేం జరిగి ఉంటుంది అన్నది మాత్రం తెలుసుకోవాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Here Write Mystery of man missing for a decade is solved by Google Maps: Aerial image captures outline of submerged car that had the body of an elderly man trapped inside

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X