ది మార్షియన్‌లో ఉన్నవి నిజంగా నాసా చిత్రాలేనా..

Written By:

ప్రపంచవ్యాప్తంగా ఇటీవల విడుదలైన ది మార్షియన్ చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్‌తో విజయఢంకా మోగిస్తున్నది. ఈ చిత్రంలో అంగారక గ్రహంపై చూపిన ప్రదేశాలకు సంబంధించిన చిత్రాలను నాసా విడుదల చేసింది. ఈ చిత్రాలను హైరైస్ అనే కెమెరా సహాయంతో నాసాకు చెందిన మార్స్ ఆర్బిటర్ చిత్రీకరించింది. అంగారక గ్రహ ఉపరితలంపై ఉన్న ప్రతీ చిన్న అంశాన్ని కూడా హైరైస్ బంధించింది. ఏరెస్ 3 ఖగోళయాత్రలో భాగంగా అంగారక గ్రహంపై మవార్త్ బిలం నుంచి మరో చోటుకు వెళ్లడానికి ఖగోళ శాస్త్రవేత్త చేసిన సాహసాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.అయితే నాసా విడుదల చేసిన చిత్రాలకు సినిమాలో చూపిన ప్రదేశాలు చాలా భిన్నంగా ఉన్నాయని తెలుస్తోంది.

Read more:అక్కడ పాలకూర..ఇక్కడ బంగాళ దుంప

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చిత్రంలో చూపిన ప్రదేశాలకు భిన్నంగా తాజాగా నాసా చిత్రాలు

చిత్రంలో చూపిన ప్రదేశాలకు భిన్నంగా తాజాగా నాసా విడుదల చేసిన చిత్రాలుండటం కొంత గందరగోళానికి గురి చేసింది. 

ప్లానిషియా అనే ప్రదేశం నుంచి సాహసయాత్ర

ఏరెస్ 3 అంతరిక్ష నౌక నిలిచి ఉన్న అసిడాలియా ప్లానిషియా అనే ప్రదేశం నుంచి సాహసయాత్ర ప్రారంభమవుతుందని ది మార్షియన్ చిత్రంలో చూపిస్తారు.చిత్రంలో ఈ ప్రాంతమంతా చాలా విశాలంగా.. బల్లపరుపుగా ఉన్నట్లు కనిపిస్తుంది.

ఎత్తైన ప్రదేశాలతో.. ఎగుడుదిగుడుగా ఉండే ఉపరితలం

కానీ నాసా విడుదల చేసిన చిత్రాల్లో ఆ ప్రాంతమంతా ఎత్తైన ప్రదేశాలతో.. ఎగుడుదిగుడుగా ఉండే ఉపరితలం.. ప్రయాణానికి అత్యంత కఠినమైన పరిస్థితులున్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

దాదాపు సరిపోయే విధంగానే

అయితే ఇప్పటివరకు అంతరిక్ష నౌక క్యూరియాసిటీ పంపిన చిత్రాలన్నీ పరిశీలిస్తే ది మార్షియన్ చిత్రంలో చూపిన ప్రదేశాలన్నీ అంగారకుడిపై ఉన్న ప్రదేశాలను దాదాపు సరిపోయే విధంగానే ఉన్నట్లు స్పష్టమైంది.

హైరైస్ కెమెరా సహాయంతో 39 వేల ఫొటోలను ..

2006 నుంచి ఇప్పటివరకు హైరైస్ కెమెరా సహాయంతో 39 వేల ఫొటోలను మార్స్ రికానాయ్‌సెన్స్ ఆర్బిటర్ చిత్రీకరించింది. ఈ చిత్రాలన్నింటినీ నాసా ఆన్‌లైన్‌లో పొందుపరిచింది.

మార్షియన్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇదే.

మార్షియన్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇదే.

గిజ్‌బాట్ పేజిని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write NASA releases stunning pictures of real-life locations from Matt Damon Hollywood blockbuster The Martian
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot