అంగారకుడిపై ఉప్పు నీటి ప్రవాహం

Posted By:

అంగారకుడిపై జీవం మనుగడపై ఆశలు రేకెత్తుతున్నాయి. అక్కడ జీవం ఉండే అవకాశాలు ఉండి ఉండొచ్చని చాలా కాలంగా భావిస్తూ వస్తున్న శాస్త్రవేత్తలకు చక్కని ఆధారం లభించింది. ఆ గ్రహంపై నీటి జాడలు ఉన్నట్టు తాము కొనగొన్నామని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించడంతో శాస్త్రవేత్తల్లో ఉత్సాహం రెట్టింపయింది. అంగారకుడిపై గుర్తించిన జల ప్రవాహం ఆధారాలను బట్టి చూస్తూ అక్కడ జీవం ఉండొచ్చని నాసా తెలిపింది. గ్రహం ఉపరితలంపై వేసవిలో ఉప్పునీటి ప్రవాహాలు ప్రవహించి ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Read more:అంగారక గ్రహం పై ఆడ మనిషి..?

అక్కడ కనిపిస్తున్నవివిధ ఆకృతులు ఉప్పునీటి చారికలుగా భావిస్తున్నట్టు పేర్కొంటున్నారు. అంగారకుడిపై జలం ఉందనే వాదనకు శాస్త్రవేత్తల వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. గతంలో తాము ప్రకటించినట్టు అంగారక గ్రహం పూర్తిగా ఎండిపోయిన గ్రహం కాదని నాసాకు చెందిన జిమ్ గ్రీన్ మీడియాకు తెలిపారు. నాసా పంపిన రోవర్లు అంగారకుడిపై ఉన్న గాలిలో తేమను గుర్తించాయని, మట్టిలో కూడా తడి ఉన్నట్టు గుర్తించినట్టు ఆయన వివరించారు.

Read more: ప్లూటోపై పర్వతాలు,పొగమంచు మైదానాలు

మరోవైపు తాము అంగారకుడిపై ద్రవ రూపంలో ఉన్నజలాన్ని కనుగొనలేదని, ఆర్ద్రీకరణం చెందిన లవణాన్ని మాత్రమే గుర్తించామని జార్జియా ఇనిస్టి‌ట్యూట్ ఆప్ టెక్నాలజీకి చెందిన విద్యార్థి లూజేంద్ర ఓఝా తెలిపారు. ఏది ఏమైనా అంగారకుడిపై నీటి ఆనవాళ్లు త్వరలో జీవం ఉనికిపై గుట్టు విప్పనున్నాయి. మరింత సమాచారం కింద స్లైడర్ లో చూడండి.

Read more: ఆ గ్రహంపై మంచుకొండలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అంగారకుడిపై ద్రవరూపంలో నీటి నిల్వలు

అంగారక గ్రహం (మార్స్)పై జరిపిన పరిశోధనల్లో భాగంగా ఆ గ్రహం ఉపరితలంపై కొనుగొన్న మిస్టరీని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా బహిర్గతం చేసింది. అంగారకుడిపై ద్రవరూపంలో నీటి నిల్వలు ఉన్నట్లు గుర్తించామని నాసా పేర్కొన్నది. అవి ఉప్పు నీటి నిల్వలు లాగా ఉన్నాయని తెలిపింది.

నాసా ప్లానెటరీ సైన్స్ డైరెక్టర్ జిమ్ గ్రీన్

అంగారకుడి ఉపరితలం పొడిగా ఉంటుందని గతంలో ఊహించామని, అయితే అందుకు విరుద్ధంగా ద్రవరూపంలో ఉన్న నీటి నిల్వలను కనుగొన్నామని సోమవారం మీడియా సమావేశంలో నాసా ప్లానెటరీ సైన్స్ డైరెక్టర్ జిమ్ గ్రీన్ తెలిపారు.మార్స్ ఎక్స్ ప్లోరేషన్ లో భాగంగా ఈ విషయాన్ని తెలుసుకున్నామని లీడ్ సైంటిస్ట్ మేయర్ ప్రకటించారు.

గతంలో అంగారక గ్రహంపై స్వేచ్ఛగా నీటి ప్రవాహం

గతంలో అంగారక గ్రహంపై స్వేచ్ఛగా నీటి ప్రవాహం కొనసాగిందడానికి లోయలు, కనుమలే అందుకు సాక్ష్యమని అభిప్రాయాన్ని శాస్త్రవేత్తలు వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. మూడు బిలియన్ల ఏండ్ల క్రితం వాతవరణ పరిస్థుతుల్లో భారీ మార్పులు సంభవించి ఉంటాయని గ్రీన్ వివరించారు.

అంగారకుడి ఉపరితలంపై నుంచి జారిన నీటీ ప్రవాహం

అంగారకుడి ఉపరితలంపై గాలిలో తేమ, నేల తడిగా ఉన్నట్లు రోవర్లు గుర్తించాయని పేర్కొన్నారు. ఏటవాలుగా ఉన్న అంగారకుడి ఉపరితలంపై నుంచి జారిన నీటీ ప్రవాహం సంబంధించిన నల్లటి చారలను నాలుగేండ్ల క్రితమే గమనించామన్నారు. ఈ నీరు ప్రవహిస్తోందని ఆయన తెలిపారు.

నీటి ప్రవాహం కారణంగానే ఇలాంటి ఎత్తుపల్లాలు

వసంత కాలంలో ఇలాంటి చారలు ఏర్పడి.. వేసవిలో పెరుగుతాయని, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే వర్షకాలంలో అవి తుడిచిపెట్టుకుపోతాయనే శాస్త్రవేత్తల వాదనకు తమవద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. తాము చేసిన పరిశోధనలతో నీటి ప్రవాహం కారణంగానే ఇలాంటి ఎత్తుపల్లాలు ఏర్పడ్డాయని బలంగా నమ్ముతున్నామన్నారు. ఇక్కడ ఉన్న నీరు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నట్లు తేలిందన్నారు.

google డూడ్‌ల్‌

అంగారక గ్రహంపై నీటి నిల్వలు ఉన్నాయని నాసా వెల్లడించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో.. గూగుల్ తన డూడ్‌ల్‌ను ఇవాళ్టికి మార్చింది. google డూడ్‌ల్‌లోని మూడో అక్షరం ‘O'లో అంగారక గ్రహన్ని తయారు చేశారు.

గూగుల్ లోగోలో ఆకాశంలో నక్షత్రాలు

అంతే కాకుండా గ్రహంపై నీటి నిల్వలు ఉన్నట్లు.. ఆ నీటిని గ్లాసులో తీసుకుని ఓ బాలుడు త్రాగుతున్నట్లు చిత్రీకరించారు. గూగుల్ లోగోలో ఆకాశంలో నక్షత్రాలు ఉన్నట్లు చిత్రీకరించడం జరిగింది. ప్రపంచంలో ఏదైనా ప్రత్యేకత జరగడం, కొత్త సన్నివేశాలు చోటు చేసుకున్నప్పుడు గూగుల్ ఇలా వినూత్నంగా స్పందించడం ప్రత్యేకం.

గతంలోనే భారత్ ప్రకటన

నాసా విడుదల చేసిన ఛాయా చిత్రాల ప్రకారం అంగారక గ్రహంలోని నీరు చిక్కగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మార్స్ పై నీటి జాడలను కనుగొన్నామని గతంలోనే భారత్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

స్పష్టమైన సాక్ష్యాలు చూపలేకపోయింది

అయితే ఇండియా వద్ద అత్యాధునిక సాంకేతికత అందుబాటులో లేకపోవడంతో దీనికి సంబంధించిన స్పష్టమైన సాక్ష్యాలు చూపలేకపోయింది. ఇప్పుడు అదే విషయాన్ని నాసా సాక్ష్యాలతో చూపించడం గమనార్హం.

జీవం ఉండేందుకు అవకాశాలు

ఏది ఏమైనా అంగారక గ్రహంపై పలు చోట్ల నీరు ఉన్న కారణంగా జీవం ఉండేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు భావిస్తున్నామని నాసా చెబుతోంది

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు.

https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here write Google Admires Evidence of Water on Mars With Doodle
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot