పింగ్ పాంగ్‌తో అంతరిక్షంలో 300 రోజులు: గేమ్ ఏంటంటే..

By Hazarath
|

ఏకధాటిగా 300 రోజులు భూప్రపంచాన్ని వదిలి ఆంతరిక్షంలోనే గడిపేసిన వ్యోమగామిగా స్కాట్ కెల్లీ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. అయితే అంతరిక్షంలో 300 రోజులు గడపడం అంటే మాములు విషయం కాదు. ఎంతో ఓపిక ఉండాలి. అది ఉంటేనే అక్కడ సాధ్యమవుతుంది. ఇష్టమైనవి తినలేము. అలాగే తాగలేము. ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి వాతావరణంలో దాదాపు 300 రోజులు గడిపారంటే అది నిజంగా చాలా గ్రేట్ వార్తే మరి. మరి 300 రోజులుఅంతరిక్షంలో స్కాట్ ఏం చేశారు..దీనిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం పదండి.

 

Read More: తమ శక్తులతో సైన్స్‌కు చుక్కలు చూపిస్తున్నారు

ఖాళీ సమయంలో నీటి బుడగతో పింగ్ పాంగ్

ఖాళీ సమయంలో నీటి బుడగతో పింగ్ పాంగ్

అంతరిక్షంలో అమెరికా వ్యోమగామి స్కాట్ కెల్లీ ఖాళీ సమయంలో నీటి బుడగతో పింగ్ పాంగ్ ఆడాడు.. అక్కడ నీటి బుడగతో పింగ్ పాంగ్ ఆడిన వీడియోను ఆయన విడుదల చేశాడు. ఇలా ఆడటం సున్నా గ్రావిటీలో మాత్రమే సాధ్యమవుతుంది.

వాటర్ బాటిల్‌లోంచి నీటిని బయటకు పంపడంతోనే

వాటర్ బాటిల్‌లోంచి నీటిని బయటకు పంపడంతోనే

వాటర్ బాటిల్‌లోంచి నీటిని బయటకు పంపడంతోనే వెంటనే ఒక బాల్ ఆకారంలో మారింది. తన దగ్గరున్న రెండు బ్యాట్ల సాయంతో ఆ బంతి ఆకారంలో ఉన్న నీటి బుడగతో పింగ్ పాంగ్ ఆడాడు.

ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరిని
 

ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరిని

ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. రెడిట్‌లో శనివారం భూమిమీద నుంచి ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు.

అత్యధిక రోజులు గడిపిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పిన కెల్లీ

అత్యధిక రోజులు గడిపిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పిన కెల్లీ

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) లో అత్యధిక రోజులు గడిపిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పిన కెల్లీ ఒకే విడతలో 300 రోజులు గడిపి రికార్డు బద్దలు కొట్టాడు.

అరుదైన ప్రయోగం కోసం

అరుదైన ప్రయోగం కోసం

స్కాట్ కెల్లీని అరుదైన పరిశోధన కోసం ఐఎస్ఎస్ పంపారు. అంతరిక్షంలో సుదీర్ఘ కాలం పనిచేస్తే.. మానవ శరీరం, మెదడుపై ఎలాంటి ప్రభావం పడుతుందో పరిశోధించే మిషన్ లో భాగంగా ఆయన ఐఎస్ఎస్ వెళ్ళాడు.

స్కాట్ కెల్లీ తో పాటు.. అతని కవల సోదరుడు మార్క్ కెల్లీ

స్కాట్ కెల్లీ తో పాటు.. అతని కవల సోదరుడు మార్క్ కెల్లీ

ఈ ప్రయోగంలో స్కాట్ కెల్లీ తో పాటు.. అతని కవల సోదరుడు మార్క్ కెల్లీ కూడా పనిచేస్తున్నాడు. స్కాట్ కెల్లీ అంతరిక్షంలో అత్యధిక రోజులు గడపనుండగా.. అతని కవల సోదరుడిపై భూమి మీద నాసా కేంద్రంలో పరిశోధనలు నిర్వహిస్తున్నారు.

అంతరిక్షం, భూమి మీద ఉన్న వ్యక్తులపై

అంతరిక్షం, భూమి మీద ఉన్న వ్యక్తులపై

అంతరిక్షం, భూమి మీద ఉన్న వ్యక్తులపై ఎలాంటి ప్రతికూల ప్రయోగాలు ఉంటాయో పరిశీలిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే.. వ్యోమగాములకు మరింత రక్షణ ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుంది.

ఎక్కువ కాలం అంతరిక్షంలో గడపటం వల్ల

ఎక్కువ కాలం అంతరిక్షంలో గడపటం వల్ల

ఎక్కువ కాలం అంతరిక్షంలో గడపటం వల్ల శరీరం, మెదడు పై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకోవచ్చని నాసా తెలిపింది. అంతేకాదు.. మార్స్ పై నాసా చేస్తున్న ప్రయోగాలకు ఇది ఎంతో ఉపయోగ పడుతుందని అభిప్రాయపడింది.

స్పేస్ స్టేషన్ లో ఉండే భార రహిత స్థితి

స్పేస్ స్టేషన్ లో ఉండే భార రహిత స్థితి

స్పేస్ స్టేషన్ లో ఉండే భార రహిత స్థితి, ఒంటరి తనం, రేడియేషన్, ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడపాల్సి రావడం వంటి ప్రతికూల పరిస్థితులను శరీరం ఎలా తట్టుకుంటుందో అధ్యయనం చేస్తున్నట్లు వివరించింది. స్కాట్ మార్చి 3న భూమిపైకి తిరిగి రానున్నారు.

ఆటకు సంబంధించిన వీడియో ఇదే

ఆటకు సంబంధించిన వీడియో ఇదే 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

 

 

Best Mobiles in India

English summary
Here Write NASA Astronaut Plays Ping Pong With Ball of Water in Space

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X