బ్లాక్‌మనీ దెబ్బ : యూజర్లకి షాకిచ్చిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్

Written By:

ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ప్రకటించిన ఆపరేషన్ బ్లాక్ మనీ దెబ్బ ఈ కామర్స్ సైట్లను మీద కూడా పడింది. ప్రధాని రూ .500, రూ .1000 ల నోట్లను అనూహ్యంగా బ్యాన్ చేయడంతో ఇప్పుడు ఈ కామర్స్ దిగ్గజాలు కూడా తమదైన వ్యూహాలకు తెరలేపాయి. ప్రభుత్వ చర్యలకు అనుగుణంగానే తమ వ్యాపారంలో భారీ మార్పులను ప్రకటించాయి. ఇందులో భాగంగా సీవోడి ఆప్సన్ రద్దు చేశాయి.

Rip రూ. 500, సోషల్ మీడియాని వణికిస్తున్న జోకులు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్యాష్ ఆన్ డెలివరీ రద్దు

ప్రభుత్వం పెద్ద కరెన్సీ నోట్లను రద్దుచేయడంతో తాజా ఆర్డర్లపై క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ) సర్వీసులను ఈ రెండు రోజులు ఉపసంహరించుకుంటున్నట్టు ఈ కామర్స్ దిగ్గజాలు ప్రకటించాయి.

రూ .2000 వేలకు పైన ఉత్పత్తులపై

రూ .2000 వేలకు పైన ఉత్పత్తులపై క్యాష్ ఆన్ డెలీవరీ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసిందని జాతీయ మీడియా రిపోర్టు చేసింది. అలాగే ఫ్లిప్కార్ట్ ప్రస్తుతం క్యాష్ ఆన్ డెలివరీ సేవలను అనుమతించడం లేదని బ్లూం బర్గ్ నివేదించింది.

వెయ్యి రూపాయలకు పైన విక్రయాలపై

వెయ్యి రూపాయలకు పైన విక్రయాలపై సీఓడీ ఆప్షన్ ను నిలిపివేసినట్టు ఫ్లిప్ కార్ట్ ప్రతినిధి తెలిపారు. అమెజాన్ కూడా సీవోడి ఆప్లన్ డిసేబుల్ చేసింది. కొన్ని ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేశాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్నాప్ డీల్ అలాగే ఇతర సంస్థలు

వీరి బాటలోనే స్నాప్ డీల్ అలాగే ఇతర సంస్థలు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు క్యాష్ అన్ డెలివరీ ఇవ్వలేమంటూ  చెప్పేశాయి. 

రైడింగ్ సర్వీస్ ఉబెర్ కూడా

ఇక రైడింగ్ సర్వీస్ ఉబెర్ కూడా దీనిపై స్పందించింది. తమ కష్టమర్లు డిజిటల్ వ్యాలెట్ ద్వారానే పేమెంట్ చేయాలని క్యాష్ ఇవ్వవద్దని తెలిపింది. ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూ హర్షం వ్యక్తం చేసింది.

నల్లధనాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా

కాగా దేశంలో నల్లధనాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా ప్రధాని అనూహ్యంగా పెద్దనోట్ల చెలామణిని రద్దుచేస్తున్నట్టు మంగళవారం రాత్రి ప్రకటించారు. దీనికనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు.

ఒక వైపు ప్రశంసలు

ఈ ఆకస్మిక ప్రకటనపై ఒక వైపు ప్రశంసలు వెల్లువ కురుస్తుండగా, మరోవైపు దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు, టోల్ ప్లాజాలు, ఏటీఎం సెంటర్లతో సహా పలు కొనుగోలుకేంద్రాల వద్ద ప్రజలు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 English summary
No cash on delivery option if you order from Flipkart, Amazon India read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting