కొంచెం నీటితోనే స్నానం, 12 ఏళ్ల బాలిక సరికొత్త ప్రయోగం

Written By:

నీరు ఎంత విలువైందో మనందరికి తెలుసు. అయితే, మనలో ఎంత మంది నీటి పొదుపు గురించి ఆలోచిస్తున్నారు..? బూత్ రూమ్‌లలో నీటి వృథాను అరికట్టేందుకు ఓ 12 సంవత్సరాల బాలిక చేపట్టిన ప్రయోగం దేశానికే గర్వకారణంగా నిలిచింది. మహారాష్ట్రాలోని నాసిక్ రచన విద్యాలయంలో 6వ తరగతి చదువుతున్న సృష్టి నెర్కర్ నీటిని పొదుపు చేసే బాత్ షవర్‌ను రూపొందించి సోషల్ మీడియా సంచలనంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే...

యుటోపియా స్మార్ట్‌ఫోన్, నచ్చేవేంటి.. నచ్చనివేంటి?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నీటి ఆదా చేసే టెక్నిక్

కొంచం నీటితోనే స్నానం, 12 ఏళ్ల బాలిక సరికొత్త ప్రయోగం

సృష్టి నెర్కర్ తండ్రి నరేంద్ర నెర్కర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలోని ఎలక్ట్రానిక్ డిపార్ట్ మెంట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఒక రోజు తన తండ్రితో కలిసి కారు సర్వీసింగ్ సెంటర్‌కు వెళ్లిన సృష్టి అక్కడ అవాక్కయ్యే విషయాలను తెలుసుకుంది.

ప్రత్యేకమైన స్ప్రింకర్ల సహాయంతో

కొంచం నీటితోనే స్నానం, 12 ఏళ్ల బాలిక సరికొత్త ప్రయోగం

ప్రత్యేకమైన స్ప్రింకర్లను ఉపయోగించటం ద్వారా కేవలం రెండు లీటర్ల నీటితో కారును కడిగేయవచ్చని సదరు సర్వీసింగ్ సెంటర్ మెకానిక్ చెప్పిన మాటలు సృష్టి మనసులో బలంగా నాటుకుపోయాయి.

తండ్రి సహకారంతో

కొంచం నీటితోనే స్నానం, 12 ఏళ్ల బాలిక సరికొత్త ప్రయోగం

ఈ విధానాన్ని తమ ఇంట్లోని బాత్ షవర్‌కు ఉపయోగించటం ద్వారా నీటిని ఆదా చేయవచ్చని తెలుసుకున్న సృష్టి తండ్రి సహకారంతో ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్స్ పైపులు, పీవీసీ పైపులు, నాజిల్స్ సహాయంతో బాత్ షవర్‌ను రూపొందించింది. ఈ ప్రయోగం నాలుగు సార్లు విఫలమైనప్పటికి ఐదోసారి విజయం సాధించింది.

ప్రత్యేకమైన నాజిల్స్‌తో

కొంచం నీటితోనే స్నానం, 12 ఏళ్ల బాలిక సరికొత్త ప్రయోగం

ప్రత్యేకమైన నాజిల్స్‌తో రూపకల్పన చేయబడిన ఈ బాత్ షవర్ ద్వారా స్నానం చేసినట్లయితే దాదాపుగా 80శాతం వరకు నీటిని ఆదా చేయవచ్చు. ఉదాహరణకు, సాధారణ షవర్ కు 80 లీటర్ల నీరు అవసరమయితే, సృష్టి రూపొందించిన బాత్ షవర్ కు 15 లీటర్ల నీరు చాలు.

కలెక్టర్ ప్రత్యేక అభినందనలు

కొంచం నీటితోనే స్నానం, 12 ఏళ్ల బాలిక సరికొత్త ప్రయోగం

ఈ స్మార్ట్ షవర్ టెక్నాలజీని నాసిక్‌లో ఆచరణలోకి తీసుకువచ్చినట్లయితే 17 లక్షల జనాభాకు 34 రోజుల పాటు నీటిని సరఫరా చేయవచ్చు. సృష్టి నెర్కర్ ఆవిష్కరణ గురించి తెలుసుకున్న కలెక్టర్ దీపిందర్ సింగ్ ఆమెను తమ కార్యాలయానికి ఆహ్వానించి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రస్తుతం సృష్టి తన టెక్నాలజీకి పేటెంట్ హక్కును పొందేందుకు ప్రయత్నిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nasik teenager invents smart shower solutions to save water. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting