ఎగిరే డ్రోన్ డాక్టర్ అయింది

Posted By:

ఎగిరే డ్రోన్ డాక్టర్ అయింది..ఏందీ నమ్మలేకున్నారా..అవును ఇది నిజం..రానున్న కాలంలో డ్రొన్సే ఇక డాక్టర్లుగామారనున్నాయి. ఎవరికైనా ఆపద కలిగినప్పుడు వెంటనే మీ మొబైల్ నుంచి డ్రోన్స్ కి సమాచారం అందిస్తే అవి తక్షణమే మీముందుకు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తో వాలిపోతాయి.దీని కోసం దిగ్గజ కంపెనీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఆకాశంలో దిగ్గజాల పోరు మొదలైంది. సోని ,గూగుల్ ,ఫేస్ బుక్,అమెజాన్ వంటి కంపెనీలు డ్రొోన్స్ తో తమ సత్తా చాటేందుకు సిధ్దమైపోయాయి. లేటెస్ట్ టెక్నాలజీతో సరికొత్త వ్యూహంతో ముందుకు దూసుకెళుతున్నాయి. మొన్న గూగుల్ ,నిన్న అమెజాన్ నేడు సోనీ.. ఈ కంపెనీ నుంచి ఇప్పుడు జడ్ ఎంపీ ఇంక్ ప్రోటోటైప్ ల డ్రోన్ లు వచ్చేస్తున్నాయి. అవి గంటకు దాదాపు 180 కిలోమీటర్ల వేగంతో ఆకాశంలో చక్కర్లు కొట్టనున్నాయి.

Read more : కలాం జ్ఞాపకాల నీడలో భాగ్యనగరం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డ్రోన్ ఫస్ట్ ఎయిడ్ వీడియో

పేషెంట్ కి ఆపద జరిగితే ఇలా క్షణాల్లో మీ ముందు వాలిపోతుంది డ్రోన్. 

డ్రోన్ టేకాఫ్

డ్రోన్ టేకాఫ్ తీసుకోవడం కాని ల్యాండింగ్ తీసుకోవడం కాని చాలా తేలిక. ఈడ్రోన్స్ ఇప్పుడు జపాన్ లో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి. అక్కడి మనుషులకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. పెద్ద పెద్ద పట్టనాల్లో సర్వేయింగ్ కోసం అలాగే అబ్జర్వేషన్ కోసం అలాగే ఇన్ స్పెక్టింగ్ కోసం ఇంకా కొలతల కోసం వాడుతున్నారు.సోనీ కార్పోరేషన్ టోక్యో కేంద్రంగా ఏరోసెన్స్ పేరుతో వెంచర్ ని ఏర్పాటు చేసింది. ఆ జాయింట్ వెంచర్ లో కష్టమర్స్ కోసం డ్రోన్స్ ని ఏర్పాటు చేసింది. ఈ డ్రోన్స్ 10 కిలోల వరకు బరువును మోసే విధంగా రూపొందించారు. దానికి సంబంధించిన ఫస్ట్ వీడియోని సోని కంపెనీ విడుదల చేసింది. అది రెండు గంటల పాటు ఎక్కువ బరువులను మోసింది. ఇది చాలా చిన్న జెట్ లాగా చూసేదానికి అదిరే లుక్కుతో కనిపిస్తుంది. రెండు గంటల్లో 106 మైళ్ల దూరాన్ని 22 కేజీల బరువుతో అధిగమించింది.

సోనికంపెనీ కి సంబంధించిన డ్రోన్స్ వీడియో

సోనికంపెనీ కి సంబంధించిన రానున్న డ్రోన్స్ వీడియో ఇదే

మార్కెట్ లో ఇ ప్పటికే పెరిగిన డ్రోన్ల వినియోగం

మార్కెట్ లో ఇ ప్పటికే డ్రోన్ల వినియోగంపెరిగిపోయింది.పెద్ద పెద్ద కంపెనీలు ఈ రంగంలోకి దూసుకువస్తున్నాయి. ఇప్పటికే గూగుల్,..అమెజాన్ వంటి సంస్థలు ఈ డ్రోన్స్ ను తయారు చేసే పనిలో బిజీగా ఉన్నాయి. సోనీ కంపెనీ తన మొబైల్ మార్కెట్ నుంచి ఇతర బిజినెస్ ల్లోకి రావాలని చూస్తోంది. అందులో భాగంగా డ్రోన్స్ ని కూడా తయారు చేస్తున్నారు.

జడ్ ఎంపీ ప్రాజెక్ట్ కోసం దాదాపు 550 రూ. కోట్లు ఖర్చు

వీటితో పాటు ప్లేస్టేషన్ గేమింగ్ డివిజన్,సోనీ పిక్షర్స్,సోని మ్యూజిక్ వంటి బిజినెస్ లు చేస్తోంది. 

కంపెనీ జడ్ ఎంపీ ప్రాజెక్ట్ కోసం దాదాపు 550 రూ. కోట్లు ఖర్చు

కంపెనీ జడ్ ఎంపీ ప్రాజెక్ట్ కోసం దాదాపు 550 రూ. కోట్లు ఖర్చు చేయనుందని కంపెనీ సీఈఓ కాజు తెలిపారు. 2016 కల్లా మార్కెట్ లోకి తీసుకురావడమే ధ్యేయమన్నారు.

10 ఏళ్లలో వందల సంఖ్యలో డ్రోన్స్‌

10 ఏళ్లలో వందల సంఖ్యలో డ్రోన్స్‌ ప్రపంచంలోని ప్రధాన నగరాలో గగనతలంలో సందడి సందడిగా తిరగాడనున్నాయి. నాసా ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో డ్రోన్స్‌ వాడకానికి సంబంధించి అమెజాన్‌ విప్లవాత్మక ప్రతిపాదనలు చేసింది. ప్రపంచ నగరాల పైన ఎయిర్‌స్పేస్‌ (గగనతలం)లో కొంత మేర వేగంగా బట్వాడా చేసే హైస్పీడ్‌ డ్రోన్స్‌ విహరించేందుకు వదిలేయాలని ఇకామ్‌ దిగ్గజం అమెజాన్‌ ప్రతిపాదించింది.

పదేళ్లలో వేలాది చిన్న చిన్న డ్రోన్స్‌

పదేళ్లలో వేలాది చిన్న చిన్న డ్రోన్స్‌ ఆకాశంలో విచ్చలవిడిగా విహరిస్తాయని అమెజాన్‌ అంచనావేస్తోంది.

200 అడుగుల నుంచి 400 అడుగుల మధ్య ప్రాంతాన్ని డ్రోన్స్‌ విహారం కోసం..

అందు వల్ల భూతలం నుంచి 200 అడుగుల నుంచి 400 అడుగుల మధ్య ప్రాంతాన్ని డ్రోన్స్‌ విహారం కోసం వదిలివేయాలని, ఇందులో బట్వాడా డ్రోన్స్‌ మాత్రమే కాకుండా వివిధ రకాల డ్రోన్స్‌ విహరించే అవకాశం ఉంటుందని పేర్కొంది. గంటకు 60నాటికల్‌ మైళ్లు అంతకంటే వేగంగా దూసుకుపోయే డ్రోన్స్‌ అమెజాన్‌ ప్రతిపాదనలో ఉన్నాయి.

400-500 అడుగుల మధ్య ప్రాంతాన్ని నోఫ్లై జోన్‌

400-500 అడుగుల మధ్య ప్రాంతాన్ని నోఫ్లై జోన్‌గా ప్రకటించాలని సూచించింది. దీనివల్ల డ్రోన్స్‌ మధ్య ప్రమాదాలు జరగకుండా ఉండడమేకాక, కార్గో, ప్యాసింజర్‌ విమానాలు డ్రోన్స్‌ కారణంగా ప్రమాదాలకు గురికాకుండా ఉంటాయని తెలిపింది.

30 నిమిషాల్లో కస్లమర్‌కు సరుకు

డ్రోన్స్‌ ద్వారా ఆర్డర్లు అందిన 30 నిమిషాల్లో కస్లమర్‌కు సరుకు బట్వాడా చేయాలని కంపెనీ ఎప్పటినుంచో ల క్ష్యంగా పెట్టుకుంది.

నాసా సదస్సులో...

ఇందుకోసం అనుసరించాల్సిన వ్యూహాలను కంపెనీ నాసా సదస్సులో వివరించింది. అయితే ఈ ప్రత్యేక ఎయిర్‌స్పేస్‌లో కేవలం అన్ని రకాలుగా రక్షణ ఏర్పాట్లున్న డ్రోన్స్‌ను మాత్రమే అనుమతించాలని సూచించింది.

ఆత్యాధునిక జిపిఎస్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌,

ఆత్యాధునిక జిపిఎస్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌, కరెక్ట్‌ లొకేషన్‌ను గర్తించడంతో పాటు ఇతర డ్రోన్స్‌ కదలికల ఆధారంగా గమనాన్ని సర్దుబాటు చేసుకునే విధంగా ఇంటర్‌నెట్‌ కనెక్టవిటీ, ఆన్‌లైన్‌ ఫ్లైట్‌ ప్లానింగ్‌, కమ్యూనికేషన్‌ ఎక్విప్‌మెంట్‌, సెన్సార్‌ ఆధారిత సెన్స్‌ అండ్‌ ఎవాయిడ్‌ పరికరాలు... ఉన్న డ్రోన్స్‌నుమాత్రమే గగనయాత్రకు అనుమతించాలని సూచించింది. రాబోయే కాలంలో డ్రోన్స్‌ సంఖ్యతో పోలిస్తే కార్గో, ప్యాసింజర్‌, యుద్ధ విమానాల సంఖ్య తగ్గుతుందని అంచనావేసింది.

ఇకనుంచి కొరియర్‌ బాయ్‌ లు కనిపించరు.

ఇకనుంచి కొరియర్‌ బాయ్‌ లు కనిపించరు. రోడ్డుమీద పీజా డెలివరీ బోయ్‌ ల బైకులూ కనిపించవు. పంటపొలాలపై పెస్టిసైడ్లు స్ప్రే చేసేందుకు గంటలు గంటలు కష్టపడాల్సిన పనిలేదు. ఎందుకంటే భవిష్యత్తులో ఈ పనులన్నీ డ్రోన్స్‌ చేయబోతున్నాయి. కూర్చున్న చోటు నుంచే ఆపరేట్‌ చేస్తూ అన్ని పనులు ఈజీగా కంప్లీట్‌ చేయొచ్చు. అందుకే మనిషి జీవితాన్ని మరింత సుఖమయం చేసే డ్రోన్స్‌ తయారీపై దృష్టిపెట్టాయి స్టార్టప్ కంపెనీలు.

నిజానికి డ్రోన్‌ కాన్సెప్ట్‌ మనదే

నిజానికి డ్రోన్‌ కాన్సెప్ట్‌ మనదే. అయితే ఇక్కడ సరైన ప్రోత్సాహం లేకపోవడంతో చాలా కాలం వరకు ఎవరూ పట్టించుకోలేదు. ఇలాంటి వాటిలో ముందుండే అమెరికా -పేటెంట్‌ తీసుకుని డ్రోన్లపై తన మార్కు వేసుకుంది.

ఇండియన్‌ స్టార్టప్‌లు తమ సత్తా చాటుకునేందుకు డ్రోన్‌ల తయారీపై దృష్టి

కానీ ఇప్పుడిప్పుడే ఇండియన్‌ స్టార్టప్‌లు తమ సత్తా చాటుకునేందుకు డ్రోన్‌ల తయారీపై దృష్టి సారిస్తున్నాయి. మారుతున్న అవసరాలకు అనుగుణంగా మోడ్రన్‌ టెక్నాలజీని ఉపయోగించి డ్రోన్స్‌ డెవలప్‌ చేస్తున్నారు.

చాలా రంగాల్లో అడుగుపెట్టిన డ్రొన్స్

తొలుత ప్రొడక్ట్‌ డెలివరీ కోసం ఉపయోగించిన డ్రోన్లు ఇప్పుడు చాలా రంగాల్లో అడుగుపెట్టాయి. దీంతో గత రెండేళ్ల నుంచి ఈ రంగంలోకి అడుగుపెడుతున్న స్టార్టప్స్‌ సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే ఇన్వెస్టర్లు ఇంట్రెస్ట్‌ చూపకపోవడం నెగిటివ్‌ ఇంపాక్ట్‌ చూపిస్తోంది. కానీ కార్పొరేట్‌ కంపెనీలు, ఇండస్ట్రీలు మాత్రం ఈ ఫ్లైయింగ్‌ మెషీన్లపై ఆసక్తి చూపుతున్నాయి.

అగ్రికల్చర్‌, పోలీసింగ్‌, ఏరియల్‌ ఇమేజింగ్‌

అగ్రికల్చర్‌, పోలీసింగ్‌, ఏరియల్‌ ఇమేజింగ్‌లకు ఉపయోగించే డ్రోన్లను కమర్షియల్‌గా మానుఫ్యాక్చర్‌ చేసేందుకు స్టార్టప్స్‌ రెడీ అవుతున్నాయి.

సాఫ్ట్‌ వేర్‌లో విప్లవాత్మక మార్పులు

కేవలం డ్రోన్లను తయారుచేయడమే కాక వాటి బ్రెయిన్‌ లాంటి సాఫ్ట్‌ వేర్‌లో విప్లవాత్మక మార్పులు చేస్తూ కమర్షియల్‌గా మార్కెట్‌ చేస్తున్నాయి. త్రీడీ మ్యాపింగ్‌, మానిటరింగ్‌, ఏరియల్‌ ఇమేజింగ్‌ అడ్వర్టయిజింగ్‌ కోసం ఉపయోగించే డ్రోన్స్‌ తయారీలో స్టార్టప్స్‌ దూసుకుపోతున్నాయి.

వ్యవసాయం చేసే డ్రోన్లకూ ప్రాణం పోశారు మనోళ్లు.

వ్యవసాయం చేసే డ్రోన్లకూ ప్రాణం పోశారు మనోళ్లు. పశుపక్ష్యాదుల నుంచి రక్షణ కోసమే కాకుండా, పురుగు మందులు స్ప్రే చేయడానికి కూడా డ్రోన్లు ఉపయోగ పడుతున్నాయి. సాధారణంగా మోటార్ స్ప్రేయర్లతో రసాయనాలను చల్లుతారు. అయితే ఇది అంత ఈజీ కాదు.

సమస్యలన్నింటిని నివారిస్తుంది అగ్రి డ్రోన్‌

టైం వేస్టు కూడా. ఈ సమస్యలన్నింటిని నివారిస్తుంది అగ్రి డ్రోన్‌. గాల్లో విహరిస్తూ పెస్టిసైడ్స్‌ ను స్ప్రే చేస్తుంది. మోటార్స్‌ స్ప్రేయర్లు మూడు గంటల్లో చేయగల పనిని- డ్రోన్‌ కేవలం పది -పన్నెండు నిమిషాల్లో పూర్తి చేస్తుంది.

హృద్రోగుల వద్దకు డ్రోన్స్

హృద్రోగుల వద్దకు చేరుకొని వారికి వెంటనే చికిత్స చేసేందుకు ఉపయోగపడే అంబులెన్స్‌ డ్రోన్‌ను రూపొందించాడు నెదర్లాండ్‌కు చెందిన ఓ విద్యార్థి. నాలుగు కిలోల బరువుండే ఈ డ్రోన్‌ గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ హార్ట్‌ ఎటాక్‌ వచ్చిన వారి వద్దకు క్షణాల్లో చేరుకొని సాయం అందిస్తుంది.

రోగి మొబైల్‌ నెట్‌వర్క్‌ ఆధారంగా రోగి వద్దకు డ్రోన్‌

రోగి మొబైల్‌ నెట్‌వర్క్‌ ఆధారంగా ఈ డ్రోన్‌ రోగి వద్దకు చేరుకుంటుంది. మెడికల్‌ అసిస్టెన్స్‌ కు అవసరమైన ఫస్ట్‌ ఎయిడ్‌తో పాటు డాక్టర్‌ను కన్సల్ట్‌ చేసేందుకు వీడియో కెమెరాను ఇందులో పొందుపర్చారు. ఈ డ్రోన్‌ అందుబాటులోకి వచ్చాక హార్ట్‌ ఎటాక్‌ వచ్చిన వెంటనే ఫస్ట్‌ ఎయిడ్‌ అందక చనిపోయే వారి సంఖ్య 80శాతం వరకు తగ్గిందట.

డ్రోన్లలో ఇప్పటికే చాలా రకాలు అందుబాటులోకి

డ్రోన్లలో ఇప్పటికే చాలా రకాలు అందుబాటులోకి వచ్చాయి. నీళ్లలో ల్యాండ్‌ అయ్యేవే కాక మంటల్లోంచి దూసుకుపోయేలా హీట్‌ రెసిస్టెంట్‌ పవర్‌ని వాటికి యాడ్‌ చేస్తున్నారు. విపత్తుల సమయంలో వీటిని వినియోగించవచ్చు.

మనుషులు వెళ్లలేని ప్రాంతాలకు సైతం...

కొండ కోనల్లో మనుషులు వెళ్లలేని ప్రాంతాలకు సైతం డ్రోన్లు సునాయాసంగా వెళ్లిపోతాయి. ప్రమాదాలు జరిగినప్పుడు మారుమూల ప్రాంతాలకు ఈ డ్రోన్లను పంపి పరిస్థితులు తెలుసుకునే వీలుంది.

నైట్‌ విజన్‌ కెమెరాలున్న డ్రోన్స్‌ సెక్యూరిటీ

ఇక నైట్‌ విజన్‌ కెమెరాలున్న డ్రోన్స్‌ సెక్యూరిటీ ఇవ్వడంలో తిరుగులేని అస్త్రాలుగా పనిచేస్తున్నాయి. మంచి క్వాలిటీ ఉన్న విజువల్స్‌ అందిస్తూ నిఘా నేత్రాలుగా అద్భుతంగా పనిచేస్తున్నాయి. జాతరలు, బహిరంగ సభలు, గణపతి నిమజ్జనం లాంటి కార్యక్రమాల్లో హై సెక్యూరిటీ కోసం డ్రోన్లను వాడుతున్నరు.

డ్రోన్‌ 12 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణం

చిన్నపాటి బేసిక్‌ డ్రోన్‌ 12 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది. రిమోట్‌ కంట్రోల్‌ తో పనిచేసేవే కాక ఆటోమేటిక్‌గా పనిచేసే డ్రోన్స్‌ కూడా ఉన్నాయి. ట్యాబ్లెట్‌ పీసీల్లో, హై ఎండ్‌ మొబైల్‌స్‌లో డ్రోన్‌ ఆపరేటింగ్‌ సాఫ్ట్‌ వేర్‌ ను ఇన్‌స్టాల్‌ చేసుకుని వీడియోలు రికార్డ్‌ చేయొచ్చు. కూర్చున్న చోటు నుంచే ఆపరేట్‌ చేయొచ్చు.

పార్సిల్‌ కంపెనీలకు నచ్చిన డ్రోన్‌ కాన్సెప్ట్‌

పార్సిల్‌ కంపెనీలకు డ్రోన్‌ కాన్సెప్ట్‌ తెగ నచ్చింది. చిన్న చిన్న ప్యాక్‌లను ముంగిట్లోకి తీసుకురాగలిగే మినీ డ్రోన్‌లు ఇప్పటికే రంగంలోకి దింపాయి. కస్టమర్‌ ఇలా ఆర్డర్‌ ఇవ్వగానే అలా డెలివరీ చేసేందుకు వీటికి ఉపయోగిస్తున్నారు.

ఫాస్ట్‌ సర్వీస్‌ డ్రోన్లతో ప్రొడక్ట్స్‌ ని డోర్‌ డెలివరీ

ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ ఎయిర్‌ ప్రాజెక్ట్‌ పేరుతో సూపర్‌ ఫాస్ట్‌ సర్వీస్‌ డ్రోన్లతో ప్రొడక్ట్స్‌ ని డోర్‌ డెలివరీ చేస్తోంది. డోమినో పిజ్జా కూడా ఇదే ట్రెండ్‌ ఫాలో అవ్వాలని డిసైడైంది. వేడి వేడి పిజ్జాలను వినియోగదారుల గడప ముందు ఉంచడానికి ఆక్టోకాప్టర్‌ డ్రోన్లను ఆశ్రయిస్తోంది.

డ్రోన్ల సాయంతో వర్షాలు కురిపించే ప్రయత్నాలు

డ్రోన్ల సాయంతో వర్షాలు కురిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హెలికాప్టర్ల సాయంతో మేఘమథనం జరుగుతున్నా అది అంతగా ఫలితాలివ్వడం లేదు. దీంతో డ్రోన్లను ఇందుకోసం ఉపయోగించేలా డెవలప్‌ చేస్తున్నారు.

మేఘమథనం ఈజీ

డ్రోన్లతో మబ్బుల్లోకి సిల్వర్‌ ఐయోడైడ్‌ క్రిస్టల్స్‌ నేరుగా పంపే అవకాశం ఉంటుంది. దీంతో మేఘమథనం ఈజీ అవుతుందని కావాల్సిన చోట వర్షాలు కురిపించి కరువు కష్టాలకు చెక్‌ పెట్టొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Sony Corporation in July partnered with Tokyo-based startup ZMP Inc to launch a new subsidiary called Aerosense. The joint venture, which is an all-purpose drone company for business customers, has unveiled a prototype of a drone that is able to carry objects weighing up to 22 pounds (approximately 10kgs).
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot