పెద్దన్న విశ్వరూపానికి అమాయకులు బలి

By Hazarath
|

మానవత్వం మరచిన పెద్దన్న సోమాలియా,యెమెన్,ఆప్ఘనిస్తాన్ లలో నిర్వహించిన డ్రోన్ దాడులు ఇప్పుడు బయటి ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత పదేళ్ల నుంచి అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో ఉగ్రవాదుల కన్నా ఎక్కువగా సాధారణ పౌరులే చనిపోయారన్నవాస్తవాలు ఇప్పుడు ప్రపంచ ప్రజల గుండెలను పిండేస్తున్నాయి. ఉగ్రవాదులను, టెర్రరిస్టులనే అంతం చేయడమే లక్ష్యంగా అమెరికా చేపట్టిన డ్రోన్ల దాడుల్లో ఏ పాపం తెలియని అమాయకులు,పాలబుగ్గల పసివాళ్లే ఎక్కువగా బలయ్యారని ఇంటర్ సెప్ట్ రిపోర్ట్ బయటపెట్టింది. ది డ్రోన్ పేపర్స్ గా బయటకు వచ్చిన ఈ కన్నీటి పేపర్లు అగ్రరాజ్యపు అరాచకానికి నిలువుటద్దంగా నిలుస్తున్నాయి. మిగతా కథనం స్లైడర్ లో

Read more: మూడు అగ్ర దేశాల మధ్య స్పేస్‌వార్‌‌కు తెర

డ్రోన్‌ ప్రయోగ వివరాల రహస్య పత్రాలు

డ్రోన్‌ ప్రయోగ వివరాల రహస్య పత్రాలు

సోమాలియా, యెమెన్‌, ఆఫ్ఘనిస్తాన్‌లలో అమెరికా నిర్వహించిన డ్రోన్‌ ప్రయోగ వివరాల రహస్య పత్రాలు బహిర్గతం అయ్యాయి. అనుమానితులను చంపడానికి ఎన్నుకున్న విధానాన్ని కూడా ఆ పత్రాలు బయటపెట్టాయి. ఈ రహస్య పత్రాలను, స్లైడ్స్‌ను, విజువల్స్‌ను, విశ్లేణషను 'ది డ్రోన్‌ పేపర్స్‌'గా ఓ ప్రజావేగు విడుదల చేశారు.

రహస్య టాస్క్‌ ఫోర్స్‌ 48-4 చేపట్టిన డ్రోన్‌ ప్రయోగం

రహస్య టాస్క్‌ ఫోర్స్‌ 48-4 చేపట్టిన డ్రోన్‌ ప్రయోగం

ఈ సమాచారంలో 2011-13 మధ్య సోమాలియా, యెమెన్‌లలో అమెరికా రక్షణ శాఖకు చెందిన రహస్య టాస్క్‌ ఫోర్స్‌ 48-4 చేపట్టిన డ్రోన్‌ ప్రయోగం వివరాలకు చెందిన రెండు సెట్ల స్లైడ్లు ఉన్నాయి. ఈ వివరాలను అమెరికా గూఢచారి వర్గాలకు చెందిన ఒకరు అందించారు. ప్రజావేగులపై అమెరికాలో జరుగుతున్న తీవ్రమైన నేర విచారణ వల్ల ఆ వ్యక్తి తన పేరు వెల్లడించడానికి ఇష్టపడలేదు.

అమెరికా డ్రోన్ల దాడిలో 90 శాతం సాధారణ ప్రజలే ..

అమెరికా డ్రోన్ల దాడిలో 90 శాతం సాధారణ ప్రజలే ..

అమెరికా ప్రభుత్వ అధికారుల ఆదేశాలతో చంపేవారి జాబితాను, హత్యకావింపబడినవారి వివరాలను తెలుసుకొనే హక్కు అమెరికా ప్రజలకుందని ఆయన అన్నారు. అమెరికా డ్రోన్ల దాడిలో 90 శాతం సాధారణ ప్రజలే కన్నుమూశారు. 8 సీరిస్ లుగా విడుదలైన ఈ డాక్యుమెంట్ లలో అమెరికా రహస్య ఆపరేషన్ కు సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి.

2012 జనవరి నుంచి 2013 ఫిబ్రవరి వరకు..

2012 జనవరి నుంచి 2013 ఫిబ్రవరి వరకు..

2012 జనవరి నుంచి 2013 ఫిబ్రవరి వరకు అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో 200 మంది పైగానే మరణించారు. ఇక 219 మంది పౌరులు వాయుదాడుల్లో మరణించారు.వారిలో 35 మందికి వాస్తవానికి అమెరికాకు టార్గెట్ కానే కాదు.ఈ వాస్తవాలు ఇప్పుడు షాక్ కు గురిచేస్తున్నాయి. 14 నెలల కాలంలో అమెరికా జరిపిన వాయు దాడుల్లో 219 మంది సాధారణ పౌరులు మరణించారని తెలియజేస్తూ ఓ చార్ట్ ను విడుదల చేసింది. ఈ డాక్యుమెంట్ ను అమెరికా గూఢచారి వర్గానికి చెందిన ఓ అధికారి బయటపెట్టాడు.

సెప్టెంబర్ 11 దాడుల తర్వాత

సెప్టెంబర్ 11 దాడుల తర్వాత

సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా ఈ చంపుడు కార్యక్రమం మొదలు పెట్టిందని ఆ నివేదిక బట్టబయలు చేసింది.ఆల్ ఖైదా తాలిబన్ల మీద ప్రతీకారం తీర్చుకునేందుకు అమెరికా డ్రోన్లతో దాడులకు పూనుకుంది. ఇందులో సాధారణ పౌరులు బలవుతన్నారని తెలిసినా ఉగ్రవాదులను అంతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగిందని నివేదిక తెలిపింది.

2004 నుండి పాక్ భూభాగంలోకి చొరబడి డ్రోన్ దాడులు

2004 నుండి పాక్ భూభాగంలోకి చొరబడి డ్రోన్ దాడులు

ఆల్-ఖైదా టెర్రరిస్టులను చంపే పేరుతో అమెరికా 2004 నుండి పాక్ భూభాగంలోకి చొరబడి డ్రోన్ దాడులు నిర్వహిస్తోంది. 2008-2010 కాలంలో సి.ఐ.ఏ తన డ్రోన్ దాడులు తీవ్రం చేసిందని ఈ కాలంలోనే అమాయక పౌరుల మరణాలు కూడా బాగా పెరిగాయని మరో నివేదిక ఎమర్శన్ తెలిపింది.

2009లో 54 డ్రోన్ దాడులు జరిగితే ..

2009లో 54 డ్రోన్ దాడులు జరిగితే ..

ఇక 2009లో 54 డ్రోన్ దాడులు జరిగితే 570 తీవ్రవాదులూ, 150 సామాన్య పౌరులూ మరణించారు. 2010లో ఈ డ్రోన్ దాడుల సంఖ్య 122కు పెరిగినా అందులో 900 తీవ్రవాదులూ, 74 మంది సాధారణ పౌరులు మాత్రమే మరణించారు.

2009ని డెడ్లియెస్ట్ ఇయర్‌గా చెప్పుకుంటారు

2009ని డెడ్లియెస్ట్ ఇయర్‌గా చెప్పుకుంటారు

కానీ అదే 2009లో తీవ్రవాదుల అత్మాహుతి దాడుల వలన చనిపోయిన సామాన్య పౌరుల సంఖ్య 1700 మంది, మరో 1600 మంది జాతుల మధ్య తలెత్తిన గొడవలు, టార్గెట్ కిల్లింగ్ మరియు మరికొన్ని కారణాల వలన చనిపోవడం జరిగింది. అందుకె 2009ని డెడ్లియెస్ట్ ఇయర్‌గా చెప్పుకుంటారు.

జరిగిన పొరపాట్లకు క్షమాపణకై ..

జరిగిన పొరపాట్లకు క్షమాపణకై ..

అమెరికా అధ్యక్షుడు ఒబామా శ్వేతసౌధంలో మాట్లాడుతూ గత జనవలో పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఆల్‌ఖైదా వ్యతిరేక డ్రోన్‌ విమానదాడుల్లో అమెరికన్‌ కాంట్రాక్టర్‌ వర్రెన్‌ వైన్‌స్టెయిన్‌తోపాటు ఇటలీదేశ గియోవార్ని లొపోటో (యుద్ధ బాధితులకు చికిత్స చేస్తున్న ఒక సాంఘిక కార్మికుడు) కూడా మరణించినట్లు తెలియచేస్తూ వీరివురి మృతికి సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తూ జరిగిన పొరపాట్లకు క్షమాపణకై వేడుకున్నారు.

అమెరికా డ్రోన్‌ యుద్ధాలపై సర్వత్రా నిరసన గళాలు

అమెరికా డ్రోన్‌ యుద్ధాలపై సర్వత్రా నిరసన గళాలు

ఈ సందర్భంగా అమెరికా ఇటలీ దేశ ప్రజలతోపాటు ప్రపంచంలోని దేశాలన్నీ, ముఖ్యంగా అమెరికా దాడులకు గురవుతున్న పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌, సిరియా, ఎమెన్‌, లిబియా, సొమాలియా దేశాలలో అనేకమంది అమాయక పౌరులు, మృతుల కుటుంబసభ్యులంతా తీవ్ర స్వరంతో అమెరికా డ్రోన్‌ యుద్ధాలపై సర్వత్రా నిరసన గళాలు వినిపిస్తున్నారు.

హత్యల పరంపరలో ప్రథమ నేరస్ధుడుగా..

హత్యల పరంపరలో ప్రథమ నేరస్ధుడుగా..

కేవలం అమెరికా, ఇటలీ కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పినంత మాత్రాన సరిపోదు. యుద్ధాల్లో మరణించిన కుటుంబ సబ్యులందరికీ క్షమాపణ చెప్పి నష్టపరిహారం ఇవ్వవలసిన బాధ్యత ఒబామాపై ఉంది. యూఎస్‌ కాంగ్రెస్‌ ప్రత్యేక ఆర్డరు ద్వారా అనుమతి పొందిన అమెరికా అధ్యక్షుడు మాత్రం ఈ హత్యల పరంపరలో ప్రథమ నేరస్ధుడుగా నిలిచిపోతాడు.

ప్రస్తుతం 500పైచిలుకు..

ప్రస్తుతం 500పైచిలుకు..

10సంవత్సరాల క్రితం అమెరికాలో పట్టుమని 50వరకు కూడాలేని డ్రోన్‌ విమానాలు ఆనూహ్యంగా ప్రస్తుతం 500పైచిలుకు చేరుకున్నాయి. రష్యా, చైనా, టర్కీలను మినహాయించగా ప్రస్తుతం ప్రపంచంలో 820వరకు డ్రోన్‌ విమానాలు యుద్ధ రంగంలో ఉన్నట్లు తెలుస్తోంది.

గంటకు 30,000 అమెరికా డాలర్లు ఖర్చు..

గంటకు 30,000 అమెరికా డాలర్లు ఖర్చు..

ఇజ్రాయిల్‌ 2010నుండి14 వరకు ప్రపంచమంతటా 165 డ్రోన్‌లను ఎగుమతి చేసి మొదటి స్థానంలో ఉండగా, అమెరికా 132తో రెండవ స్థానంలోనూ, ఇటలీ 32తో మూడవస్థానంలో ఉంది. గగనంలో డ్రోను విహరించుటకు గంటకు 30,000 అమెరికా డాలర్లు ఖర్చు అవుతుంది. కెప్టెన్‌, క్రూ (మానవ) రహిత యుద్ధవిమానాలు మూడురోజుల వరకు విరామం లేకుండా ఆకాశంలో తిరగగలవు.

డ్రోన్‌ విమానాలు రెండు రకాలు

డ్రోన్‌ విమానాలు రెండు రకాలు

డ్రోన్‌ విమానాలు రెండు రకాలు. 1) సర్వేలెన్స్‌ విమానాలు : ఇవి ఆకాశంలో తిరుగుతూ భూమిని అధునాతనమైన కెమేరాల ద్వారా పర్యవేక్షిస్తూ, నిఘాతో ఉపగ్రహాలకు సమాచారాన్ని అందిస్తుంటాయి. విమానాలను నడిపించే విధానం అంతా డాటా సెంటర్‌ దగ్గర భూమిమీద ఉన్న కెప్టెన్‌ ద్వారా రిమోట్‌ కంట్రోల్‌తో జరుగుతుంది.

2) యుద్ధ డ్రోన్‌ విమానాలు :

2) యుద్ధ డ్రోన్‌ విమానాలు :

ఇవి క్షిపణులను, బాంబులను కలిగిఉండి డాటా సెంటర్‌ కెప్టెన్‌ కంట్రోల్‌తో భూమిపై కావలసిన ప్రదేశాలలో క్షిపణులను, బాంబులను వేసి వాయుదాడులు చేస్తుంటాయి. తద్వారా శత్రుస్థావరాలను గురిచూసి నాశనం చేయగలవు. ఇవి గంటల తరబడి ఆకాశంలో విహరించగలవు. జిబిర్‌ అనే బ్రిటీష్‌ డ్రోన్‌ 82 గంటల వరకు ఆకాశంలో ఆగకుండా తిరిగి రికార్డు సృష్టించింది.

నెల్లిస్‌, క్రీచ్‌ వాయు స్థావరాలలో కంట్రోల్‌

నెల్లిస్‌, క్రీచ్‌ వాయు స్థావరాలలో కంట్రోల్‌

యూఎస్‌ రీపర్‌ అండ్‌ ప్రిడాటోర్‌ డ్రోన్‌లు భౌతికంగా ఆఫ్ఘన్‌, ఇరాక్‌లో తిరుగుతున్నా శాటిలైట్ల ద్వారా అమెరికాలోని లాస్‌వెగాస్‌, లివాడా దగ్గరలోని నెల్లిస్‌, క్రీచ్‌ వాయు స్థావరాలలో కంట్రోల్‌ చేయబడుతుంటాయి.

డ్రోన్‌ ఖరీదు 2కోట్ల 80 లక్షల డాలర్ల నుండి 7కోట్ల డాలర్ల వరకు

డ్రోన్‌ ఖరీదు 2కోట్ల 80 లక్షల డాలర్ల నుండి 7కోట్ల డాలర్ల వరకు

ఆయుధ డ్రోన్‌లు మొట్టమొదటిసారిగా యూరప్‌ బాల్కన్‌ వార్‌లో ఉపయోగించబడి ఆ తర్వాత అనూహ్యంగా ఇరాక్‌. సిరియా, ఎమెన్‌, సొమాలియా, సిఐఏ నిర్వహిస్తున్న పాకిస్తాన్‌లో దాడులు చేస్తున్నాయి. ఈ డ్రోన్‌ ఖరీదు 2కోట్ల 80 లక్షల డాలర్ల నుండి 7కోట్ల డాలర్ల వరకు ఉంటుంది.

ఆయుధాల కొరకు 3.50 లక్షల అమెరికన్‌ డాలర్ల వరకు ఖర్చు

ఆయుధాల కొరకు 3.50 లక్షల అమెరికన్‌ డాలర్ల వరకు ఖర్చు

దీనికితోడు ఒక్కొక్క డ్రోన్‌లో ఉపయోగించబడే క్షిపణులు ఆయుధాల కొరకు 3.50 లక్షల అమెరికన్‌ డాలర్ల వరకు ఖర్చు అవుతుంది.ఒక్క పాకిస్తాన్‌లోనే ఇప్పటివరకు 408 వాయుదాడులు నిర్వహించబడ్డాయి. ఈ దాడుల్లో 2700మంది ఉగ్రవాదులు, 1000మంది సామాన్య పౌరులు చనిపోయారని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ యొక్క అంచనా.

అమెరికా పైకి చెబుతున్న సంఖ్య కంటే 10 రెట్లు..

అమెరికా పైకి చెబుతున్న సంఖ్య కంటే 10 రెట్లు..

టెర్రరిస్టుల పేరు చెప్పి అమెరికా సాగిస్తున్న చట్ట విరుద్ధ డ్రోన్ దాడుల్లో వేలాది మంది పౌరులు మరణిస్తున్నారని ఐరాస ప్రత్యేక నివేదిక పేర్కొంది. అమెరికా పైకి చెబుతున్న సంఖ్య కంటే 10 రెట్లు అమాయక పౌరులు డ్రోన్ దాడుల్లో మరణిస్తున్నారని ఐరాస ప్రత్యేక ప్రతినిధి విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది.

బెన్ ఎమర్శన్ విడుదల చేసిన 24 పేజీల నివేదిక..

బెన్ ఎమర్శన్ విడుదల చేసిన 24 పేజీల నివేదిక..

ఐరాస నిర్వహిస్తున్న దర్యాప్తుకు కూడా అమెరికా సహకరించడం లేదని ఐరాస ప్రత్యేక ప్రతినిధి (special rapporteur) బెన్ ఎమర్శన్ విడుదల చేసిన 24 పేజీల నివేదిక తెలిపింది. బ్రిటన్ డ్రోన్ దాడుల్లోనూ అనేకమంది అమాయకులు మరణించారని నివేదిక తెలిపింది.

ప్రపంచ పోలీసును తానే అనుకునే అమెరికా..

ప్రపంచ పోలీసును తానే అనుకునే అమెరికా..

ఒబామా మానవత్వం లేకుండా అదే వ్యసనంతో ఉగ్రవాద ముసుగులో అమాయక ప్రాణాలను ఇంకా బలితీయడం విచారించదగ్గ విషయం. ప్రపంచ పోలీసును తానే అనుకునే అమెరికా ఆ ముసుగులో ప్రపంచమంతా ఇంకెన్ని హత్యలు చేస్తుందోనని నిరసన ప్రదర్శనలు వెలువెత్తున్నాయి.

డ్రోన్‌ దాడుల్లో సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోకూడదు..

డ్రోన్‌ దాడుల్లో సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోకూడదు..

2013లో ఒబామా నేషనల్‌ డిఫెన్స్‌ యూనివర్శిటీలో ప్రసంగిస్తూ ''డ్రోన్‌ దాడుల్లో సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోకూడదు. క్షతగాత్రులు కాకూడదు. ఇది మా లక్ష్యం'' అన్నారు. కాని ఆచరణలో మాత్రం అది కార్యరూపం దాల్చడం లేదు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu

Best Mobiles in India

English summary
Here Write Nearly 90 Percent Of People Killed In Recent Drone Strikes Were Not The Target

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X