భారత్‌లో Netflix సర్వీసులు ప్రారంభం, మొదటి నెల ఉచితం

By Sivanjaneyulu
|

ప్రపంచపు అతిపెద్ద వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ Netflix భారత్‌లో తమ సేవలను ప్రారంభించింది. బుధవారం అర్థరాత్రి నుంచి ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ వీడియో స్ట్రీమింగ్ సేవలను ఇండియన్ యూజర్లు లాంచ్ తేదీ నుంచి మొదటి నెల రోజుల పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఆ తరువాతి నుంచి నెలవారీ చందా చెల్లించవల్సి ఉంటుంది.

లెనోవో కే4 నోట్ ఎందుకంత బెస్ట్..?

 భారత్‌లో Netflix సర్వీసులు ప్రారంభం, మొదటి నెల ఉచితం

నెట్‌ఫ్లిక్స్ తన ఇంటర్నెట్ టీవీ నెట్‌వర్క్‌ను ప్రపంచవ్యాప్తంగా భారత్‌తో పాటు 130 కొత్ద దేశాల్లో ప్రారంభించటం విశేషం. 2007లో ప్రారంభమైన నెట్‌ఫ్లిక్స్ వీడియో స్ట్రీమింగ్ సర్వీసులు తొలత కెనడాలో మాత్రమే అందుబాటులో ఉండేవి. ఆ తరువాత లాటిన్ అమెరికా, యూరోప్ , ఆస్ట్రేలియా, న్యూజీల్యాండ్, జపాప్‌తో పాటు 60 దేశాలకు విస్తరించాయి. నెట్‌ఫ్లిక్స్ సర్వీస్ ద్వారా ఇండియన్ యూజర్లు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే సినిమాలతో పాటు టీవీ షోలనో వీక్షించవచ్చు. నెట్‌ఫ్లిక్స్ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు....

భారత్‌లో Netflix సర్వీసులు ప్రారంభం, మొదటి నెల ఉచితం

భారత్‌లో Netflix సర్వీసులు ప్రారంభం, మొదటి నెల ఉచితం

భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఈ సంస్థ సహ వ్యవస్థపాకులు ఇంకా చీఫ్ ఎగ్జిక్యూటివ్ రీడ్ హాస్టింగ్స్ సీఈఎస్ 2016లో ప్రకటించారు.

భారత్‌లో Netflix సర్వీసులు ప్రారంభం, మొదటి నెల ఉచితం

భారత్‌లో Netflix సర్వీసులు ప్రారంభం, మొదటి నెల ఉచితం

నెట్‌ఫ్లిక్స్ సేవలు ఇండియన్ యూజర్లకు బేసిక్, స్టాండర్డ్, ప్రీమియమ్ ప్యాకేజీలలో అందుబాటులో ఉన్నాయి. బేసిక్ ప్లాన్ ధర రూ.500. స్టాండర్డ్ ప్లాన్ ధర రూ.650, ప్రీమియమ్ ప్లాన్ ధర రూ.800.

భారత్‌లో Netflix సర్వీసులు ప్రారంభం, మొదటి నెల ఉచితం

భారత్‌లో Netflix సర్వీసులు ప్రారంభం, మొదటి నెల ఉచితం

నెట్‌ఫ్లిక్స్ సేవలను ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులో ఉన్న ఏ డివైస్ లోనైనా ఉపయోగించుకోవచ్చు.

భారత్‌లో Netflix సర్వీసులు ప్రారంభం, మొదటి నెల ఉచితం

భారత్‌లో Netflix సర్వీసులు ప్రారంభం, మొదటి నెల ఉచితం

నెట్‌ఫ్లిక్స్ సేవలను మీ కంప్యూటర్ సపోర్ట్ చేయాలంటే ఇంటర్నెట్ స్పీడ్ కనీసం 512కేబీపీఎస్ గా ఉండాలి.

భారత్‌లో Netflix సర్వీసులు ప్రారంభం, మొదటి నెల ఉచితం

భారత్‌లో Netflix సర్వీసులు ప్రారంభం, మొదటి నెల ఉచితం

చైనాలో ఇప్పటి వరకు నెట్‌ఫ్లిక్స్ సేవలు ప్రారంభం కాలేదు. అమెరికా కంపెనీ యూఎస్ ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ తమ సేవలను క్రిమియా, ఉత్తర కొరియా, సిరియా దేశాల్లో విడుదల చేయలేకపోయింది.

Best Mobiles in India

English summary
Netflix now live in India with first month free offer and plans starting from Rs 500. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X