హెరిటేజ్ బేబీ నీకేం తెలియదంటున్న నెటిజన్లు

Written By:

తెలుగుదేశం యువనేత నారా లోకేష్ బాబు చాలా రోజులకి మళ్లీ ట్విట్టర్ లోకి అడుగుపెట్టారు..ఈ మధ్య ట్విట్టర్ జోలికి రాని ఈ యువనేత ఇప్పుడు ట్వీట్లతో తెలంగాణాలోని అధికార పార్టీ టీఆర్‌ఎస్ ను ఇరుకున పెడదామని తానే ఇరుకున పడ్డాడు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సంగతి అటుంచితే ఇప్పుడు యువ టీడీపీ నేత తాను తవ్వుకున్న గోతిలో తానే పడిపోయారు.అది ఎలాగూ మీరే చూడండి.

Readmore: ఐ ఫోన్ 7:కొత్త ఫీచర్స్‌‌ వద్దంటూ యుద్ధం మొదలైంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల సంధర్భంగా

గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల సంధర్భంగా లోకేష్ టీఆర్ఎస్ వి రెండు నాల్కలు ..ఒకటి ఆంధ్రోళ్లని తిడుతుంది .. ఇంకోటి ఆంధ్రా వాళ్లను ఓట్లు అడుగుతుంది" అని ట్విట్టర్‌లో ట్వీటేశాడు.

అయితే ఆంధ్రాలో అమరావతి అంటూ రైతులను ఇబ్బందులు పెట్టడం

అయితే ఆంధ్రాలో అమరావతి అంటూ రైతులను ఇబ్బందులు పెట్టడం .. అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటీ నెరవేర్చకపోవడం .. పాలనను పూర్తిగా అస్తవ్యస్తం చేసిన నేపథ్యంలో లోకేష్ తాజా ట్వీట్ల మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ప్రాంతాలకు అతీతంగా లోకేష్ ను ప్రశ్నలు, విమర్శలతో

ప్రాంతాలకు అతీతంగా లోకేష్ ను ప్రశ్నలు, విమర్శలతో నెటిజన్లు ముంచెత్తారు. నువ్వు హెరిటేజ్ బేబి .. నీకేం తెలీదు అని ఓ నెటిజన్ అంటే తెలంగాణ వచ్చింది మా లేఖ మూలంగానే అని ఇక్కడ చెబుతారు .. జగన్, కాంగ్రెస్ కలిపి రాష్ట్రం విభజించారు అని అక్కడ ఏడుస్తారు అని మరో నెటిజన్ విమర్శించాడు.

జీహెచ్ఎంసీలో కమ్మ ఓట్లు తప్ప మీకు ఓట్లేసేటోళ్లు లేరని

జీహెచ్ఎంసీలో కమ్మ ఓట్లు తప్ప మీకు ఓట్లేసేటోళ్లు లేరని ఒకరంటే .. ఆంధ్రాలో ఇంటికో ఉద్యోగం ఏమయింది? బెల్టు దుకాణాల తొలగింపు ఏం చేశారు? రైతులు, డ్వాక్రా మహిళల లోన్ల సంగతి ఏంటి? ముందు మీరు ఆ వాగ్ధానాలు నెరవేర్చి ఇతరులను అడగండి అని సూచించారు.

ఎందుకు సార్ మీకు పాలిటిక్స్, తిన్నారా,పడుకున్నారా..

ఎందుకు సార్ మీకు పాలిటిక్స్, తిన్నారా,పడుకున్నారా,తెల్లరిందా......ఆంధ్రల మీ అయ్య ఎన్ని వాగ్దానాలు చేసాడు, ఎన్ని నెరవేర్చాడు అని ఓ నెటిజన్ ప్రశ్నిస్తే .. అసలు రాష్ట్ర విభజన మీద మీ పార్టీ స్టాండ్ ఏంటి అని ఇంకొకరు ..

హైదరాబాద్ లో ఆంధ్రులం ఎంతో సంతోషంగా ఉన్నాం..

హైదరాబాద్ లో ఆంధ్రులం ఎంతో సంతోషంగా ఉన్నాం ..సెటిలర్లు అంటూ మీరు మీ పార్టీ ఓట్ల కోసం మమ్మల్నివాడుకోవద్దని ఇంకో నెటిజన్ అభిప్రాయపడ్డాడు ..మొత్తానికి ఈ ట్వీట్ లోకేష్ తీరని అవమానం అని చెప్పక తప్పదు.

రెండు కళ్ళ సిద్ధాంతాన్ని కనిపెట్టిందే మీ నాన్న..

'రెండు కళ్ళ సిద్ధాంతాన్ని కనిపెట్టిందే మీ నాన్న .. ఆ ధోరణితో తెలంగాణలో 1000 మంది యువకులు బలయ్యారని' ఒకరు .. 'ఇంటికో ఉద్యోగం సంగతి ఏమైందని' ఇంకొకరు .. 'బెల్టు షాపులను ఎత్తేస్తారా .. లేదా ..? ముందు ఆంధ్రాలో ఇచ్చిన హామీల సంగతి చూడండ'ని మరొకరు ట్వీట్స్ చేశారు.

అయితే అన్నింటికంటే ముఖ్యంగా ..

అయితే అన్నింటికంటే ముఖ్యంగా .. 'తెలంగాణలో ఉన్న ఆంధ్రావాళ్ళం ప్రశాంతంగానే ఉన్నాం. మీ ఓట్ల కోసం మాపై ట్వీట్స్ చేయవద్దని 'లోకేష్ కు హితవు పలికారు.

టీడీపీ యువనేత రానున్న కాలంలో

మరి టీడీపీ యువనేత రానున్న కాలంలో మరెన్ని కష్టాలను ఎదుర్కుంటారో చూడాలి. 

టెక్నాలజీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ పొందండి

ఇక్కడ క్లిక్ చేసి టెక్నాలజీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ పొందండి. https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Nara lokesh fires on trs government in twitter and netizens counter
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot