అలజడి రేపిన ఐఫోన్ 6 పేలుడు!

Posted By:

ఫోన్‌లు పేలుతున్నాయనే వార్తలు ఇటీవల కాలంల బెంబేలెత్తిస్తోన్న నేపథ్యంలో మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. కానీ ఈ సారి పేలింది అత్యం ఖరీదైన యాపిల్ ఐఫోన్. ఈ ఘటనలో ఓ యువ వ్యాపారవేత్త పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. సోషల్ మీడియాలో సంచలనం రేపుతోన్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలించినట్లయితే...

కిషన్ యాదవ్ అనే వ్యక్తి రెండు రోజుల క్రితమే ఐఫోన్ 6ను కొనుగోలు చేసాడు. మచ్చడపడి కొనుగోలు చేసిన తన ఐఫోన్‌‍లో మాట్లాడుతుండగా ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఇది గమనించిన అతడు ఫోన్‌ను దూరంగా విసిరేసాడు. కొద్ది సెకన్ల వ్యవధిలోనే ఆ ఫోన్ పేలిపోయింది.

Read More: మీ ఫోన్ పేలకుండా ఉండాలంటే..?

ఈ ఘటన పై ఫిర్యాదు చేసిన కిషన్ యాదవ్.. పేలిపోయిన ఫోన్‌ను ఐఫోన్ కస్టమర్ కేర్ సెంటర్‌కు అప్పగించాడు. భారత్‌లో ఐఫోన్ పేలిన ఘటనపై తయారీదారు ఆపిల్ స్పందించినట్లు తెలిసింది. ఫిర్యాదును పరిశీలిస్తామని కంపెనీ అధికారి ఒకరు తెలిపినట్లు సమాచారం. అత్యున్నత ప్రమాణాలతో తయారుచేసిన ఐఫోన్ 6 పేలడంతో పలువురు వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫోన్ పేలుళ్లకు సంబంధించి పలు ఆసక్తికర ఘటనలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అలజడి రేపిన స్మార్ట్‌ఫోన్ పేలుళ్లు

బీజింగ్, జూలై 8 2013 : ఐఫోన్ విద్యుత్ షాక్‌కు గురైన ఘటన చైనాలో కలకలం రేపింది. ఈ ఘటనలో గాయపడిన బాధితుడు 10 రోజులు కోమాలో స్థితిలో ఉండాల్సి వచ్చింది.

అలజడి రేపిన స్మార్ట్‌ఫోన్ పేలుళ్లు

మార్చి 2012 : గెలాకక్సీ ఎస్2 బ్యాటరీలో పేలుడు సంభవించటంతో దక్షిణ కొరియాకు చెందిన స్కూల్ విద్యార్థి గ్వాన్జూ చేతులను కాల్చుకున్నాడు.

అలజడి రేపిన స్మార్ట్‌ఫోన్ పేలుళ్లు

ఓ హ్యాకర్ డెఫ్కాన్‌కు హాజరవుతుండగా తన వెనుక జేబులోని స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ నుంచి మంటల చేలరేగాయి. అప్రమత్తం కావటంతో ప్రమాదం తప్పింది.

అలజడి రేపిన స్మార్ట్‌ఫోన్ పేలుళ్లు

ఫిబ్రవరి 2013: ప్యాంట్ జేబీలో సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ పేలటంతో 55 ఏళ్ల వ్యక్తి గాయాలపాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి సామ్ సంగ్ ఏ విధమైన విచారణను జరిపించలేదు.

అలజడి రేపిన స్మార్ట్‌ఫోన్ పేలుళ్లు

మార్చి 2013 : నిద్రమత్తులో ఉన్న ఓ నెక్సూస్ ఎస్ స్మార్ట్‌ఫోన్ యజమాని తన ఫోన్ మంటల్లో చిక్కుకున్నట్లు గమనించాడు. మంటలు అడుగు ఎత్తులో ఎగసిపడుతున్నాయి. అప్రమత్తంకావటంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.

అలజడి రేపిన స్మార్ట్‌ఫోన్ పేలుళ్లు

జూలై 2013 : సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 నుంచి హఠాత్తు పేలుడు సంభవించటంతో పనిలో నిమగ్నమై ఉన్న సదరు ఫోన్ యజమానికి తొడకు బలమైన గాయాలయ్యాయి. విచారణలో తేలిన విషయం ఏమిటంటే సదరు ఫోన్ లో ఉపయోగించిన బ్యాటరీ ఒరిజినల్‌ది కాదని తేలింది.

అలజడి రేపిన స్మార్ట్‌ఫోన్ పేలుళ్లు

అలజడి రేపిన స్మార్ట్‌ఫోన్ పేలుళ్లు

అలజడి రేపిన స్మార్ట్‌ఫోన్ పేలుళ్లు

అలజడి రేపిన స్మార్ట్‌ఫోన్ పేలుళ్లు

అలజడి రేపిన స్మార్ట్‌ఫోన్ పేలుళ్లు

అలజడి రేపిన స్మార్ట్‌ఫోన్ పేలుళ్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
New iPhone 6 blew up, claims user in Gurgaon. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot