చందమామపై డ్యాన్స్‌లేస్తున్న ఏలియన్స్

Written By:

ఏలియన్స్.., అదేనండి గ్రహాంతర వాసులు అంటే భూమి లాంటి గ్రహాలపై నివసించే మనుషుల్లాంటివారు. వీరిని మనుషులు అని ఖచ్చితంగా చెప్పలేము. అందుకే పక్కింటివారు అన్నట్లుగా.., అవతలి గ్రహం వారు అని పిలుచుకుంటున్నాం. వీరి గురించి ఖచ్చితమైన సమాచారం లేదు కానీ.., వీరు లేరని మాత్రం ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. కొన్ని దశాబ్దాలుగా ఈ అంశం సమాధానం దొరకని ప్రశ్నగా నానుతోంది. వీటిపై జాడపై స్పష్టమైన ఆధారాలు లేకపోయినా.., ఏలియన్స్ పేరుతో ఎన్నో కధనాలు వచ్చాయి. సినిమాలు కూడా విడుదలయి నిర్మాతల జేబులు నింపాయి. ఇంతకీ ఇప్పుడు విషయం ఏంటంటే... ఏలియన్స్ చంద్రుడిపై పాగా వేశారు. అంతేకాదు ఈ ఊరు మనదిరా.., నేల మనదిరా అంటూ ఎంచక్కా చంద్రుడిపై వాకింగులు చేస్తున్నారు.

Read more:ఆకాశ వీధుల్లో... దిగ్గజాల పోరు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ ఎర్త్ లాగానే త్వరలో గూగుల్ మూన్

గూగుల్ ఎర్త్ లాగానే త్వరలో గూగుల్ మూన్

ఇవేవో కాలక్షేపానికి చెప్తున్న కబురు కాదు. నాసా తీసిన ఫొటో ఈ విషయం చెప్తోంది. అవునండి ఇది నిజం. గూగుల్ ఎర్త్ లాగానే త్వరలో గూగుల్ మూన్ ను సిద్దం చేసేపనిలో గూగుల్ ఉంది. దీని కోసం నాసా చంద్రుడి ఫొటోలు తీసి ఇస్తోంది. ఇలా ఫొటోలు తీసినప్పుడే చంద్రుడిపై ఓ మనిషి నీడ కెమెరాకు కన్పించింది. ముందు మనిషి నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనక అతని నీడ పడింది.

కెమెరా క్లిక్ మన్పించి నాసాకు ఫొటోలు

కెమెరా క్లిక్ మన్పించి నాసాకు ఫొటోలు

ఇంకేముంది కెమెరా క్లిక్ మన్పించి నాసాకు ఫొటోలు పంపింది. ఈ ఫొటోలు చూసిన నాసా మాత్రం వీరు ఏలియన్స్ అని ధృవీకరించలేదు. అయితే ఫొటోలు చూసినవారంతా ఇది ఖచ్చితంగా ఏలియన్ అని చెప్తున్నారు.

వీడియో యూట్యూబ్ లో హల్ చల్

వీడియో యూట్యూబ్ లో హల్ చల్

ఈ వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. అప్ లోడ్ అయిన నెలలపు ఇరవై లక్షల మంది గ్రహాంతర వాసి నీడను ఆసక్తిగా చూశారు. వీడియో చూసినవారంతా ఇది ఏలియనే.., ఎనీ డౌట్ అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.

ఏలియన్స్‌కు సంబంధించిన కచ్చితమైన ఆధారాలు

ఏలియన్స్‌కు సంబంధించిన కచ్చితమైన ఆధారాలు

ఇతర గ్రహాల పైన జీవం ఆనవాళ్లను 2025 నాటికి కనుగొనే అవకాశం ఉందని, గ్రహాంతర జీవులకు లేదా ఏలియన్స్‌కు సంబంధించిన కచ్చితమైన ఆధారాలు వచ్చే ఇరవై ముప్పై ఏళ్లలో అంటే 2045 వరకు వెలుగు చూడవచ్చునని నాసాకు చెందిన శాస్త్రవేత్త చెప్పారు.

ఇతర గ్రహాల పైన జీవం ఉంది

ఇతర గ్రహాల పైన జీవం ఉంది

ఇతర గ్రహాల పైన జీవం ఉందని మరో పదేళ్లలో తెలుస్తుందని తాను బలంగా నమ్ముతున్నానని ఎలెన్ స్టోఫాన్ అనే శాస్త్రవేత్త చెప్పారు. అలాగే, కచ్చితమైన ఆధారాలు మరో రెండు మూడు దశాబ్దాలలో వెలుగు చూడవచ్చునని ఆయన అన్నారు.భూమి మీద మనుషులు ఉన్నట్టుగానే ఇతర గ్రహాలపై కూడా జీవరాసులు ఉన్నట్టు సాక్షాధారాలతో సహా చూపిస్తామని నాసా శాస్త్రవేత్తలు బల్లగుద్ది చెబుతున్నారు.

జీవం ఉనికిని కనుగొనే అవకాశం

జీవం ఉనికిని కనుగొనే అవకాశం

ఎక్కడ చూడాలో, ఎలా చూడాలో తెలుసునని చెప్పారు. మనకు టెక్నాలజీ అందుబాటులో ఉందన్నారు. మన సౌర కుటుంబం, ఆ వెలుపల జీవం ఉనికిని చాలా త్వరగానే కనుగొంటామని నాసాకు చెందిన మరో ప్రతినిధి జాన్ గ్రన్స్‌ఫెల్డ్ అన్నారు. మనం మన సోలార్ సిస్టంకు మరో జనరేషన్ దూరంలో ఉన్నామని చెప్పారు. హిమయంగా ఉన్న ఏదైనా ఉపగ్రహం కానీ అంగారకుడిపై కానీ సమీపంలోని తార వద్ద కానీ జీవం ఉనికిని కనుగొనే అవకాశం ఉందని చెప్పారు.

అతి త్వరలో చేధిస్తాం

అతి త్వరలో చేధిస్తాం

గ్రహాంతర జీవనం, నివాసయోగ్యమైన గ్రహాల అన్వేషణకు సంబంధించిన నాసా ప్యానెల్ తాజాగా నిర్వహించిన సమావేశంలో సీనియర్ శాస్త్రవేత్త ఎలెన్ స్టొఫన్ మాట్లాడుతూ మన సౌరవ్యవస్థతో పాటు ఆవల కూడా జీవనానికి సంబంధించిన జాడలు అతి త్వరలో కనుక్కుంటామన్నారు.

అంగారకుడిపై ఒకప్పుడు నీరు

అంగారకుడిపై ఒకప్పుడు నీరు

సౌరవ్యవస్థ, దాని ఆవల జీవనానికి మద్దతిచ్చే వాతావరణం అక్కడక్కడ ఉన్నట్టు ఈ మధ్య పరిశోధనల్లో వెలుగుచూసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అంగారకుడిపై ఒకప్పుడు నీరు ఉండేదని ఆయన తెలిపారు. ఏదేమైనా అతి త్వరలో ఏలియన్స్ జాడ తెలుసుకుంటామని స్పష్టంచేసారు.

యూరోపాపై గ్రహాంతరవాసులు ఉండొచ్చు

యూరోపాపై గ్రహాంతరవాసులు ఉండొచ్చు

గ్రహాల్లోకెల్లా అతిపెద్దది గురుగ్రహం (జూపిటర్). భూమికి చంద్రుడు ఉపగ్రహంలా ఉన్నట్లే గురుగ్రహానికీ యూరోపా అనే ఉపగ్రహం ఉంది. ఇది బృహస్పతి చుట్టూ తిరుగుతూ తనచుట్టూ తాను తిరుగుతుంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ యూరోపాపై గ్రహాంతరవాసులు ఉండొచ్చు అని నాసా అభిప్రాయం వ్యక్తం చేయడమే.

ఏలియన్స్ జాడలు ఉండే అవకాశం

ఏలియన్స్ జాడలు ఉండే అవకాశం

ఏలియన్స్ ఇక్కడున్నారు.. అక్కడున్నారన్న ప్రచారం తప్పితే అసలు గ్రహాంతర వాసుల జాడలను ఎవరూ కనుగొనలేదు. తాజాగా జూపిటర్ ఉపగ్రహం యూరోపా వాతావరణ పరిస్థితులతో అక్కడ ఏలియన్స్ జాడలు ఉండే అవకాశం ఉందని నాసా చెబుతోంది.

ఏలియన్స్ గుట్టు

ఏలియన్స్ గుట్టు

ఉపగ్రహంపై తెల్లగా కనిపిస్తున్న భాగం మంచురేఖలుగా అనుకుంటున్నారు. ఇది పూర్తి స్వచ్ఛమైన నీటితో ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. జూపిటర్ పై నాసా ప్రయోగించిన జునో ఉపగ్రహం అక్కడికి చేరితే ఈ ఏలియన్స్ గుట్టు రట్టయ్యే అవకాశాలున్నాయి.

అక్షరాల 650 కోట్ల రూపాయలు ఖర్చు

అక్షరాల 650 కోట్ల రూపాయలు ఖర్చు

ఏలియన్స్... వీటిపై వచ్చిన నవలలకు.. సినిమాలకు కొదవే లేదు. రాసినవాళ్లకు.. చూపించినవాళ్లకు కాసుల వర్షం కురిపించాయి. ఇంతకూ ఇవి ఉన్నాయా.. లేవా..? ఈ క్వశన్ కు ఆన్సర్ కనుక్కోవడానికి అక్షరాల 650 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టబోతున్నారు. గ్రహాంతరవాసులపై జరుగుతున్న ప్రయోగాల్లోనే ఇది అతిపెద్ద ప్రయోగం.

స్టీఫెన్ హాకింగ్ ఆధ్వర్యంలో ఈ పరిశోధనలు

స్టీఫెన్ హాకింగ్ ఆధ్వర్యంలో ఈ పరిశోధనలు

ప్రఖ్యాత సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ ఆధ్వర్యంలో ఈ పరిశోధనలు జరగనున్నాయి. లండన్ రాయల్ సొసైటీ వేదికగా పరిశోధనలకు అంకురార్పణ జరిగింది. రష్యాకు చెందిన సాఫ్ట్ వేర్ దిగ్గజం యూరీ మిల్నర్ రీసెర్చ్ కు నిధులు సమకూర్చారు. ఈ సువిశాల విశ్వంలో ఎక్కడో ఒక చోట గ్రహాంతరవాసులు ఉండే ఉంటాయని.. ఈ పరిశోధనలతో వాటి గుట్టు కనిపెట్టబోతున్నామన్నారాయన.

మలేషియా విమానం ఎంహెచ్370 పై అనేకానేక పుకార్లు

మలేషియా విమానం ఎంహెచ్370 పై అనేకానేక పుకార్లు

సరిగ్గా ఏడాది క్రితం అంతుబట్టని రీతిలో కనిపించకుండాపోయిన మలేషియా విమానం ఎంహెచ్370 పై అనేకానేక పుకార్లు షికార్లు చేస్తూ ఉండడం మనకి తెలిసినదే.అయితే మరీ వింతగా..ఈ విమానాన్ని గ్రహాంతరవాసులు ఎత్తుకెళ్లారని కధలు కధలుగా చెప్పుకుటున్నారు.

తెలివిపరంగా, టెక్నాలజీలో వారుమనకంటే ముందు

తెలివిపరంగా, టెక్నాలజీలో వారుమనకంటే ముందు

ఏలియన్స్ ఉన్నది ఎంతవరకు నిజమో తెలియదు. కాని వారు నిజంగా ఉంటే.., చంద్రుడిపై తిరుగుతుంటే. మనం విన్న కధనాల ప్రకారం, ఏలియన్స్ మనుషుల కంటే ఎంతో అడ్వాన్స్. తెలివిపరంగా, టెక్నాలజీలో వారుమనకంటే ముందున్నారని విన్నాము. చందమామపై ఇళ్ళు కట్టి అందులో మనుషుల్ని పెట్టే పనిలో నాసా నిమగ్నం అయింది.

మనుషుల పరిస్థితి ఏమిటి.

మనుషుల పరిస్థితి ఏమిటి.

అటు జాబిల్లిపై ఉండేందుకు ఇప్పటికే చాలామంది బెర్త్ కన్ ఫర్మ్ చేసుకున్నారు. కూడా ఈ తరుణంలో వారు అక్కడ ఉంటే అక్కడకు వెళ్ళే మనుషుల పరిస్థితి ఏమిటి.

కొత్తగా వెళ్లే మనుషుల్నిస్వాగతిస్తారా

కొత్తగా వెళ్లే మనుషుల్నిస్వాగతిస్తారా

ఇప్పటికే చంద్రుడిపై పాగా వేసిన గ్రహాంతర వాసులు అక్కడకు కొత్తగా వెళ్లే మనుషుల్నిస్వాగతిస్తారా.., లేక కన్నెర్ర చేస్తారా తెలియదు.

ఏలియన్స్ భూమిపైకి వస్తే

ఏలియన్స్ భూమిపైకి వస్తే

అంతేకాదు మనుషులు చంద్రుడిపైకి వెళ్ళినట్లు ఏలియన్స్ భూమిపైకి వస్తే..? వినటానికి ఎంతో ఎగ్జయిటింగ్ గా ఉన్నా సినిమాల్లో చూపించినట్లు భూమాతపై దాడికి దిగితే ఇక అంతే సంగతులు. అలా జరగకూడదని కోరుకుందాం. మనుషులు ఏలియన్స్ బాయ్ బాయ్.

గిజ్ బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్ బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్ బాట్ పేజీని లైక్ చేయడం ద్వారా మీరు టెక్నాలజీకి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ పొందగలరు

https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Signs of Alien Life Will Be Found by 2025, NASA's Chief Scientist Predicts
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot