ప్లూటోపై పర్వతాలు,పొగమంచు మైదానాలు

|

ప్లూటో తెలుసు కదా..అదేనండీ సూర్యమండలంలో చివరి గ్రహం.. ఆ గ్రహం కూడా అచ్చం మన భూమిలాగానే ఉందని నాసా చెబుతోంది. ఆ గ్రహంపై మంచు పర్వతాలు,అలాగే మంచు కొండలు ఇలా ఒకటేమిటీ అన్నింటితో నిండిపోయింది. నాసా ప్లూటో పైకి పంపిన హరిజోన్ ఉపగ్రహం ఈ మధ్య తీసిన చిత్రాల్లో ఈ విషయం స్పష్టమైంది. అచ్చం భూమిని పోలి ఉన్న ఈ ప్లూటో పై మానవులు నివసించేందుకు అనువైన వాతావరణం కూడా ఉందని నాసా చెబుతోంది. దీనిపై ఓ స్మార్ట్ లుక్కేయండి మరి.

Read more : ఆ గ్రహంపై మంచుకొండలు

మనోహరమైన పర్వతశ్రేణులు, లోతట్టు ప్రాంతాలు,
 

మనోహరమైన పర్వతశ్రేణులు, లోతట్టు ప్రాంతాలు,

సూర్యమండలంలో చివరిగ్రహం ప్లూటో మనోహరమైన పర్వతశ్రేణులు, లోతట్టు ప్రాంతాలు, పొడవైన మైదానాలతో నిండి ఉన్నది. ఈ విషయాన్ని ప్లూటోపై నాసా ఉపగ్రహం న్యూ హారిజాన్ తాజాగా తీసిన దృశ్యాలు ధ్రువీకరిస్తున్నాయి.

11 వేల అడుగుల ఎత్తు

11 వేల అడుగుల ఎత్తు

ఈ దృశ్యాలు ఆశ్చర్యకరమైన రీతిలో భూమిని తలపిస్తున్నాయి. గత జూలై 14న తీసిన ఫోటోగ్రాఫ్‌లను నాసా తాజాగా విడుదలచేసింది. పర్వతశ్రేణులు 11 వేల అడుగుల ఎత్తు ఉంటాయని అంచనా వేశారు.

భారీ మైదానాలు, హిమానీ నదులు

భారీ మైదానాలు, హిమానీ నదులు

భారీ మైదానాలు, హిమానీ నదులు కూడా ఉన్నాయని తెలుస్తున్నది. ఈ దృశ్యాన్ని చూస్తే ప్లూటోపై ఉన్న ప్రకృతి మైదానాలు భూమిపై ఉన్నటువంటివే అనిపిస్తుంది అని కొలరాడోలోని నైరుతి అధ్యయన సంస్థ కేంద్రంగా నాసా ఉపగ్రహం హారిజాన్‌ను పర్యవేక్షిస్తున్న డాక్టర్ అలన్ స్టెర్న్ వ్యాఖ్యానించారు.

సైంటిఫిక్ బోనాంజా వంటిది

సైంటిఫిక్ బోనాంజా వంటిది

ప్లూటో వాతావరణంపై లభించిన చిత్రం ఒక సైంటిఫిక్ బోనాంజా వంటిది అని స్టెర్న్ పేర్కొన్నారు. భూమి తరహా వాతావరణం ఉంటుందని అసలు ఊహించలేదని స్టెర్న్ తెలిపారు.

11 వేల మైళ్ల దూరం నుంచి..
 

11 వేల మైళ్ల దూరం నుంచి..

ఈ గ్రహానికి 11 వేల మైళ్ల దూరం నుంచి తీసిన ఈ ఫొటోగ్రాఫ్ ప్రకారం ప్లూటోపై పలుచని పొగమంచు వంటి పొరలున్నాయని.. అయితే అక్కడి వాతావరణం అంతా నైట్రోజన్‌తో నిండి ఉండవచ్చునని భావిస్తున్నారు.

డజన్‌కుపైగా గడ్డిపోచ వంటి సన్నటి పొరలు

డజన్‌కుపైగా గడ్డిపోచ వంటి సన్నటి పొరలు

డజన్‌కుపైగా గడ్డిపోచ వంటి సన్నటి పొరలున్నాయని ఆ దృశ్యాన్ని బట్టి తెలుస్తున్నది.

అనునిత్యం వాతావరణంలో మార్పులు

అనునిత్యం వాతావరణంలో మార్పులు

భూగోళం మాదిరిగానే ప్లూటోపై అనునిత్యం వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయని అరిజోనాలోని లోవెల్ అబ్జర్వేటరీ సంస్థ చీఫ్ విల్ గ్రండీ పేర్కొన్నారు.

మంచుతో నిండిన మైదానాలు

మంచుతో నిండిన మైదానాలు

ఈ చిత్రాల్లో కనిపిస్తున్న సన్నటి పొర వంటి పొగమంచే దీనికి నిదర్శమన్నారు. భూగోళంపై గ్రీన్‌లాండ్, అంటార్కిటికా తరహాలోనే ప్లూటోపై కనిపిస్తున్న మైదానాలు మంచుతో నిండి ఉన్నాయని తెలుస్తున్నది.

దీనికి సంబంధించిన నాసా వీడియోని చూసేయండి

దీనికి సంబంధించిన నాసా వీడియోని చూసేయండి

Most Read Articles
Best Mobiles in India

English summary
here write Ice mountains of the dwarf planet: NASA release jawdropping images of 'Earth-like' Pluto

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X