మానవులు కూడా అంతరిక్షంలో చక్కర్లు

Written By:

అంతరిక్షంలోకి మానవులను పంపడానికి నాసా ఎప్పటినుంచో పరిశోధనలు చేస్తున్న విషయం విదితమే. అయితే దీనికి సంబంధించి ఆకాశంలోకి ప్రయాణం చేయడానికి నాసా సరికొత్త వాహనాలను సిద్ధం చేస్తోంది. నాసాకు అనుబంధంగా ఉన్న ఈలోన్ మస్క్ రాకెట్ కంపెనీ స్పేస్ ఎక్స్ ఈ అంతరిక్ష వాహనాలు చేసే పనిలో పడ్డాయి. అచ్చం కారును పోలిన వాహనాలు ఇప్పుడు ఆకాశంలో చక్కర్లు కొట్టడానికి రెడీ అయ్యాయి. ఆ వాహనాల్లో వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లి రావచ్చట..అలాగే ఏదేనా ప్రమాదం జరిగితే వెంటనే బయటపడవచ్చట. ఆ వాహనం ఎలా ఉంటుందో చూడాలని ఉందా అయితే దానిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం పదండి.

Read more: కళ్లుమూసి తెరిచేలోపు దాడి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మానవులు అంతరిక్షంలోకి వెళ్లడానికి స్పేస్ క్రాఫ్ట్ ను

మానవులు అంతరిక్షంలోకి వెళ్లడానికి స్పేస్ క్రాఫ్ట్ ను

మానవులు అంతరిక్షంలోకి వెళ్లడానికి స్పేస్ క్రాఫ్ట్ ను తొలిసారిగా స్పేస్ ఎక్స్ కంపెనీ రూపొందించింది. దీనికి సంబంధించిన వాహనం డిజైన్ ఇదే. ఇది అత్యాదునిక లుక్ తో స్పోర్ట్స్ కారును పోలి ఉంటుంది. దానిలో ఉన్న అన్ని రకాల సదుపాయాలు ఇందులో ఉన్నాయి.

ఈ వాహనానికి నాలుగు పక్కల కిటీకీలు

ఈ వాహనానికి నాలుగు పక్కల కిటీకీలు

ఈ వాహనానికి నాలుగు పక్కల కిటీకీలు ఉంటాయి. ఇందులో ఒకేసారి ఏడుమంది వ్యోమగాములు ప్రయాణం చేయవచ్చు.

లోపల సీట్లు మొత్తం కార్బన్ పైబర్ తో

లోపల సీట్లు మొత్తం కార్బన్ పైబర్ తో

లోపల సీట్లు మొత్తం కార్బన్ పైబర్ తో చేశారు. అలాగే అత్యంత గట్టిది మెత్తనిది అయిన క్లాత్ అయిన ఆల్కాంత్రా గుడ్డతో తయారుచేశారు. ఇదే రకం గుడ్డను స్పోర్ట్స్ కారులో ఇప్పుడు వాడుతున్నారు.

ఇందులో ప్రయాణం చాలా సుఖవంతంగా సరదాగా ఉంటుందని

ఇందులో ప్రయాణం చాలా సుఖవంతంగా సరదాగా ఉంటుందని

ఇందులో ప్రయాణం చాలా సుఖవంతంగా సరదాగా ఉంటుందని స్పేస్ ఎక్స్ తన వెబ్ సైట్ లో రాసింది. దీని డిజైన్ అంతా చాలా ఎంజాయ్ బుల్ గా ఉంటుందని తెలిపింది.

ఇది చాలా సౌకర్యవంతమైన సీటు

ఇది చాలా సౌకర్యవంతమైన సీటు

ఇది చాలా సౌకర్యవంతమైన సీటు. అలాగే ఇంతటి ముందుఉన్న వాటికన్నా చాలా చాలా కంపర్ట్ బుల్ గా ఉంటుంది.

సకల సరంజామా మిమ్మల్ని భద్రంగా ఉంచేందుకు

సకల సరంజామా మిమ్మల్ని భద్రంగా ఉంచేందుకు

అంతరిక్ష విమానం టేకాఫ్ తీసుకునేటప్పుడు గాని లేదా ఆకాశంలో ప్రయాణించేటప్పుడు గాని మీరు ఇలానే కదలకుండా ఉంటారు. అంటే సకల సరంజామా మిమ్మల్ని భద్రంగా ఉంచేందుకు అక్కడ ఏర్పాటు చేసి ఉంటుందన్నమాట

మీరు ఆకాశంలో ప్రయాణం చేస్తున్నప్పుడు

మీరు ఆకాశంలో ప్రయాణం చేస్తున్నప్పుడు

ఇది మీరు ఆకాశంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ వాహనాన్నికంట్రోల్ చేసే మిషన్. దాని పనితీరు ఎలా ఉంది అని ఎప్పటికప్పుడు పరీక్షించి అందులో ఉన్న వారికి పంపుతుంటుంది.

స్పేస్ ఎక్స్ సీఈఓ ఈలోన్ ముస్క్

స్పేస్ ఎక్స్ సీఈఓ ఈలోన్ ముస్క్

ఇక్కడ కూర్చుని ఉన్నది స్పేస్ ఎక్స్ సీఈఓ ఈలోన్ ముస్క్. ఇక్కడ కూర్చుని కంట్రోల్ ప్యానల్ ని కంట్రోల్ చేస్తుంటాడు

ఇది పూర్తిగా స్వతంత్ర సిద్ధమైనది

ఇది పూర్తిగా స్వతంత్ర సిద్ధమైనది

ఇది పూర్తిగా స్వతంత్ర సిద్ధమైనది. వ్యోమగాములు దీన్ని నియంత్రించుకునే సౌకర్యం కూడా ఉంటుంది. ఆకాశంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దీన్ని కంట్రోల్ చేసుకునే సామర్ధ్యం కూడా ఉంటుంది.

అత్యవసర సమయం వచ్చినప్పుడు ఇలా దీన్నుంచి

అత్యవసర సమయం వచ్చినప్పుడు ఇలా దీన్నుంచి

అత్యవసర సమయం వచ్చినప్పుడు ఇలా దీన్నుంచి బయటపడవచ్చు. ఏదైనా జరగరానిది జరిగినప్పుడు ఈ స్పేస్ క్రాఫ్ట్ నుంచి బయటపడటానికి ఇదొక రక్షణ కవచం. దీన్ని పరీక్ష కూడా విజయవంతం అయింది.

అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరిగితే

అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరిగితే

అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరిగితే నాసా నుంచి కాకుండా ప్రైవేట్ గా తయారైన వాహనాల్లో ఇది మొట్టమొదటిది అవుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వ్యోమగాములను తీసుకుపోయే తొలి వాహనం కూడా ఇదే కావచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here write NASA's new spaceship looks sleeker than a sports car
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot