చైనాతో యుద్ధంలో నెహ్రూ ఆందోళనకు కారణమేంటి, అమెరికాని ఏం కోరారు ?

|

అదొక మానని గాయం.. భారత సంగ్రామ చరిత్రలో అది ఓ మాయని మచ్చ. ఆ మాయని మచ్చను తలుచుకున్నప్పుడల్లా నిరంతరం రగులుతున్న అగ్ని జ్వాలలా ప్రతి భారతీయుని గుండెను అది అణుక్షణం అగ్గిలా దహిస్తూనే ఉంది.. స్వతంత్ర దేశంగా బలీయమైన కాంక్షగా ఎదుగుతున్న బారత్ ను ఒకే ఒక్క దెబ్బతో పాతాళానికి నెట్టిన సంధర్భం అది...అదే ఇండో చైనా వార్...1962లో జరిగిన ఈ యుద్ధాన్ని తలుచుకుంటే ప్రతి భారతీయుని గుండె ఇప్పడు కసి మీద రగిలిపోతూ ఉంటుంది.

చైనాకు దడ పుట్టిస్తున్న ఇండియా ఆయుధాలు

నెవిలీ మాక్స్‌వెల్‌ రాసిన ‘ఇండియాస్‌ చైనా వార్‌
 

నెవిలీ మాక్స్‌వెల్‌ రాసిన ‘ఇండియాస్‌ చైనా వార్‌

లండన్‌కు చెందిన దిటైమ్స్‌ పత్రిక దక్షిణాసియా విలేఖరిగా 1959నుంచి 1967 దాకా ఢిల్లీలో పనిచేసిన బ్రిటిష్‌ జర్నటిస్ట్‌ నెవిలీ మాక్స్‌వెల్‌ రాసిన ‘ఇండియాస్‌ చైనా వార్‌ ‘(భారతదేశపు చైనా యుద్ధం) 1970లో ప్రచురితమై చాలా సంచలనం సృష్టించింది. ఈ పుస్తకంలో ఈ యుధ్దం మీద కొన్ని ఆసక్తిక విషయాలు ఉన్నాయి.

భారత ప్రభుత్వమూ దుందుడుకుగా..

సరిహద్దు వివాదంలో భారత ప్రభుత్వం అనేక తప్పులు చేసిందని, భారత ప్రభుత్వమూ దుందుడుకుగా వ్యవహరించిందని, చైనా బాధితురాలని ఆయన పూర్తిగా భారత ఆధారాల పునాదిగానే రుజువు చేశారు. మొదట బ్రిటన్‌లో అచ్చయిన ఆ పుస్తకాన్ని భారతదేశంలో జైకో సంస్థ 1970 సెప్టెంబర్‌లో ప్రచురించింది. నవంబర్‌ కల్లా పునర్ముద్రణ అవసరమయింది. ఆ పుస్తకాన్ని భారత ప్రభుత్వం నిషేధించిందని అభిప్రాయం ఉంది గాని అది నిజం కాదని ఓ ఇంటర్వ్యూలో మాక్స్‌వెల్‌ అన్నారు.

ఔట్‌లుక్‌ పత్రికలో వచ్చిన ఇంటర్వ్యూలో ..

ఆ ఇంటర్వ్యూలో మాక్స్‌వెల్‌ భారత ప్రజలు ఇంతకాలంగా వింటున్న అబద్ధాల నుంచి బయట పడాలని, తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలెన్నో చెప్పారు. సరిహద్దు వివాదంలో భారత ప్రభుత్వ వైఖరి ఆమోదయోగ్యంగా లేదని నెహ్రూ సన్నిహిత మిత్రుడు,1953లో ఏర్పడిన భారత్‌-చైనా మిత్రమండలి తొలి అధ్యక్షుడు పండిట్‌ సుందర్‌లాల్‌ కూడా అప్పుడే రాశారు.

‘ఇండియా-చైనా బౌండరీ ప్రాబ్లమ్‌..
 

‘ఇండియా-చైనా బౌండరీ ప్రాబ్లమ్‌..

ఆ కాలపు అధికారిక, అనధికారిక పత్రాల మీద సాధికారికమైన, సుదీర్ఘమైన పరిశోధన జరిపిన చరిత్రకారుడు, సుప్రీం కోర్టు న్యాయవాది ఎజి సూరాని 2011లో ప్రచురించిన ‘ఇండియా-చైనా బౌండరీ ప్రాబ్లమ్‌ 1846-1947లో కూడా సరిహద్దు వివాదంలో భారత ప్రభుత్వం అనుసరించిన వైఖరి ఎంత అనుచితమో, అచారిత్రకమో రుజువు చేశారు.

ఈ వివాదంలో భారత ప్రభుత్వపు అపసవ్యపు మొండి వైఖరిని..

చైనా అధికారిక పుస్తకాలు, చైనా రచయితలు, చైనా అనుకూల రయితలు మాత్రమే కాదు, దేశాలలోని స్వతంత్ర పరిశోధకులెందరో ఈ వివాదంలో భారత ప్రభుత్వపు అపసవ్యపు మొండి వైఖరిని సాక్ష్యాధారాలతో ఎత్తిచూపారు.

చైనాతో యుద్ధం సమయంలో అమెరికా సహాయాన్ని కోరారని..

అయితే ఇదే కథనం మరోలా ఉంది. దేశ ప్రధమ ప్రధాని నెహ్రూ 1962లో చైనాతో యుద్ధం సమయంలో అమెరికా సహాయాన్ని కోరారని సీఐఏ మాజీ అధికారి ఒకరు వెల్లడించారు.

చైనా సైన్యాన్ని ఎదుర్కునేందుకు యుద్ధ విమానాలను పంపాల్సిందిగా ..

చైనా సైన్యాన్ని ఎదుర్కునేందుకు యుద్ధ విమానాలను పంపాల్సిందిగా అప్పటి యూఎస్ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీకి లేఖ రాశారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన విషయాలను సీఐఏ మాజీ అధికారి బ్రూస్ రీడెల్ తన సినో జెఎఫ్ కే ఫర్ గాటన్ క్రైసిస్ : టిబెట్ ది సీఐఏ అండ సినో ఇండియన్ వార్ పుస్తకంలో వెల్లడించారు.

నెహ్రూ ఎదుగుదలను అడ్డుకోవడానికే 1962లో సెప్టెంబర్ లో మావో...

తృతీయ ప్రపంచ దేశాల్లో తిరుగులేని దేశంగా నెహ్రూ ఎదుగుదలను అడ్డుకోవడానికే 1962లో సెప్టెంబర్ లో మావో ఆ యుధ్దానికి పూనుకున్నాడని బ్రూస్ పేర్కొన్నారు. యుద్ధంలో భారత్ భారీగా భూభాగాలను, సైనికులు కోల్పోతుండటంతో నెహ్రూ ఆందోళనతో కెన్నడీకి రెండు లేఖలు రాశారు.యుద్ధంలో సాయం చేయాలని 12 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలను,రవాణా విమానాలను పంపాలని కోరారు.

350 యుద్ధ విమానాలు,10 వేల మంది సైనికులు సిబ్బందిని ..

దాదాపు 350 యుద్ధ విమానాలు,10 వేల మంది సైనికులు సిబ్బందిని పంపాలన్నారు.బాంబర్లను పాక్ పై వేయబోమని హామీ ఇచ్చారు. ఈ లేఖను అమెరికాలోని అప్పటి భారత రాయబారి నేరుగా కెన్నడీకి అందజేశారు. బ్రిటన్ ప్రధానికి కూడా ఇదే తరహాలో నెహ్రూ లేఖ రాశారు.

నెహ్రూకి కెన్నడీ సానుకూలంగా స్పందించి..

నెహ్రూకి కెన్నడీ సానుకూలంగా స్పందించి యుద్ధానికి సన్నధ్దమయ్యారు. కాని అమెరికా తగిన చర్యలు చేపట్టేలోపే చైనా ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించి యుద్ధాన్ని నిలిపివేసింది. అని బ్రూస్ తన పుస్తకంలో పేర్కొన్నారు.భారత ఈశాన్య ప్రాంతంలోని చాలా భూభాగంలోకి కోలకత్తా వరకూ చొచ్చుకువచ్చిన చైనా అమెరికా బ్రిటన్ లు యుద్దంలోకి దిగుతున్నాయన్న భయంతోనే ఒక్కసారిగా వెనక్కి తగ్గిందన్నారు. ఈ పుస్తకం నవంబర్ లో మార్కెట్లోకి రానుంది.

ఆయనను అవమానించాలనే ఉద్దేశంతోనే ..

మరొక వాదన ప్రకారం మూడో ప్రపంచదేశాల నాయకుడిగా భారత ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రూ ఎదుగుతుండటంతో ఆయనను అవమానించాలనే ఉద్దేశంతోనే అప్పటి చైనా పాలకుడు, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపకుడు మావో జెడాంగ్ 1962లో యుద్ధానికి దిగారు.

చైనా దురాక్రమణను తరిమికొట్టేందుకు..

ఆనాటి చైనా దురాక్రమణను తరిమికొట్టేందుకు నెహ్రూ అమెరికా సాయాన్ని కోరారు. చైనాను ఎదుర్కొనేందుకు ఫైటర్ జెట్ విమానాలు సమకూర్చాలని అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీకి లేఖ కూడా రాశారు. ఇలా ఆనాటి భారత్-చైనా యుద్ధానికి సంబంధించిన ఎన్నో అంశాలతో ఓ కొత్త పుస్తకం విడుదలైంది. 'జేఎఫ్కేస్ ఫార్గాటెన్ క్రైసిస్: టిబెట్, ద సీఐఏ అండ్ సినో-ఇండియన్ వార్' పేరిట సీఐఏ మాజీ అధికారి బ్రూస్ రీడెల్ ఈ పుస్తకాన్ని రాశారు.

మావో దృష్టి అంతా నెహ్రూపైనే..

మావో దృష్టి అంతా నెహ్రూపైనే. అయినా భారత్ను ఓడించడమంటే మావో శత్రువులైన నికిటా క్రృచ్చెవ్, కెన్నడీకి ఎదురుదెబ్బే' అని ఆయన ఈ పుస్తకంలో రాశారు. యుద్ధంలో భారత భూభాగం చైనా ఆధీనంలోకి వెళుతుండటం, పెద్దసంఖ్యలో తమ సైనికులు చనిపోతుండటంతో 1962 నవంబర్లో నెహ్రూ, కెన్నడీకి లేఖ రాశారు.

ప్పటికి దశాబ్దం కిందటే కొరియా విషయమై అమెరికా బలగాలు..

చైనా దురాక్రమణను ఎదుర్కోవడానికి గగనతల రవాణా, ఫైటర్ జెట్ విమానాలు కావాలని కోరారు. పీపుల్ లిబెరేషన్ ఆర్మీ'ని ఓడించడానికి చైనాకు వ్యతిరేకంగా గగనతల యుద్ధంలో పాల్గొనాల్సిందిగా నెహ్రూ కెన్నడీని కోరారు. ఇది చాలా పెద్ద అభ్యర్థన. అప్పటికి దశాబ్దం కిందటే కొరియా విషయమై అమెరికా బలగాలు, చైనా బలగాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి.

చైనాకు వ్యతిరేకంగా కొత్త యుద్ధం చేయాల్సిందిగా ..

ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు చైనాకు వ్యతిరేకంగా కొత్త యుద్ధం చేయాల్సిందిగా భారత్ కెన్నడీని కోరింది' అని ఆయన పుస్తకంలో తెలిపారు. అమెరికా వాయుసేనకు చెందిన 12 స్కాడ్రన్లను తమకు పంపాల్సిందిగా అడిగిందని ఆయన పేర్కొన్నారు.ఈ విషయంపై హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ చరిత్ర, రాజనీతిశాస్త్ర ఆచార్యులు రొడెరిక్‌ మాక్ఫార్ఖ్‌హర్‌ అంతర్జాతీయంగా ప్రసిద్ధుడైన చైనా వ్యవహారాల సాధికార అధ్యయనవేత్త కొన్ని నిజాలను బయటకు తెచ్చారు.

మావోస్‌ ఇండియా వార్‌'

1960వ దశకంలో చైనాను కుదిపివేసిన సాంస్కృతిక విప్లవం మూలాలపై మూడుదశాబ్దాల క్రితం ఆయన మూడు సంపుటాల గ్రంధమెకటి రచించారు. అందులో ఒక అధ్యాయం ‘మావోస్‌ ఇండియా వార్‌'. ప్రకరణం శీర్షికే వాస్తవాన్ని సూచించడం లేదూ! భారత్‌ ఏ తప్పులు చేసి పరాజయం పాలయిందో ఆయన సూటిగా, స్పష్టంగా చెప్పారు. అయితే హిమాలయ పర్వతాలపై జరిగిన ఆ క్రూర యుద్ధం ‘భారతదేశపు చైనా యుద్ధం' అన్న నెవిల్లె మ్యాక్స్‌వెల్‌ వక్ర వాదనను ఈ గౌరవనీయ హార్వర్డ్‌ ఆచార్యులు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.

చైనా ఇండియా మధ్య శిఖారగ్ర సమావేశాలు జరుగుతున్నప్పుడు..

ఆయన ఈ విషయం చెప్పడానికి కూడా బలమైన కారణం లేకపోలేదు.అప్పుడు చైనా ఇండియా మధ్య శిఖారగ్ర సమావేశాలు జరుగుతున్నప్పుడు చైనా సైన్యం భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. అహ్మదాబాద్‌లో సబర్మతి నదీతీరాన నరేంద్ర మోదీ ఆతిథ్యపు మధురిమలను జిన్‌పింగ్‌ ఆస్వాదిస్తున్న సమయంలోనే చైనా సైనికదళాలు మన భూభాగాల్లోకి చొరబడ్డాయి!

దాదాపు 1,000 మంది చైనా సైనికులు మన గడ్డపైకి ..

లద్దాఖ్‌లోని చుమార్‌ ప్రాంతంలో చైనా సేనలు వాస్తవాధీన రేఖను ఉల్లంఘించాయి. దాదాపు 1,000 మంది చైనా సైనికులు మన గడ్డపైకి వచ్చారు. ఆ చొరబాటుదారులను తరిమికొట్టడానికి 1,500 మంది భారతీయ సైనికులను పంపించాలని ప్రధాని మోదీ ఆదేశించారు. కాగా, చైనా సైనికాధికారులు కొంతమంది సొంతంగా తీసుకున్న నిర్ణయం ఫలితంగానే ఈ చొరబాటు సంఘటన చోటుచేసుకుందని మన దేశీయులలో కొందరు విశ్వసిస్తున్నారు.

పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ- పై పూర్తి పట్టున్న నాయకుడు..

ఈ అభిప్రాయంలో వాస్తవాలు అంతంత మాత్రమే. చైనాలో డెన్‌ జియావో పింగ్‌ అనంతరం అత్యంత శక్తిమంతమైన చైనా అధ్య క్షుడు అయిన జిన్‌పింగ్‌ చైనా సైన్యం-పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ- పై పూర్తి పట్టున్న నాయకుడు.చైనా కమ్యూనిస్టు పార్టీ, చైనా ప్రభుత్వ సైనిక వ్యవహారాల కమిషన్లు రెండిటికీ ఆయనే చైర్మన్‌.

ఆయనకు తెలియకుండా చైనా సైన్యం..

అలాంటప్పుడు ఆయనకు తెలియకుండా చైనా సైన్యం భారతభూభాగంలోకి ఎలా చొచ్చుకొస్తుంది అన్నదే మనముందున్న ప్రశ్న. ప్రధాని మోదీ అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఈ చొరబాటు అంశాన్ని బహిరంగంగానే ప్రస్తావించారు. చైనా అధ్యక్షుడితో కలిసి పాల్గొన్న విలేఖర్ల సమావేశంలో ‘సరిహద్దు వివాదం'కు సత్వర పరిష్కారాన్ని కనుగొనాలని మోదీ డిమాండ్‌ చేశారు.

చుమార్‌ ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు..

చుమార్‌ ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు వాస్తవాధీన రేఖను స్పష్టంగా గుర్తించాలనీ ఆయన డిమాండ్‌ చేశారు. అయితే ఈ డిమాండ్లకు జిన్‌పింగ్‌ వెంటనే ప్రతిస్పందించలేదు. ఆ తరువాత ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ వరల్డ్‌ ఎఫైర్స్‌ సమావేశంలో ప్రసంగిస్తూ సంప్రదాయ చైనా వైఖరినే పునరుద్ఘాటించారు.

వలసపాకుల నుంచి సంక్రమించిన సమస్య..

సరిహద్దు వివాదం వలసపాకుల నుంచి సంక్రమించిన సమస్య అని ఆయన పేర్కొన్నారు. వాస్తవాధీనరేఖ విషయమై చైనా, భారత్‌లు భిన్న అభిప్రాయాలతో ఉన్నందున అనివార్యంగా సంభవిస్తున్న సంఘర్షణలను రెండు దేశాలూ సంయమనంతో పరిష్కరించుకోగలవని జిన్‌పింగ్‌ అన్నారు. ఈ విశ్లేషణను మాక్ఫార్ఖ్‌హర్‌ ధ్రువీకరించారు.

చైనా సైన్యం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోనే పనిచేస్తుందని..

చైనా సైన్యం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోనే పనిచేస్తుందని జిన్‌పింగ్‌ పదేపదే నొక్కి చెబుతుంటారని ఆయన పేర్కొన్నారు. సరిహద్దు వివాదం పరిష్కారంలో భారత్‌కు చైనా ఎలాంటి రాయితీలు ఇవ్వబోదని హార్వర్డ్‌ ఆచార్యులు స్పష్టంచేశారు. ఎందుకంటే జిన్‌పింగ్‌ చైనా ప్రజా బాహుళ్యంలో తనను తాను శక్తిమంతమైన జాతీయవాద నాయకుడుగా పేరుపడిన నాయకుడని ఆయన తెలిపారు.

మోడీకి ఈ సంధర్భంలో జిన్ పింగ్ ఓ విషయాన్ని..

మోడీకి ఈ సంధర్భంలో జిన్ పింగ్ ఓ విషయాన్ని చెప్పారు. మీరు శక్తిమంతమైన నాయకులే కావచ్చు, అయితే నేను మీకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. సరిహద్దు ప్రాంతాల్లో మాదే పైచేయి. ఈ ప్రయోజనాన్ని మేము పూర్తిగా వినియోగించుకుంటాము అని అన్నారు.

భారత్‌ను తనతో సమానస్థాయి దేశంగా చైనా పరిగణించడం లేదన్నదే ..

అంటే భారత్‌ను తనతో సమానస్థాయి దేశంగా చైనా పరిగణించడం లేదన్నదే వాస్తవం. అంతేకాదు ఆర్థిక శక్తి, సైనిక పాటవంలో భారత్‌ కంటే తాము చాలా ఆధికత్యతో ఉన్నా మనే విషయమై చైనా నాయకులు, ప్రజలూ చాలా గర్విస్తున్నారు.ఈ పరిణామంతో సరిహద్దు వివాదంపై భారత్‌, చైనాల మధ్య ఒక ఒప్పందం కుదిరే అవకాశాలు లేవని మాక్ఫార్ఖ్‌హర్‌ అభిప్రాయపడ్డారు. సరిహద్దు విషయంలో భారత్‌కు ఎలాంటి రాయితీలు ఇవ్వడానికీ చైనా సిద్ధంగా లేదు.

చౌ ఎన్‌లై చేసిన ప్రతిపాదన తమకు ఇంకెంత మాత్రం ఆమోదయోగ్యం కాదని..

అంతేకాక దశాబ్దాల క్రితం నెహ్రూకు చౌ ఎన్‌లై చేసిన ప్రతిపాదన తమకు ఇంకెంత మాత్రం ఆమోదయోగ్యం కాదని కూడా చైనా ఇప్పటికే సూచించింది. లద్దాఖ్‌లోని అక్సాయ్‌చిన్‌ను చైనాకు వదిలివేస్తే ఈశాన్య ప్రాంతంలో మెక్‌ మహాన్‌ రేఖను సరిహద్దుగా గుర్తిస్తామని 1960లో నెహ్రూకు చౌ ఎన్‌ లై ప్రతిపాదించిన విషయం విదితమే.

ఇప్పుడు అరుణాచల్‌ప్రదేశ్‌ మొత్తం తమదే అని వాదించడంతో పాటు ..

ఇప్పుడు అరుణాచల్‌ప్రదేశ్‌ మొత్తం తమదే అని వాదించడంతో పాటు అందులోని తవాంగ్‌ ప్రాంతాన్ని తమకు ఇచ్చివేయాలని చైనా డిమాండ్‌ చేస్తోంది. భారత్‌ ఈ డిమాండ్‌ను అంగీకరించే ప్రసక్తే లేదు. వాస్తవాధీనరేఖపై స్పష్టతకు రావడానికి చైనా సహకరిస్తుందనుకోవడం వాస్తవిక దృక్పథం కాబోదు. ప్రస్తుత అమోమయ పరిస్థితులు కొనసాగడమే తమ ప్రయోజనాలకు మంచిదని బీజింగ్‌ పాలకులు భావిస్తున్నారు.

నెహ్రూ 1962లో అత్యంత బలహీనమైన యుద్ధనేతగా..

నెహ్రూ 1962లో అత్యంత బలహీనమైన యుద్ధనేతగా తనను తాను నిరూపించుకున్నారని కొందరు చెబుతుంటారు.కాని1940లో డున్‌కిర్క్ పరాజయం సమయంలో బ్రిటన్ సైన్యం తుడిచిపెట్టుకొని పోవడమే కాదు, తనకు సహచర దేశమంటూ లేక ఆ దేశం ఒంటరిగా మిగిలిపోయింది. అంతటి విషమ పరిస్థితుల్లోనూ నాటి బ్రిటన్ ప్రధాని ఏమాత్రం చలించలేదు.

1962 నవంబర్ నాటికి భారత సైన్యం ఏవిధంగాను దెబ్బతినలేదు.

అయితే 1962 నవంబర్ నాటికి భారత సైన్యం ఏవిధంగాను దెబ్బతినలేదు. అమెరికా, మనదేశానికి మద్దతునిచ్చింది. అయినప్పటికీ నెహ్రూ రేడియోలో ప్రసంగిస్తూ...నా హృదయం అస్సాం ప్రజలకోసం క్షోభిస్తోందంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. చైనీయులు ఏకపక్షంగా ప్రకటించిన కాల్పుల విరమణను అవమానకరమైన రీతిలో నెహ్రూ అంగీకరించారు.

బ్రిగేడియర్ పి.ఎస్. భగత్‌లతో కూడిన ఒక కమిటీని.

అతి ఘోరమైన ఈ పరాజయానికి కారణాలు తెలుసుకునేందుకు వీలుగా విచారణ జరిపేందుకు లెప్ట్‌నెంట్ జనరల్ హెండర్‌సన్ బ్రూక్స్, బ్రిగేడియర్ పి.ఎస్. భగత్‌లతో కూడిన ఒక కమిటీని నియమించారు. వారు సమర్పించిన అతి రహస్యమైన నివేదికను గత అరవయ్యేళ్ళుగా ప్రభుత్వం బయటపెట్టలేదు. ఈ నివేదికలోని వివరాలు లీకయ్యా యి.

ఎన్నికల జ్వరం తీవ్రస్థాయిలో ఉన్న తరుణంలో ..

అంతేకాకుండా నెవిల్లె మాక్స్‌వెల్ రాసిన ఇండియా చైనా వార్ పుస్తకం 1970ల్లోనే ప్రచురితమైంది. అయితే ప్రస్తుతం ఈ రచయిత ఇంటర్నెట్ సహాయంతో నివేదికలోని కొన్ని భాగాలను డౌన్‌లోడ్ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా భారత్‌లో ఎన్నికల జ్వరం తీవ్రస్థాయిలో ఉన్న తరుణంలో ఈ నివేదికలోని వివరాలు బహిర్గతం కావడం గమనార్హం. అయితే మన దేశంలోని రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని ఎన్నికల్లో ప్రధానాంశంగా చేయకుండా ఎంతో పరిణితిని ప్రదర్శించాయనే చెప్పాలి.

భారత సైనిక చరిత్రలో ఇంతటి ఘోర పరాజయానికి..

భారత సైనిక చరిత్రలో ఇంతటి ఘోర పరాజయానికి సంబంధించిన కారణాలు అందరికీ బాగా తెలిసినవే. రక్షణ పరంగా సన్నద్ధత లేకపోవడం, రాజకీయ, సైనిక నాయకత్వం కుప్పకూలిపోవడం, నిర్ణయాలు తీసుకునే సమయంలో సైన్యాన్ని పక్కన పెట్టడం ఇవన్నీ కూడా పరాజయ హేతువులే. అంతేకాదు సైనికాధికారులలో చురుకుదనం పాలు లేకపోవడం, విదేశీ, రక్షణ విధానాలను అనుసంధానించకపోవడం కూడా లోపమే.

హిమాలయాల్లో చైనానుంచి పొంచి ఉన్న ప్రమాదం

హిమాలయాల్లో చైనానుంచి పొంచి ఉన్న ప్రమాదం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. మరోమాటలో చెప్పాలంటే రాబోయే కాలంలో ఇది మరింతగా పెరగవచ్చు కూడా. అయినప్పటికీ 1962నాటి తప్పిదాల నుంచి మనం నేర్చుకున్నది ఏదీ లేదనే జరిగిన,జరుగుతున్న సంఘనలు స్పష్టం చేస్తున్నాయి. ఆధునిక ఆయుధాల సేకరణ కార్యక్రమం క్షమించరానంత నిదానంగా కొనసాగుతోంది. కాంగ్రెస్ హయాంలో ఇది మరింతగా దిగజారిందనే చెప్పాలి. ఆనాటి రక్షణ మంత్రి ఆంటోని ఈ విషయంలో ఘోరవైఫల్యం చెందాడనే చెప్పాలి. మరి ఇప్పుడున్న మోడీ ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు దూసుకుపోతుందని ఆశిద్దాం.

Most Read Articles
Best Mobiles in India

English summary
Here Write Nehru appeals For US jet fighters help in china war

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more