హై ఫైవ్ సెల్ఫీ..ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తోంది

Written By:

సెల్ఫీ...స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ దిగేస్తుంటారు. ఢిఫరెంట్ గా దిగాలని తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పటికే రకరకాల సెల్ఫీలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఎన్ని రకాల సెల్ఫీలు వచ్చినా కాని ఇంకా కొత్తగా ఏమి వస్తుందా అని చాలామంది ఎదురుచూస్తుంటారు.అయితే అలాంటి వారి కోసం ఇప్పుడు మార్కెట్లోకి హై ఫైవ్ పేరుతో ఓ కొత్త సెల్ఫీ నడుస్తోంది. ప్రపంచాన్ని ఊపేస్తోంది.

ఆపిల్ నుంచి త్వరలో మడతపెట్టే ఫోన్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సెల్ఫీ కోసం క్లిక్‌మనిపిస్తూనే

మీ దగ్గర స్మార్ట్‌ఫోన్ ఉందా...అయితే ముందు కెమెరా ఆన్ చేయండి. సెల్ఫీ కోసం క్లిక్‌మనిపిస్తూనే ఫోన్‌ని పైకి ఎగరేయండి. అలా ఎగరేస్తేనే హై ఫైవ్ సెల్ఫీ వస్తుంది మరి.

ఫోన్ గాల్లోంచి కింద పడేలోపే

ఆ ఫోన్ గాల్లోంచి కింద పడేలోపే మీరు రెండు చేతులతో చప్పట్లు కొట్టాలి. ఆ దృశ్యం ఫోన్ కెమెరాతో షూట్ కావాలి. అది ఫర్పెక్ట్ గా వస్తే అది హై ఫైవ్ సెల్ఫీ అన్నమాట

 

ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఇదే

మరి ఫోన్ మీ చేతిలో నుంచి మిస్ అయితే ఇక అంతే సంగతులు..సో జాగ్రత్తగా మీరు డీల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఇదే మరి.

హై-ఫైవ్ సెల్ఫీ

హై-ఫైవ్ సెల్ఫీ' పేరుతో ఇప్పుడు ఈ సెల్ఫీ వైరల్ గా అలాగే వైరస్ గా మారి ప్రపంచాన్ని చుట్టి పడేస్తోంది. ఐస్ బకెట్ చాలెంజ్ కన్నా ఇదే ఇప్పుడు పాపులర్ అయింది.

రెండులక్షల మంది రీట్వీట్

సేత్ స్నీడర్ అనే ఓ కుర్రాడు ఇలాంటి పర్ఫెక్ట్ సెల్ఫీ పెడితే రెండులక్షల మంది రీట్వీట్ చేశారు. 4 లక్షల 40 వేలమంది దాన్ని లైక్ చేశారు. ఈ లెక్కలు చూస్తేనే అర్థమవుతోందిగా. ఇదెంత జోరు మీదుందో!

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
ew 'high five selfie' craze puts people at risk of breaking their phones read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot