వ్యోమగాముల కోసం స్మార్ట్ వాచ్ యాప్

Written By:

అంతరిక్షంలో వ్యోమగాములకు ఇక టైం తెలుసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఎప్పడూ టైం వారి వెంటే ఉండేలా నాసా సరికొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ తయారు చేయాలని ప్రకటన కూడా విడుదల చేసింది. అది ఎలా ఉంటుంది.అసలు పని చేస్తుందా లేదా అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఆలస్యం చేయకుండా ఈ న్యూస్ చూసేయండి.

Read more:తప్పు ఎత్తి చూపిస్తే ఫేస్ బుక్ ఉద్యోగం పీకేసింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్ వాచ్ యాప్

అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తమ వ్యోమగాములకు స్మార్ట్ వాచ్ యాప్ లను తయారుచేయాలనుకుంటోంది. దీనిలో భాగంగా డెవలపర్లకు ఈ యాప్ ను తయారు చేసే అవకాశం కల్పించింది.

స్మార్ట్ వాచ్ యాప్

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పని చేస్తున్న వ్యోమగాములకు ఉపయుక్తంగా ఉండేలా ఈ యాప్ ఉండాలని ఔత్సాహిక డెవలపర్లకు నాసా సూచించింది.

స్మార్ట్ వాచ్ యాప్

ఈ మేరకు ఆస్ట్రేలియాకు చెందిన ఫ్రీలాన్సర్.కామ్ తో జతకట్టి యాప్ కోసం ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ యాప్ శ్యాంసంగ్ గేర్ 2 వాచ్ ను ప్రేరనగా తీసుకొని చేయాలని సూచించింది.

స్మార్ట్ వాచ్ యాప్

ఈ యాప్ ను ముందుగా రోబోనాట్ 2 పరిశీలిస్తుందని నాసా పేర్కొంది. ఈ రోబో వ్యోమగామి ప్రస్తుతం ఆర్బిటింగ్ లేబోరేటరీలో మానవ వ్యోమగాములకు సహాయపడుతోంది.

స్మార్ట్ వాచ్ యాప్

ఈ ప్రతిపాదిత వాచ్ ను క్రూ టైమ్ లైన్,కాషన్ అండ్ వార్నింగ్,కమ్యూనికేషన్స్ స్టేటస్,టైమర్స్ తదితర విభాగాల్లో వినియోగిస్తారు.

స్మార్ట్ వాచ్ యాప్

ఫ్రీలాన్సర్ సైట్లో సభ్యులకు యాప్ ను తయారు చేసే అవకాశం ఇచ్చింది. అయితే ఫ్రీ లాన్సర్ సైట్లో సభ్యులుగా 247 దేశాలకు చెందిన 1.6 కోట్ల మంది ఉన్నారు వీరంతా పాల్గొనే అవకాశం ఉంది.

స్మార్ట్ వాచ్ యాప్

నాసా ప్రతిపాదించిన వాచ్ ఇలా ఉండాలని సూచించింది.ఇది శ్యాసంగ్ గేర్ 2 స్మార్ట్ వాచీ 

స్మార్ట్ వాచ్ యాప్

ఇక వ్యోమగాములు ఈ స్మార్ట్ వాచ్ యాప్ తో భూమి మీద సందేశాలను అందుకోగలరు 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Smartwatch app developers could soon see their ideas taken literally out of this world, as NASA is looking for someone to design an app for astronauts to use then they are in space.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot