ఏపీలో 4 మొబైల్ తయారీ ప్లాంట్‌లకు మోదీ శంకుస్థాపన
అక్టోబర్ 22వ తేదీన అమరావతిలో జరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేస్తోన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ కార్యక్రమంలో అనంతరం చిత్తూరు జిల్లాలోని రేణిగుంటలో నాలుగు మొబైల్ ఫోన్ తయారీ ప్లాంట్‌లకు శంకుస్థాపన చేయనున్నారు.
Read More : సామ్‌సంగ్ ఫోన్‌ల పై 20 బెస్ట్ ఆఫర్లు
సెల్‌కాన్, మైక్రోమాక్స్, కార్బన్, లావా, మరో నాలుగు విడిభాగాల తయారీ కంపెనీలకు రేణిగుంట విమానాశ్రాయానికి ఎదురుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూములను కేటాయించిన విషయం తెలిసిందే. ఈ భూముల్లో ప్లాంట్ లను నెలకొల్పి శరవేగంగా తన ఉత్పాదనలను ప్రారంభించేందుకు ఆయా కంపెనీలు ఎదురుచూస్తున్నాయి.
అమరావతి శంకుస్థాపన కార్యక్రమం పూర్తిఅయిన అనంతరం మోదీ తిరుపతి బయలుదేరి వెళతారు. ఈ సందర్భంగా రేణుగుంటలోని నాలుగు మొబైల్ ఫోన్ తయారీ ప్లాంట్ లకు శంకుస్థాపన చేస్తారు. దాదాపు 2000 కోట్ల పెట్టుబడులతో 65 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పతున్న ఈ ప్లాంట్ ల ద్వారా దాదాపు 10,000 మందికి ఉపాధి లభించే అవకాశముంది.
Read More : 3జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈతో ‘Intex Cloud Swift'
ఇప్పటికే చిత్తూరులోని శ్రీసిటీ ఎస్ఈజడ్‌లో తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ సంస్థ సెల్‌ఫోన్‌ల తయారీ ప్లాంట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్‌లకు ఈ సంస్థ కాంట్రాక్ పద్ధతిలో స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేసి ఇస్తోంది. షియోమి, ఆసుస్, వన్ ప్లస్, జియోని కంపెనీలు ఇప్పటికే ఫాక్స్‌కాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి.

డిజిటల్ ఇండియా ..10 కీలక ప్రయోజనాలు
బంగారు ఆభరణాలను బ్యాంక్ లాకర్ లలో భద్రపరుచుకుంటున్నట్లుగానే పాన్ కార్డ్, పాస్ పోర్ట్, ఆధార్ కార్డ్ వంటి ముఖ్యమైన పత్రాలను కేంద్ర ప్రభుత్వం అందించే డిజిటల్ లాకర్ లో సౌకర్యవంతంగా భద్రపరుచుకోవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారంగా ఈ వ్యవస్థను డిజైన్ చేసారు.

డిజిటల్ ఇండియా .. కీలక ప్రయోజనాలు
MyGov.in, ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ప్రభుత్వ వ్యవహారలన్నీ సమన్వయరీతిలో పౌరులకు అందుబాటులోకి తీసుకువచ్చి సుపరిపాలనకు దోహదపడుతుంది.

డిజిటల్ ఇండియా ..కీలక ప్రయోజనాలు
స్వచ్చ్ భారత్ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకువెళ్లేందుకు ఈ యాప్ దోహదపడుతుంది.

డిజిటల్ ఇండియా ..కీలక ప్రయోజనాలు
ఈ - సంతకం ద్వారా పౌరులు తమ ఆధార్ కార్డ్‌లను ఉపయోగించుకుని డాక్యుమెంట్‌ల పై డిజిటల్ సంతకాలను చేయవచ్చు. తద్వారా డబ్బు, సమయం ఆదా అవటంతో పాటు మీ సంతకానికి చట్టబద్ధంగా గుర్తింపు ఇంకా గోప్యత లభిస్తుంది.

డిజిటల్ ఇండియా ..కీలక ప్రయోజనాలు
ఈ - ఆస్పత్రి పథకం ద్వారా పారదర్శకమైన ఆరోగ్య సేవలను దేశ పౌరులు పొందవచ్చు. ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్, రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, రక్తం అందుబాటు వంటి ముఖ్యమైన సేవలను ఈ - ఆస్పత్రి పథకం ద్వారా సామాన్య, మధ్యతరగతి ప్రజలు పొందవచ్చు.

డిజిటల్ ఇండియా ..కీలక ప్రయోజనాలు
జాతీయ ఉపకారవేతన పోర్టల్ చేకూరే ప్రయోజనాలు:
ఈ పోర్టల్ ద్వారా ఉపకారవేతనాలకు అర్హులైన విద్యార్థులు కాలపరిమితిలోపు తమ అప్లికేషన్ లను పంపించటంతో పాటు తమ ఉపకార వేతనాల బదిలీ తీరును ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

డిజిటల్ ఇండియా ..కీలక ప్రయోజనాలు
ప్రభుత్వ సర్వీసులకు సంబంధించి అన్ని రికార్డులను డిజిటలైజ్ చేసే కార్యక్రమమే డిజిటైజ్ ఇండియా ప్లాట్‌ఫామ్

డిజిటల్ ఇండియా ..కీలక ప్రయోజనాలు
భారత్ నెట్ ప్రోగ్రామ్ దేశంలోని 2,50,000 గ్రామ పంచాయితీలకు హై స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించే లక్ష్యంతో భారత్ నెట్ ప్రోగ్రామ్ పనిచేస్తుంది.

డిజిటల్ ఇండియా ..కీలక ప్రయోజనాలు
బీఎస్ఎన్ఎల్ తరువాతి జనరేషన్ నెట్‌వర్క్‌ను ప్రజలకు చేరువచేయటం.


Click it and Unblock the Notifications








