నాసాకే నడకలు నేర్పిన గిటార్ బాయ్

Written By:

అతనో గిటార్ బాయ్..ఎప్పుడూ చేతిలో గిటార్ ఉంటుంది. ఆ గిటార్ అంటేనే అతనికి ప్రాణం. కాని అదొక్కటే కాదు ప్రయోగాలు అన్నా ఎంతో ఇష్టం..ఇప్పుడు నాసా దృష్టిలో పడ్డారు. నాసా కన్నా ముందే మార్స్ పై నీటిని కనుగొన్నారు.. ఈ ఆధిరంతోనే ఇప్పుడు నాసా మార్స్ పై నీటి జాడలు ఉన్నాయని చెబుతోంది. ఆ దిశగా పరిశోధనలు చేస్తోంది. ఆ పరిశోధన బృందంలో మనోడు కీలక సభ్యుడు అయ్యాడు. అంతరిక్ష పరిశోధనలు ఇప్పుడు అతని పేరు మారుమోగిపోతోంది. ఈ గిటార్ బాయ్ పై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: అంగారకుడిపై ఉప్పు నీటి ప్రవాహం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అంతరిక్ష పరిశోధన రంగంలో ..

అంతరిక్ష పరిశోధన రంగంలో ..

చేతిలో గిటారు వాయించుకుంటూ కనిపించే లుజేంద్ర ఓజాను చూస్తే పక్కవీధి పోకిరి కుర్రాడేమోనన్న భావన కలుగుతుంది. కానీ అమెరికాలోని నేపాల్ జాతీయుడైన ఆ కుర్రాడి ఘనత అంతరిక్ష పరిశోధన రంగంలో మార్మోగుతున్నది.

అంగారక గ్రహంపై ద్రవరూపంలో నీటి నిల్వలు

అంగారక గ్రహంపై ద్రవరూపంలో నీటి నిల్వలు

చిన్నతనంలోనే పాఠశాలలో చదివేటప్పుడే టైమ్ మిషన్ కనుగొనాలని కలలు కనే అతిసాధారణమైన కుర్రాడు.. అంగారక గ్రహంపై ద్రవరూపంలో నీటి నిల్వలున్నాయనే విషయాన్ని 2011లోనే కనుగొన్నాడు.

నాసా ఆ దిశగా పరిశోధనలు

నాసా ఆ దిశగా పరిశోధనలు

21 ఏండ్ల వయసులో అండర్ గ్రాడ్యుయేట్‌గా ఉన్నప్పుడే ఓజా అంగారకుడిపై నీటి జాడను గుర్తించడంతో నాసా ఆ దిశగా పరిశోధనలు చేపట్టడానికి ఊతమిచ్చింది.

జన్మతః నేపాలీ కావడం మూలానే ఏమో పర్వతాలంటే చెప్పలేనంత ఇష్టం

జన్మతః నేపాలీ కావడం మూలానే ఏమో పర్వతాలంటే చెప్పలేనంత ఇష్టం

సైన్స్, ఫిక్షన్, విశ్వగమనంలో టైంతోపాటు ప్రయాణించాలనే బలమైన కోరిక నాసా గుర్తించేలా చేసింది. జన్మతః నేపాలీ కావడం మూలానే ఏమో పర్వతాలంటే చెప్పలేనంత ఇష్టం ఏర్పడింది.

నాసా శాస్త్రవేత్తల బృందంలో ఓజా తొలి వరుసలో..

నాసా శాస్త్రవేత్తల బృందంలో ఓజా తొలి వరుసలో..

ఆ ఇష్టం ప్రస్తుతం అరిజోనా యూనివర్సిటీలో భౌతిక, భూగర్భశాస్త్రలపై పరిశోధనపై దృష్టిపెట్టేలా చేసింది. మార్స్‌పై నీటి నిల్వలు ఉన్నాయని గుర్తించిన నాసా శాస్త్రవేత్తల బృందంలో ఓజా తొలి వరుసలో ఉన్నాడు. అంగారకుడిపై కనుగొన్న మిస్టరీని వెల్లడించడానికి నాసా నిర్వహించిన మీడియా సమావేశంలో ఓజా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

పరిశోధన బృందంలో ప్రస్తుతం సభ్యుడిగా ..

పరిశోధన బృందంలో ప్రస్తుతం సభ్యుడిగా ..

అంగారకుడిపై ప్రకంపనలు(మార్స్‌క్వేక్స్), అక్కడి వాతావరణంలోని అంతర్గత అంశాలపై నాసా చేపట్టిన పరిశోధన బృందంలో ప్రస్తుతం సభ్యుడిగా సేవలందిస్తున్నారు.

భూకంపాలపై అధ్యయనం

భూకంపాలపై అధ్యయనం

ఈ పరిశోధనలో భాగంగా హిమాలయాల్లో సంభవించే భూకంపాలపై అధ్యయనం చేస్తూ నేపాల్‌లో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నానని సీనెట్ అనే వెబ్‌సైట్‌కు ఓజా తెలిపారు.

అన్ని రంగాల్లో నైపుణ్యాన్ని సంపాదించడమే..

అన్ని రంగాల్లో నైపుణ్యాన్ని సంపాదించడమే..

సంగీతమంటే అమితంగా ఇష్టపడే ఓజా.. ఖగోళ శాస్త్రవేత్త కావడమో.. లేదా ఖగోళ జీవశాస్త్రవేత్త కావడమో తన లక్ష్యం కాదని, అన్ని రంగాల్లో నైపుణ్యాన్ని సంపాదించడమే ఇష్టమని తెలిపాడు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write NASA confirmed existence of water on Mars with the help of Lujendra Ojha, a former heavy-metal guitarist.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot