అక్కడ పాలకూర..ఇక్కడ బంగాళ దుంప

Posted By:

సైంటిఫిక్ ధ్రిల్లర్ తో వచ్చిన సైన్స్ పిక్షన్ చిత్రం ది మార్షియన్‌. ధియేటర్ల ముందు కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. వ్యోమగాములతోనూ, అంతరిక్షంలో జరిగిన అంశాలతోనూ ఈ సినిమా ప్రేక్షకుల కు కనువిందు చేస్తోంది. అయితే ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ విచిత్రం ఏంటంటే దీనికి రియల్ టెక్నాలజీని వాడారు. అంతరిక్షంలో జరిగిన కొన్నింటిని ఈ సినిమాలో సీన్లుగా వాడారు. అవి నాసాకు సంబంధించినవే కావడం గమనార్హం. ఈ సినిమాలో వ్యోమగామి మార్క్ వ్యాట్ని పాత్రను ప్రముఖ హాలీవుడ్ హీరో మాట్ డామన్ పోషించారు. అంతరిక్షంలో జీవం మనుగడకు ఆస్కారం ఉందని వెతుక్కుంటూ హీరో సాగుతారు..దీనికోసం రెస్కూ మిషన్ కూడా చేపడతారు.ఈ సినిమాకు ఆధారం 2011లో ఆండీ వెర్ రాసిన ది మార్షియన్‌ నవల.మరి ఈ సినిమాలో నాసా టెక్నాలజీని ఏం వాడారో ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: కాల్పుల మోతల మధ్య మిరుమిట్లు గొలిపే కాంతులు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మార్స్ మీద మానవ ఆవాసం

రెడ్ ప్లానెట్ మీద మానవ ఆవాసాన్ని ఈ చిత్ర యూనిట్ నిర్మించింది. కఠినమైన వాతావరణంలో ఈ సినిమా బృందం పనిచేసింది. అయితే షాక్ ఏంటంటే ఇప్పటి వరకు నాసా మార్స్ పై ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. కాని జాన్సన్ స్పేస్ సెంటర్ లో మానవ నివాసానికి అనుగుణమైన నిర్మాణాలు చేపట్టింది. ఇందులో 14 రోజులు వ్యోమగాములు ఉండే విధంగా నిర్మాణం చేశారు.

బంగాళదుపంల తోట

ఇక ఈ చిత్రంలో వ్యోమగామి వ్యాట్ని ఆకలిని అధిగమించడం కోసం బంగాళ దుంపల మెక్కలను పైన పెంచుతాడు. అయితే ఇంతకు ముందు అంతరిక్షంలో వ్యోమగాములు పాలకూర పెంపకం చేపట్టారు.ఇప్పుడు నాసా కూడా మార్స్ పైన కూరగాయలు.మొక్కల పెంపకం కు ప్లాన్ చేస్తోంది. అయితో మనోళ్లు ఈ సినిమాలో ఆ సీన్లను వాడేశారు.

వాటర్ రికవరీ

మార్స్ పైన హీరో వాటర్ కోసం నానా తంటాలు పడతారని సినిమాలో చూపిస్తారు. దానికోసం హీరో ఓ పరిష్కార మార్గాన్ని కనుక్కుంటారు కూడా, అయితే ఇదే విషయంపై నాసా కూడా ప్లాన్ చేస్తోంది. భవిష్యత్ లో మంచి నీటిని మార్స్ పైకి పంపే ఏర్పాట్లు చేస్తోంది. అక్కడ ఫిల్టర్ సిస్థం కోసం నాసా ఇప్పట్నుంచే ప్లాన్ చేస్తోంది.

ఆక్సిజన్ జనరేషన్

రెడ్ ప్లానెట్ పై ఆక్సిజన్ కావాలి కదా అందుకోసం ఆక్సి జనరేటర్ అని సిస్ఠంని తీసుకువెళతారు. అది కార్బన్ డై ఆక్సైడ్ నుండి ఆక్సిజన్ ను రప్పించే ఏర్పాటు చేస్తారు. ఈ ప్లాన్ కూడా నాసా ప్రయోగ దశలో ఉంది.ఆక్సిజన్ హైడ్రోజెన్ లతో కలిసి నాసా ప్రయోగాన్ని చేస్తోంది.

మార్స్ స్పేస్ సూట్

వ్యాట్ని అంతరిక్షంలో కొంత టైం గడపడానికి కావాల్సిన స్పేస్ సూట్ ని అలాగే పర్వతాలను అధిరోహించడానికి అవసరమైన స్పేస్ సూట్ ని కూడా నాసా ను అనుసరించే తీసుకున్నారు.

మార్స్ రోవర్

వ్యాట్ని యూజ్ చేసిన రోవర్ కూడా అచ్చం నాసా రోవర్ లాగానే ఉంటుంది. నాసా ఆరు చక్రాల రోవర్ మార్స్ పైన వాతావరణం తట్టుకునే విధంగా ఉంటుంది. అదే పాయింట్ తో ఈ సినిమాలో రోవర్ ని వాడారు.

ఇయాన్ ప్రొప్లేషన్

వ్యాట్ని తన సిబ్బందిని మార్స్ పై నుంచి భూమి మీదకు తరలించడానికి అయాన్ ప్రొప్లేషన్ వాడుతారు. అది అధిక వేగంతో అంతరిక్షం నుంచి కిందకు రాగలదు. ఇది నాసా ఇప్పటికే మరుగుజ్జు ఉపగ్రహమైన సెరిస్ పై ప్రయోగించింది. అక్కడ అయాన్ ప్రొప్లేషన్ ని ఉపయోగించింది.

సోలార్ పవర్

ఈ సినిమాలో వ్యాట్నికి చాలా సోలార్ పవర్ ప్యానెల్స్ అవసరమవుతాయి. అయితే నాసా కూడా అనేక సోలార్ పవర్ ప్యానెల్స్ ను రోబోటిక్ స్పేస్ క్రాప్ట్ కోసం ఉపయోగించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దీనిపై ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పడు అది ప్రయోగ దశలో ఉంది.

న్యూక్లియర్ పవర్

ఈ సినిమాలో రేడియో ఐసోటోప్ ఉష్ణవిద్యుత్ జెనరేటర్ ను వాడారు. అయితే ఇది ఇంతకు ముందే నాసా వాడింది. చందమామ మీదకు పంపిన క్యూరియా సిటీ రోవర్ లోనూ అలాగే ప్లూటోపైకి పంపిన మారిజోన్ మిషన్ లోనూ ఈ పార్మలా వాడారు.

మార్స్ పై వాటర్ ఉన్నాయని చూపుతున్న నాసా చిత్రం

మార్స్ పై వాటర్ ఉన్నాయని చూపుతున్న చిత్రం. దీనికి వ్యోమగామి నిన్నటి కాపీ రేపటికి మారిపోతుంది అంటూ కామెంట్ కూడా  పెట్టారు

పాలకూర అదుర్స్

అంతరిక్షంలో పాలకూర అదుర్స్ అంటూ వ్యోమగాములు అప్పుడు పాలకూర వండుకుని తిన్నారు కదా..ఇప్పుడు అదే బంగాళ దుంపల తోట అయింది సినిమాలో 

జడ్ 2 ప్రోటోటైప్

మార్స్ పై వ్యోమగామి దిగినప్పుడు వాడిన సూట్ ఇది. జడ్ 2 ప్రోటోటైప్ ఈ సూట్ ని సినిమాలో మరో విధంగా చూపించారు. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here write The Martian Shows 9 Ways NASA Tech Is Headed to Mars
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot