అంతరిక్షంలో ఓ పువ్వు తొలిసారిగా విరబూసింది
అంతరిక్షంలో తొలిసారిగా ఓ పువ్వు విరబూసింది. ఆకాశంలో విరబూసిన తొలిపువ్వుగా జిన్నియా పువ్వు అరుదైన కీర్తిని సొంతం చేసుకుంది. ఎక్కడో కొన్ని వందల కిలో మీటర్ల దూరంలో ఉన్న అంతరిక్ష కేంద్రంలో ఈ పువ్వు తన అందాలను ఆరబోసింది. కేవలం లైట్ల వెలుగులో ఈ పువ్వు ఇలా విరబూసుకుని మన ముందుకు వచ్చి నిలుచుంది. దీనిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.
Read more: షాకింగ్ : గూగుల్‌ను అతిగా వాడితే ఆస్పత్రికే

జిన్నియా ఫ్లవర్ గా పిలుచుకునే ఈ పుష్పం
జిన్నియా ఫ్లవర్ గా పిలుచుకునే ఈ పుష్పం అలాంటిది ఇలాంటి కాదు. అంతరిక్షంలో విరబూిన మొట్ట మొదటి పువ్వు.

వందలమంది శాస్ర్తవేత్తలు..భూమ్మీద కొన్నేళ్
వందలమంది శాస్ర్తవేత్తలు..భూమ్మీద కొన్నేళ్లు,భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో దాదాపు ఆరు నెలల కష్టానికి ప్రతిఫలలంగా పుట్టిన పువ్విది.

ఈ ఫోటోను మహిళా శాస్ర్తవేత్త స్కాట్ కెల్లీ
ఈ ఫోటోను మహిళా శాస్ర్తవేత్త స్కాట్ కెల్లీ ఐఎస్‌ఎస్ నుంచి భూమి మీదకు ట్వీట్ చేశారు.

అంతరిక్ష కేంద్రంలో జిన్నియా విత్తనాలు నాటడం ద్వారా
అంతరిక్ష కేంద్రంలో జిన్నియా విత్తనాలు నాటడం ద్వారా శాఖాహార మొక్కల పెంపకం విధానానికి నాసా శ్రీకారం చుట్టింది.

ఈ ప్రయోగం సఫలమైతే భవిష్యత్ లో
ఈ ప్రయోగం సఫలమైతే భవిష్యత్ లో మరిన్ని పూల మొక్కలను, ఆ తర్వాత కాయగూరలను పెంచడానికి కూడా మార్గం సుగుమమవుతుందని నాసా భావిస్తోంది.

జినియాకు ఎరుపు,నీలి,ఎల్ ఈడీ లైట్లను ఎరువుగా
జినియాకు ఎరుపు,నీలి,ఎల్ ఈడీ లైట్లను ఎరువుగా వినియోగించారు. అన్నట్లు ఈ పుష్పాన్ని మనం కడుపారా ఆరగించవచ్చు. కూడా.

త్వరలో భూమి మీదకు ఈ పువ్వులు వచ్చే అవకాశం
సో త్వరలో భూమి మీదకు ఈ పువ్వులు వచ్చే అవకాశం కూడా ఉంది. మనం దీని రుచిని తొందర్లోనే ఆస్వాదించవచ్చు కూడా


Click it and Unblock the Notifications








